Aishwarya Rai Bachchan Sarbjit Movie Review

Teluguwishesh సర్బ్ జిత్ సర్బ్ జిత్ Get the first Sarbjit Movie Review and Rating here. Sarbjit Movie all set to go on 20 May, here is the Movie Review by Andhrawishesh. The lead cast are Aishwarya Rai Bachchan, Randeep Hooda and Richa Chadha Product #: 74825 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సర్బ్ జిత్

  • బ్యానర్  :

    గుల్షన్ కుమార్, పూజా ఎంటర్ టైన్మెంట్ అండ్ ఫిల్మ్స్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్

  • దర్శకుడు  :

    ఓమంగ్ కుమార్

  • నిర్మాత  :

    వాశూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ ముఖ్, సందీప్ సింగ్, ఓమంగ్ కుమార్, భుషన్ కుమార్, క్రిషన్ కుమార్

  • సంగీతం  :

    జీత్ గంగూలీ, అమాల్ మాలిక్, తనిష్క్ బగ్చీ, షైల్-ప్రీతేష్, శశి శివమ్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    కిరణ్ డియోహన్స్

  • ఎడిటర్  :

    రాజేష్.జి.పాండే

  • నటినటులు  :

    ఐశ్వర్యరాయ్ బచ్చన్, రణదీప్ హుడా, రిచా చడ్డా తదితరులు

Sarbjit Movie Review

విడుదల తేది :

2016-05-20

Cinema Story

ఇది నిజజీవితంలో సర్బ్ జిత్ జీవిత కథా ఆధారంగా రూపొందింది. సర్బ్ జిత్ సింగ్(రణదీప్ హుడా) ఓ పంజాబీ రైతు. అనుకోకుండా ఓ రోజు పాకిస్థాన్ బార్డర్ లోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత సర్బ్ జిత్ ను ఓ కేసులో ఇరికించి జైలు శిక్ష విధిస్తారు. సర్బ్ జిత్ కోసం అతని చెల్లెలు దల్బీర్ కౌర్(ఐశ్వర్య రాయ్) పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఏం జరిగిందనేది మిగతా కథాంశం.

cinima-reviews
సర్బ్ జిత్

ఇటీవలే ‘జజ్బా’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ నటించిన తాజా చిత్రం ‘సర్బ్ జిత్’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సర్బ్ జిత్ పాత్రలో రణదీప్ హుడా నటిస్తుండగా, అతని సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలనే పెంచేసింది. ఇందులో ఐశ్వర్య తన వయసుకు మించిన పాత్రను పోషించినట్లుగా తెలుస్తోంది. అలాగే న్యాయం కోసం పోరాటం చేసే ఓ వ్యక్తిగా కనిపిస్తోంది. ఓమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వాశూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ ముఖ్, సందీప్ సింగ్, ఓమంగ్ కుమార్, భుషన్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
సర్బ్ జిత్ అనే వ్యక్తి నిజజీవితం కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సర్బ్ జిత్ సింగ్ పాత్రలో రణదీప్ హుడా అద్భుతమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా జైలులో అనుభవించే శిక్షల సమయంలో రణదీప్ జీవించేసాడు. మొత్తానికి సర్బ్ జిత్ పాత్రకు రణదీప్ ప్రాణం పోసాడని చెప్పుకోవచ్చు. ఇక సర్బ్ జిత్ కోసం పోరాటం చేసే అతని చెల్లెలు దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్య రాయ్ చాలా చక్కగా నటించింది. తన అన్నను కాపాడుకోవడానికి పోరాటం చేసే ఓ చెల్లెలిగా ఐశ్వర్య రాయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక సర్బ్ జిత్ వైపు న్యాయవాది పాత్రలో దర్శన్ కుమార్ చాలా చక్కగా నటించాడు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఉత్కంఠగా నడుస్తూ వుంటుంది. సినిమా ప్రారంభం మొదటి 20 నిమిషాలు కాస్త సరదా సరదాగా గడిచిపోయిన.. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎక్కువ ఎమోషనల్ సీన్లు వర్కౌట్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:
కమర్షియల్ మాస్, యాక్షన్ ఎంటర్ టైనింగ్ సినిమాలను ఇష్టపడే మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కామెడీ, మాస్ సన్నివేశాలు వుండవు. అలాగే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఎమోషనల్ సీన్లు వుండటం వల్ల ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు.

సాంకేతికవర్గం పనితీరు:
సర్బ్ జిత్ సినిమా కథ సర్బ్ జిత్ అనే వ్యక్తి నిజజీవితం ఆధారంగా రూపొందింది కాబట్టి... ముఖ్యంగా అలాంటి కష్టాలను అనుభవించిన అతని కుటుంబ సభ్యులకు మేలు జరగాలని కోరుకుందాం. ఇక ఈ సినిమాను దర్శకుడు ఓమంగ్ కుమార్ చాలా చక్కగా తెరకెక్కించాడు. పర్ఫెక్ట్ స్ర్కీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫి బాగుంది. మ్యూజిక్ సినిమాకు బాగా సెట్ అయ్యింది. డైలాగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ విషయంలో మరింత ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
సర్బ్ జిత్: ఓ పోరాడే యువకుని కథ