Eedo Rakam Aado Rakam | Manchu Vishnu | Review and Rating | Raj Taru | Hebha Patel

Teluguwishesh ఈడోరకం ఆడోరకం ఈడోరకం ఆడోరకం Get The Complete Details of Eedo Rakam Aado Rakam Telugu Movie Review. featuring Manchu Vishnu, Raj Tarun, Sonarika, Sonarika Bhadoria, Rajendra Prasad among others. Directed by G Nageswara Reddy. Music by Sai Karthik, Produced by Ramabrahmam Sunkara. For More Details Visit Teluguwishesh.com Product #: 73895 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఈడోరకం ఆడోరకం

  • బ్యానర్  :

    ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి

  • దర్శకుడు  :

    జి.నాగేశ్వరరెడ్డి

  • నిర్మాత  :

    రామబ్రహ్మం సుంకర

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    సిద్ధార్థ

  • ఎడిటర్  :

    ఎం.ఆర్.వర్మ

  • నటినటులు  :

    మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు.

Eedo Rakam Aado Rakam Review

విడుదల తేది :

2016-04-14

Cinema Story

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అర్జున్(మంచు విష్ణు), అశ్విన్(రాజ్ తరుణ్). అల్లరిచిల్లరగా తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఓ ఫ్రెండ్ పెళ్లిలో నీలవేణి(సోనారిక)ను చూసి ప్రేమలో పడతాడు అర్జున్. నీలవేణిని ప్రేమలో పడేసేందుకు ఆమెతో తాను అనాధననే అబద్ధం చెబుతాడు అర్జున్. ఈ అబద్ధం వల్ల అర్జున్, అశ్విన్ ల జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లోనే నీలవేణికి భర్తగా అశ్విన్, అలాగే అశ్విన్ ప్రేమించిన అమ్మాయి సుప్రియ(హేభ పటేల్)కు భర్తగా అర్జున్ పరిచయం అవ్వాల్సి వస్తుంది. ఇలా ఎందుకు జరిగింది? అసలు ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అర్జున్, అశ్విన్ జీవితాల్లో వచ్చిన అనుకోని సంఘటనలు ఏంటి? చివరకు ఎవరు ఎవరితో సెటిల్ అయ్యారు అనే అంశాలను వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
ఈడోరకం ఆడోరకం

మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్ హీరో హీరోయిన్స్ ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. సాయి కార్తీక్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. అలాగే ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యూటీఫుల్ కన్ఫ్యుజన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈరోజు (ఏప్రిల్ 14న) గ్రాండ్ గా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో అర్జున్, అశ్విన్ పాత్రలలో మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు చక్కగా నటించారు. రాజ్ తరుణ్ ఎప్పటిలాగే తన డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నాడు. మంచి ఎనర్జీ వున్న క్యారెక్టర్ చేసాడు. ఇక అర్జున్ పాత్రలో విష్ణు ఒదిగిపోయాడు. మంచి కామెడీ టైమింగ్ తో నటించాడు. ఇక ఈ సినిమాకు సోనారిక, హేభ పటేల్ ల గ్లామర్ బాగా ప్లస్ అయ్యింది. సోనారిక అందచందాలు, హేభ పటేల్ క్యూట్ క్యూట్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. పిచ్చెక్కించే అందాలతో కనువిందు చేసారు. ఇక ఈ సినిమాకు మేజర్ కామెడీ ఎంటర్ టైనర్ లాయర్ నారాయణ. ఈ పాత్రలో రాజేంద్రప్రసాద్ తనదైన టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు.

ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్ టైనింగ్ గా కామెడీ, లవ్ సన్నివేశాలతో కొనసాగుతోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. కొక్కో కోడి, టైటిల్ సాంగ్ పాటలు వినడానికి, విజువల్స్ పరంగా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ ఎక్కువయ్యింది.

మైనస్ పాయింట్స్:
ఇలాంటి కథతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. కథను చాలా ఎంటర్ టైనింగ్ గా చూపించాలని అనుకున్నారు కానీ.. ఎమోషనల్ బాండింగ్ మిస్ అయ్యారు. కథలో ఎమోషన్ కు స్కోప్ వున్నా కూడా కేవలం కామెడీనే టార్గెట్ చేస్తూ తీసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్ టైనింగ్ సాగితే.. సెకండ్ హాఫ్ బోర్ గా అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే కాస్త అక్రమ సంబంధం వున్న సీన్లు ఎక్కువగా వున్నట్లుగా అనిపిస్తున్నాయి. అలాగే బోల్డ్ డైలాగ్స్. ఇక క్లైమాక్స్ ఫైట్ అవసరమే లేదు.

సాంకేతికవర్గం పనితీరు:
సిద్ధార్థ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. విజువల్స్ పరంగా కొక్కో కోడి పాట సూపర్బ్. రీరికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక దర్శకుడిగా జి. నాగేశ్వర రెడ్డి తను అనుకున్న కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్ టైనర్ ను తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో, ఆర్టిస్టుల నుంచి మంచి ప్రతిభ రాబట్టడంలో జి. నాగేశ్వరరెడ్డి పనితీరు కనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ను మరింత బాగా డిజైన్ చేసుకొని వుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘ఈడోరకం ఆడోరకం’: పర్వాలేదనిపించే కామెడీ ఎంటర్ టైనర్.