Sankarabharanam Movie Review | Nikhil Sankarabharanam Review | Sankarabharanam Movie Review And Rating

Teluguwishesh శంకరాభరణం శంకరాభరణం Get information about Sankarabharanam Movie Telugu Review, Sankarabharanam Movie Review, Nikhil Sankarabharanam Movie Review, Sankarabharanam Movie Review And Rating, Sankarabharanam Telugu Movie Talk, Sankarabharanam Movie Trailer, Nikhil Sankarabharanam Review, Sankarabharanam Movie Gallery and more only on Teluguwishesh.com Product #: 70804 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    శంకరాభరణం

  • బ్యానర్  :

    ఎం.వి.వి. సినిమా

  • దర్శకుడు  :

    ఉదయ్ నందనవనమ్

  • నిర్మాత  :

    ఎం.వి.వి. సత్యనారాయణ

  • సంగీతం  :

    ప్రవీణ్ లక్కరాజు

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    సాయి శ్రీరామ్

  • ఎడిటర్  :

    చోటా కె. ప్రసాద్

  • నటినటులు  :

    నిఖిల్, నందిత, అంజలి, దీక్షాపంత్, సప్తగిరి తదితరులు

Sankarabharanam Movie Review

విడుదల తేది :

2015-12-04

Cinema Story

మిలినీయర్ గౌతమ్(నిఖిల్) కథే ఈ ‘శంకరాభరణం’. తన తండ్రి (సుమన్) బిజినెస్ లో అప్పులపాలవ్వడంతో పార్ట్ నర్స్ కలిసి సూసైడ్ చేసుకోవాలని అనుకుంటారు. అయితే గౌతమ్ తల్లికి బీహర్ లో ఓ ప్యాలెస్ వుంటుంది. అది అమ్మేసి తన తండ్రిని ఈ ఫైనాన్సియల్ సమస్యల నుంచి కాపాడాలనుకుంటాడు. అందుకోసం గౌతమ్ బీహర్ కు బయలుదేరుతాడు. సీన్ కట్ చేస్తే... బీహర్ లో కిడ్నాప్ లు చేయడం కామన్. కిడ్నాప్ చేస్తూ డబ్బులు సంపాదించడం అక్కడివాళ్ల పని. ప్యాలెస్ అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్లిపోవాలనుకున్న గౌతమ్ ను కిడ్నాప్ చేస్తారు. ఇక అక్కడి నుంచి అలాంటి అసలు కథ మొదలవుతోంది. అసలు గౌతమ్ ను ఎవరు కిడ్నాప్ చేసారు? ఎందుకు కిడ్నాప్ చేసారు? గౌతమ్ ను ఎంతమంది కిడ్నాప్ చేసారు? మున్నిదీదీ ఎవరు? మరి గౌతమ్ ప్యాలెస్ ను అమ్మేసాడా లేదా? చివరకు ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూసి ఆనందించాల్సిందే.

cinima-reviews
శంకరాభరణం

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘శంకరాభరణం’. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని, U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.

నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ అంజలి ఇందులో ఓ లేడి డాన్ పాత్రలో నటించింది. దీక్షా పంత్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. లవ్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 4) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఎన్నారై పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడు. మిలీనియర్ కొడుకుగా అఖిల్ యాక్టింగ్ బాగుంది. లుక్స్, మానరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. హీరోయిన్ నందిత తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇందులో ఫన్ ఎంటర్ టైన్ చేసే పాత్రలో నందిత తన క్యూట్ క్యూట్ లుక్స్ తో, డైలాగ్స్ తో ఆకట్టుకుంది. బందిపోటు మున్నీ పాత్రలో అంజలి అదరగొట్టేసింది. తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయింది. అలాగే ‘గంట గంట..’ పాత్రలో దుమ్మురేపింది. ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది.

ఇక కమెడియన్స్ 30 ఇయర్స్ పృథ్వి, సప్తగిరిలు తమ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలతో ప్రేక్షకులను కాస్త నవ్వించారు. సంపత్ రాజ్ నెగటివ్ షేడ్స్ పాత్రలో మరోసారి మెప్పించాడు. ఇక రావు రమేష్, సుమన్ తదితరులు వారివారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్ టైనింగ్ గా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తోంది.

మైనస్ పాయింట్స్:

ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కథ పాతదే అయినప్పటికీ కథనంలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. హిందీలో 2010లో వచ్చిన ‘పస్ గయారే ఒబామా’ అనే సినిమాకి స్పూర్తిగా తెలుగులో రీమేక్ చేసారు. కానీ ఒరిజినల్ కంటే మరింత గొప్పగా లేకపోగా, అసలు కథను దెబ్బతీసిందనే చెప్పుకోవాలి. ఇక ఇందులో చాలా ఎక్కువ పాత్రలు వుండేసరికి ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవలేకపోతున్నారు. పైగా ఆ పాత్రలకు సరైన విధంగా ప్రజెంట్ చేయలేకపోయారు.

ఫస్ట్ హాఫ్ ఏదో సరదా సరదాగా పర్వాలేదనిపించినా... సెకండ్ హాఫ్ మాత్రం మరి దారుణం. చాలా చోట్ల జనాలు బోర్ గా ఫీలయ్యే సన్నివేశాలున్నాయి. అంజలి పాత్ర ఈ సినిమాలో చాలా గొప్పగా వుంటుందని ఊహించుకొని వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది. ఇందులో అంజలి పాత్ర నిడివి చాలా తక్కువగా వుండటం నిరాశగా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ లోని సన్నివేశాలు బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. నిఖిల్, నందితల లావ్ ట్రాక్ కూడా ఓకే ఓకేగా అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:

‘శంకరాభరణం’ సినిమాను విజువల్స్ పరంగా అద్భుతంగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్. బీహర్ లొకేషన్స్ లో చాలా చక్కగా చూపించాడు. ప్రవీణ లక్కరాజు సంగీతం బాగుంది. పాటలు సూపర్బ్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగోలేదు. ఇక ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వ పర్యావేక్షణ చేసిన కోన వెంకట్ పర్వాలేదనిపించాడు. కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మరింత బాగా వర్కౌట్ చేసుంటే బాగుండేది. పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. దర్శకత్వ పర్యావేక్షకుడిగా కోన వెంకట్ ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక దర్శకుడిగా ఉదయ్ నందనవనం పర్వాలేదనిపించాడు. కానీ తనకిచ్చిన స్ర్కిప్ట్ కు తగిన ఎమోషన్స్ ను రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా చాలా గ్రాండ్ గా వుంది.

చివరగా:

‘శంకరాభరణం’: కాస్త నవ్వించే బోరింగ్ సినిమా