Oopiri | Nagarjuna | Review and Rating | Karthi | Tamannah

Teluguwishesh ఊపిరి ఊపిరి Get The Complete Details of Oopiri Telugu Movie Review. The Latest Telugu Movie Oopiri is a family drama acted by King Nagarjuna, Karthi, Thamanna, Directed by Vamsi Paidipally and Music by Gopi Sundar. For More Details Visit Teluguwishesh.com Product #: 73405 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఊపిరి

  • బ్యానర్  :

    పివిపి

  • దర్శకుడు  :

    వంశీ పైడిపల్లి

  • నిర్మాత  :

    పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే

  • సంగీతం  :

    గోపిసుందర్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    పి.ఎస్‌.వినోద్

  • ఎడిటర్  :

    మధు

  • నటినటులు  :

    నాగార్జున, కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణి తదితరులు.

Oopiri Movie Review

విడుదల తేది :

2016-03-25

Cinema Story

ఓ ప్రమాదంలో కాళ్లు, చేతులు పనిచేయకుండా వీల్ చైర్ కు అంకితమయిన కోటీశ్వరుడు విక్రమ్ ఆదిత్య(నాగార్జున). తన బాగోగులను చూసుకోవడానికి ఓ కేర్ టేకర్ కోసం వెతుకుతుంటాడు. ఇదే సమయంలో ప్రతిరోజు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ డబ్బుంటేనే సంతోషం వుంటుందని భావించే శ్రీను(కార్తీ), విక్రమ్ దగ్గర ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళతాడు. విక్రమ్ కు శీను నచ్చడంతో అతడికి జాబ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? డబ్బు వుండి కూడా సంతోషంగాలేని విక్రమ్ ఏం చేసాడు? డబ్బులు లేని శీను సంతోషం కోసం ఏం చేసాడు? అసలు విక్రమ్ కు జరిగిన ప్రమాదం ఏంటి? విక్రమ్, శీనులు కలిసిన తర్వాత వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
ఊపిరి

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఊపిరి’. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మాతలు పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే సంయుక్తంగా నిర్మించారు. గోపిసుందర్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు అంచనాలను పెంచేసాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా, ఈరోజు (మార్చి 25) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
నటీనటుల విషయానికొస్తే... ‘ఊపిరి’ సినిమాకు ముగ్గురు మేజర్ ప్లస్ పాయింట్స్. నాగార్జున, కార్తీ, తమన్నా. కాళ్లు, చేతులు చచ్చుబడిపోయిన ఓ కోటిశ్వరుడి పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించాడు. ఎప్పుడు రొమాంటిక్, యాక్షన్ మాస్ పాత్రలలో నటించిన నాగార్జున.. ఇలాంటి విక్రమ్ క్యారెక్టర్ తో కూడా మెప్పించాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నాగార్జున తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. తన నటన, హవాభావాలు, ఎమోషన్స్ తో కట్టిపడేసాడు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నాగార్జున తన పాత్రలో చాలా డీసెంట్ గా నటించి, మెప్పించేసాడు.

ఇక ‘ఊపిరి’ సినిమాకు మరో క్రేజ్ కార్తీ. మధ్యతరగతి వ్యక్తిగా, డబ్బులుంటేనే సంతోషం వుంటుందని భావించే కుర్రాడిగా కార్తీ చాలా చక్కగా నటించాడు. తన అల్లరి చేష్టలతో బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ దగ్గర ఉద్యోగం కోసం వచ్చినప్పుడు,.. ఆ తర్వాత ఉద్యోగం చేరిన క్షణం నుంచి కార్తీ నటన భీభత్సం. ఆ పాత్రలో కార్తీని తప్ప మరెవరినీ ఊహించుకోలేమనే విధంగా చేసాడు. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, చలాకీతనం,.. ఇలా అన్ని అంశాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నాగార్జున-కార్తీల మధ్య వచ్చే సీన్లు తెగ ఎంటర్ టైనింగ్ అండ్ ఎమోషనల్ గా వుంటాయి.

‘ఊపిరి’ సినిమాకు గ్లామర్ క్వీన్ తమన్నా. ఇందులో విక్రమ్ కు పిఎ పాత్రలో తమన్నా నటించింది. తన పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా తమన్నా మంచి మార్కులనే కొట్టేసింది. ఇక కార్తీ-తమన్నాల మధ్య వచ్చే సీన్లు సూపర్బ్. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇందులో తమన్నా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. అనుష్క, శ్రియల స్పెషల్ అప్పియరెన్స్ మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.

ఇక సినిమా విషయానికొస్తే... ‘ది ఇంటచబుల్స్’ అనే సినిమా ఆధారంగా రూపొందిన ‘ఊపిరి’ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా వుండటం ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మి, ధైర్యం చేయడం పెద్ద సాహసమేనని చెప్పుకోవాలి. డబ్బు, సంతోషం, ఆనందం, జీవితం... ఇలా కొన్ని అంశాలను తీసుకొని.. సింపుల్ స్టోరీలైన్ తో రూపొందినప్పటికీ... కథనం మాత్రం అదిరింది. నాగార్జున-కార్తీల జర్నీ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూసామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది.

మైనస్ పాయింట్స్:
‘ఊపిరి’ సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఏమిలేవు. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:
ఈ చిత్రానికి దాదాపు సాంకేతికవర్గం అంతా కూడా ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ముందుగా దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుకుంటే.... ఒక ఫ్రెంచ్ ‘ఇంటచబుల్స్’ సినిమాలోని బేసిక్ ఎమోషన్ ను ఎక్కడ మార్చకుండా తీసుకొని, దాని తెలుగు నేటివిటికి, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా మార్చుకొని రాసుకున్న స్ర్కీన్ ప్లే అద్భుతం. అందులో వంశీ పైడిపల్లి వర్క్ స్క్రీన్ మీద అద్భుతంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ను చాలా సూపర్బ్ గా రాసుకున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మరింత జాగ్రత్తగా డిజైన్ చేసుకొని వుంటే ఇంకా అదిరిపోయేది. మొత్తానికి వంశీ పైడిపల్లి ‘ఊపిరి’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు.

పిఎస్.వినోద్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా, అదరగొట్టేసాడు. ప్రతి ఫ్రేం చాలా అద్భుతంగా చూపించారు. కథకు తగ్గ ఎమోషన్ ను చివరి వరకు కూడా అలాగే కంటిన్యూ చేసాడు. ఇక వినోద్ సినిమాటోగ్రఫికి గోపిసుందర్ మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. పాటలు వినడం కంటే స్ర్కీన్ మీద విజువల్స్ తో పాటు చూస్తుంటే అదిరిపోయాయి. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజికి ఈ సినిమాకి ఊపిరి పోసిందని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చాలా బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది.

భారీ బడ్జెట్ తో పివిపి నిర్మాణ సంస్థ అద్భుతంగా రూపొందించారు. విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఖర్చుకు వెనుకాడకుండా రూపొందించినట్లుగా కనిపిస్తోంది. అసలు ఇలాంటి కథతో సినిమా తీయాలనే ధైర్యం చేసినందుకు పివిపి నిర్మాణ సంస్థకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మొత్తానికి పివిపి బ్యానర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ నమోదయ్యింది.

చివరగా:
‘ఊపిరి’: పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.


- Sandy