The Full Telugu Review Of Rudhramadevi Movie | Anushka | Allu Arjun | Rana Daggubati | Gunasekhar | Telugu Movies

Teluguwishesh రుద్రమదేవి రుద్రమదేవి Rudhramadevi Movie Telugu Review Director Gunashekhar : The Full Telugu Review Of Rudhramadevi Movie Which Is Directed By Gunasekhar. Product #: 68948 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రుద్రమదేవి

  • బ్యానర్  :

    గుణా టీం వర్క్స్

  • దర్శకుడు  :

    గుణశేఖర్

  • నిర్మాత  :

    గుణశేఖర్

  • సంగీతం  :

    ఇళయరాజా

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    అజయన్ విన్సెంట్

  • ఎడిటర్  :

    శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    అనుష్క, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, కృష్ణం రాజు తదితరులు

Rudhramadevi Movie Review

విడుదల తేది :

2015-10-09

Cinema Story

కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణిరుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఇక సినిమా స్టోరీలోకి వెళితే... 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతిదేవుడు(కృష్ణంరాజు) పరిపాలిస్తుంటాడు. అతనికి కుమారుడు కాకుండా కూతురు జన్మిస్తుంది. దీంతో అతడి తర్వాత రాజ్యాన్ని పాలించేందుకు వారసులు లేకపోవడంతో ఆమెను వారసురాలుగా కాకుండా వారసుడుగా కాకతీయ ప్రజలకు తెలియజేస్తాడు.

ఆ అమ్మాయిని భవిష్యత్తులో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించే రాణిని చేసేలా పెంచుతుంటాడు మహామంత్రి శివదేవయ్య(ప్రకాష్ రాజ్). ఇక చిన్నప్పటి నుంచి రుద్రదేవ(రుద్రమదేవి) సకలకళా విద్యల్లో ఆరితేరుతుంది. గణపతి దేవుడు తర్వాత రాజ్య సింహాసనం అధిష్టించేది రుద్రదేవ అనే ప్రజలందరూ అనుకుంటారు. కానీ సరైన సమయం చూసుకొని రుద్రదేవ రాజు కాదు.. ఆమె రాణి రుద్రమదేవి అంటూ శివదేవయ్య ప్రకటిస్తాడు. కానీ ఈ విషయాన్ని కాకతీయ ప్రజలు వ్యతిరేకిస్తారు.

దీంతో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని వీడాల్సి వస్తుంది. ఇదే అదనుగా భావించిన మహాదేవ(విక్రమ్ జిత్) కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తుంటాడు. నిడదవోలు పాలకుడగు చాళుక్య వీరభద్రుడు(దగ్గుబాటి రానా) రుద్రమదేవికి అత్యంత సన్నిహితుడు. ఆమెకు ఎప్పుడూ సహకరిస్తూ వుంటాడు. ఇక ఈ సామ్రాజ్యంలో ప్రజల హక్కుల కోసం పోరాడే గోన గన్నారెడ్డి(అల్లు అర్జున్) కాకతీయ సామ్రాజ్యంపై ఎదురు తిరుగుతాడు. చివరకు తన కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి గోనగన్నారెడ్డి సాయాన్ని కోరుతుంది రుద్రమదేవి. ఇక గోనగన్నారెడ్డి, చాళుక్య వీరభద్రుడి సాయంతో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేసింది? అసలు రుద్రమదేవికి వచ్చిన ఆటంకాలేంటి? గోనగన్నారెడ్డి, రుద్రమదేవికి ఎందుకు శతృత్వం? చాళుక్య వీరభద్రుడికి రుద్రమదేవికి వున్న సంబంధం ఏంటి? చివరకు కాకతీయ సామ్రాజ్యం ఏమయ్యింది? మహాదేవుడిని ఎలా ఎదుర్కొన్నారు? అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
రుద్రమదేవి

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క టైటిల్ రోల్ లో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణాటీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకనిర్మాణంలో శ్రీమతి రాగిణీ గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి సంయుక్తంగా నిర్మించారు. ఈ హిస్టారికల్ త్రీడి స్టీరియోస్కోపిక్ చిత్రం గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించారు. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ‘రుద్రమదేవి’ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదిన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన మరో ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. నేడు(అక్టోబర్ 9) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

రుద్రమదేవి పాత్రకు ఇద్దరు ప్లస్ పాయింట్స్. ఒకరు అనుష్క, రెండవది అల్లు అర్జున్. రుద్రమదేవి, రుద్రదేవ పాత్రలలో అనుష్క అద్భుతంగా నటించింది. ఆ రెండు పాత్రలకు చక్కని న్యాయం చేసింది. రుద్రమదేవి పాత్రలో అనుష్క ఇరగదీసింది. ముఖ్యంగా రుద్రమదేవిగా ఆ రాజసం, హుందాతనం, రాజ్యం కోసం పోరాడే యువతిగా తన హవాభావాలతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఇందులో అనుష్క ధరించిన దుస్తులు, ఆభరణాలు బాగా సెట్ అయ్యాయి. యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీలలో అనుష్క చక్కటి నటన కనబరిచింది.

ఇక గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(బన్ని) అదరగొట్టేసాడు. బన్ని స్ర్కీన్ మీద కనిపించేసరికి ఎక్కడలేని ఓ పవర్ సినిమాకు కలిసినట్లుగా అనిపించింది. గోనగన్నారెడ్డిగా మాస్ లుక్ లో, తెలంగాణ యాసలో మాట్లాడుతూ దుమ్మురేపేసాడు. గోనగన్నారెడ్డి గుర్రపుస్వారీ చేస్తుంటే అదిరిపోయింది. ఈ సినిమాకు బన్నీ చాలా ఎనర్జీని తీసుకొచ్చాడు. గోనగన్నారెడ్డి పాత్రలో తెలంగాణ యాసలో బన్నీ డైలాగ్స్ చెబుతుంటే థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. ఇక అనుష్క-బన్నీల మధ్య వచ్చే సన్నీవేశాలు అద్భుతంగా వున్నాయి. ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సమయంలో రుద్రమదేవితో గోనగన్నారెడ్డి సవాల్ చేసే సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

ఇక చాళుక్య వీరభద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా చాలా చక్కగా నటించాడు. రుద్రమదేవికి సపోర్ట్ చేసే పాత్రలో రానా నటించాడు. కానీ సినిమాలో రానా పాత్ర అంతా ఊహించుకున్నంతగా లేదు. అనుష్క-రానాల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ పర్వాలేదనిపించాయి.

మహామంత్రిగా ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటన కనబరిచారు. ఇక కృష్ణంరాజు, బాబా సెహగల్, విక్రమ్ జిత్, హంసా నందిని, నిత్యామీనన్ తదితరులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

‘రుద్రమదేవి’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గానే ముగించేసారు. మొత్తానికి పర్వాలేదనిపించేలా వుంది.

మైనస్ పాయింట్స్:

‘రుద్రమదేవి’ హిస్టారికల్ సినిమా కావడంతో మరింత ఇంట్రస్టింగ్ గా చూపిస్తే బాగుండేది. కానీ సెకండ్ హాఫ్ లో మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కథనంలో మరింత స్లో గా నడిపించడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. సినిమా విడుదలకు ముందు రానా పాత్రకు సంబంధించి ఇచ్చిన బిల్డప్.. సినిమాలో అంతగా ఏమాత్రం లేకపోవడం కాస్త మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

ఇక ఇళయరాజా పాటలు సినిమాకు ఏ విధంగా కూడా ప్లస్ అవలేదు. పైగా సినిమా స్పీడ్ కు అడ్డుగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా కాకుండా కాస్త సింపుల్ గానే ముగించేసారు.

సాంకేతికవర్గ పనితీరు:

సాంకేతిక విభాగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకనిర్మాత గుణశేఖర్ గురించి. ఈ సినిమా కోసం దర్శకనిర్మాతగా మారి ఎన్నో సంవత్సరాలు కష్టపడి, భారీగా డబ్బు ఖర్చు చేసి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన ‘రుద్రమదేవి’ హిస్టారికల్ జీవితచరిత్రను సినిమాగా రూపొందించినందుకు ముందుగా గుణశేఖర్ కు అభినందనలు.

ఇక ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తాను అనుకున్న విధంగా స్ర్కీన్ మీద ప్రజెంట్ చేయడంలో బాగానే సక్సెస్ అయ్యాడు. తాను రాసుకున్న కథకు, సరైన పాత్రదారులను ఎంపిక చేసుకొని అద్భుతంగా తెరకెక్కించాడు. ఓ చారిత్రాత్మక సినిమాకు అదనపు హంగులు, స్టార్ హీరోహీరోయిన్లతో తెరకెక్కించి, సినిమా రేంజును భారీగా పెంచేసి చాలా చక్కగా రూపొందించారు. కానీ స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో స్ర్కీన్ ప్లే మరింత పక్కాగా ప్లాన్ చేసుకొని వుంటే సినిమా మరింత సూపర్బ్ గా వచ్చేది. మొత్తానికి గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాతో దర్శకుడిగా భాగానే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ఇళయరాజా పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకు కాస్త హెల్ప్ అయ్యింది. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి విజువల్స్ ను కూడా చాలా గ్రాండ్ గా చూపించారు. కాకతీయ సామ్రాజ్యం నాటి కట్టడాలు, కోటలను అద్భుతంగా చూపించారు. ఇక ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు అవసరమయ్యే గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది. కొన్నికొన్ని సీన్లలో గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా వుంది. పీటర్ హెయిన్స్/విజయన్ సంయుక్తంగా కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు పర్వాలేదనిపించాయి.

‘రుద్రమదేవి’ సినిమాకు కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. రుద్రమదేవి ధరించే దుస్తులు, ఆభరణాలు చాలా చక్కగా కుదిరాయి. అలాగే బన్నీని ‘గోనగన్నారెడ్డి’ గెటప్ లో చూపించే బ్లాక్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. మిగతా పాత్రధారుల కాస్ట్యూమ్స్ కూడా బాగా కుదిరాయి. ఇక తోట తరణి అద్భుతమైన ఆర్ట్ వర్క్ చూపించారు. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ‘రుద్రమదేవి’ సినిమాలో ప్రతి పైసా కష్టం కనబడుతోంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా వున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:

‘రుద్రమదేవి’: అద్భుతమైన చారిత్రాత్మక చిత్రం