The Full Teluvu Review Of Hora Hori Movie | Director Teja | Telugu Movies

Teluguwishesh హోరా హోరీ హోరా హోరీ Hora Hori Movie Teluvu Review Director Teja : The Full Teluvu Review Of Hora Hori Movie Which Is Directed By Teja. Product #: 68067 1 stars, based on 1 reviews
  • చిత్రం  :

    హోరా హోరీ

  • బ్యానర్  :

    శ్రీ రంజిత్ మూవీస్

  • దర్శకుడు  :

    తేజ

  • నిర్మాత  :

    కె.ఎల్.దామోదర్ ప్రసాద్

  • సంగీతం  :

    కోడూరి కళ్యాణ్

  • సినిమా రేటింగ్  :

    1  1

  • ఛాయాగ్రహణం  :

    దీపక్ భగవంత్

  • ఎడిటర్  :

    జునైద్

  • నటినటులు  :

    దిలీప్, దక్ష త‌దిత‌రులు

Hora Hori Movie Teluvu Review Director Teja

విడుదల తేది :

2015-09-11

Cinema Story

సాంప్రదయమైన కుటుంబానికి చెందిన బాగా చదువుకున్న అమ్మాయి మైథిలి(దక్ష). నరరూప రాక్షసుడిగా ప్రవర్తించే క్రిమినల్ బసవేశ్వర్(ఛస్వ) అనుకోకుండా మైథిలిని చూసి ప్రేమలో పడతాడు. మైథిలిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే వారిని చంపేస్తుంటాడు బసవేశ్వర్. దీంతో మానసికంగా మైథిలి చాలా కృంగిపోతుంది. దీంతో మైథిలిని తీసుకొని తన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఓ చిన్న గ్రామానికి తీసుకెళ్తారు. అక్కడే స్కంద(దిలీప్) పరిచయమవుతాడు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారుతుంది. ఇక ఆ తర్వాత బసవేశ్వర్ నుంచి స్కంద ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారి ప్రేమకోసం ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? చివరకు ఏం జరిగింది? అనే అంశాలు మిగతా కథాంశం.

cinima-reviews
హోరా హోరీ

ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో 'అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తరువాత' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర్ ప్రసాద్ నిర్మాతగా, 'చిత్రం, ‘నువ్వు నేను’, జయం' అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన తేజ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హోరా హోరీ’. దిలీప్,దక్ష హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 11) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ పెద్దగా ఏం లేవు కానీ... హీరోహీరోయిన్ల నటన, విలన్ యాక్టింగ్, అలాగే కళ్యాణి కోడూరి సంగీతం ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. సంగీతం గురించి సాంకేతిక విభాగంలో చర్చించుకుందాం. ఇక నటీనటుల విషయానికొస్తే... హీరోహీరోయిన్లుగా నటించిన దిలీప్, దక్షలు చాలా చక్కగా నటించారు. వారి వారి పాత్రకు తగిన న్యాయం చేసారు. ఇక విలన్ గా నటించిన ఛస్వ తన పాత్రకు తగిన న్యాయం చేసాడు. విలన్ పాత్రలో జీవించేసాడు. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్:
పైన తెలిపిన హీరోహీరోయిన్ల నటన, విలన్ యాక్టింగ్ తప్ప మిగతాదంతా కూడా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా నిడివి బాబోయ్ అనిపించేసింది.

సాంకేతికవర్గ పనితీరు:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కళ్యాణి కోడూరి అందించిన సంగీతం. కళ్యాణి కోడూరి అద్భుతంగా సంగీతాన్ని అందించారు. పాటలు పర్వాలేదనిపించినా... బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. కళ్యాణి కోడూరి రీరికార్డింగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక సినిమాటోగ్రఫి కొన్ని చోట్ల పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ వేస్ట్. ఇక ఇతర దర్శకులపై మొన్నటివరకు కామెంట్లు చేసిన దర్శకుడు తేజ... చాలా చెత్త సినిమా తీసాడనే చెప్పుకోవచ్చు. తన పాత సినిమాలోని కథలకే అటు, ఇటు మార్చేసి, పాత్రలను మార్చేసి తీసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమా కంటే గతంలో తేజ తీసిన పలు ఫ్లాప్ సినిమాలైనా బెటర్ అని అనిపించేలా వుంది ఈ హోరా హోరీ. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

చివరగా:
హోరా హోరీ: బాబోయ్ అనిపించేలా వుంది!