The Full Review Of Baahubali The Begining Movie | Prabhas | Rana | Anushka | Tamanna | Rajamouli

Teluguwishesh బాహుబలి - ది బిగినింగ్ బాహుబలి - ది బిగినింగ్ Baahubali Movie Telugu Review Prabhas Rana Anushka Tamanna Rajamouli : The Full Review Of Baahubali The Begining Movie Which Is Directed By Rajamouli. In this Movie Prabhas, Rana Acting in Lead Role and Anushka, Tamanna as Actresses. Product #: 66058 3.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బాహుబలి ది బిగినింగ్

  • బ్యానర్  :

    ఆర్కా మీడియా వర్క్స్

  • దర్శకుడు  :

    ఎస్.ఎస్.రాజమౌళి

  • నిర్మాత  :

    శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని

  • సంగీతం  :

    యం.యం.కీరవాణి

  • సినిమా రేటింగ్  :

    3.753.753.75  3.75

  • ఛాయాగ్రహణం  :

    కె.కె.సెంథిల్ కుమార్

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు

  • నటినటులు  :

    ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ తదితరులు

Baahubali Movie Telugu Review Prabhas Rana Anushka Tamanna Rajamouli

విడుదల తేది :

2015-07-10

Cinema Story

‘బాహుబలి’ సినిమా మహిష్మతి రాజ్యంలో ప్రారంభం అవుతుంది. శివగామి(రమ్యకృష్ణ) తన కొడుకుని ఎత్తుకొని శత్రువుల భారీ తప్పించుకుంటూ వెళ్తూ ఓ భారీ జలపాతంలో పడిపోతుంది. బిడ్డను కాపాడుతూ నీటిలో ఒడ్డుకు చేర్చి, తాను చనిపోతుంది. ఆ బిడ్డను అంబలి గ్రామానికి చెందిన ఓ కొండజాతి స్త్రీ(రోహిణి) రక్షిస్తుంది. ఆ బిడ్డకు శివుడు అనే పేరు పెడతారు. శివుడికి తన గ్రామానికి ఆనుకొని వున్న కొండపైన ఏముందో తెలుసుకోవాలనే కోరికతో వుంటాడు. ఆ కొండను ఎక్కడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎక్కలేకపోతాడు. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ కొండపై నుంచి పడిపోయిన ఓ మాస్క్ శివుడికి దొరుకుతుంది. అంటే కొండపైన ఎవరో వున్నారని భావించిన ఆ కొండపైకి ఎక్కేస్తాడు. అయితే అక్కడ అవంతిక(తమన్నా)ను చూసి ప్రేమలో పడతాడు.

కానీ అక్కడ అవంతికను ఎవరో కొంతమంది దుండగులు చంపాలని ప్రయత్నిస్తుంటారు. వారి బారీ నుంచి శివుడు కాపాడతాడు. ఆ తర్వాత అవంతిక మహిష్మతి రాజ్యం రాజు భల్లలాదేవ దగ్గర బందీగా వున్న దేవసేనను విడిపించే లక్ష్యంతో పోరాడుతుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు దేవసేనను విడిపించడానికి మహిష్మతికి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవసేనను కాపాడటం కోసం శివుడు ఏం చేసాడు? అవంతిక ఎవరు? దేవసేన ఎందుకు బందీగా వుంది? దేవసేన ఎవరు? అసలు బాహుబలి ఎవరు? భల్లలాదేవాకు బాహుబలికి సంబంధం ఏమిటి? చివరకు ఏం జరిగింది? ఇలాంటి ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘బాహుబలి’ సినిమా చూసి తరించాల్సిందే!

cinima-reviews
బాహుబలి - ది బిగినింగ్

ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఏ సినిమాకు దక్కని అరుదైన గౌరవం ‘బాహుబలి’ చిత్రానికి దక్కింది. ‘బాహుబలి’ చిత్రం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కొన్ని వేల కోట్లమంది సినీ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానులంతా కూడా ‘బాహుబలి’ రాక కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ముందుగా అంటే సినిమా షూటింగ్ ప్రారంభించిన కొద్దిరోజులకే ఈ సినిమాలు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మేకింగ్ వీడియో విడుదలై క్షణం నుంచి ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా సౌత్ లో వున్న తమిళం, మలయాళం, హిందీ సినీ ఇండస్ట్రీలు కూడా ‘బాహుబలి’ చిత్రం ద్వారా గర్వంగా ఫీలవుతున్నారు. ఏ సినిమాపైనా అయినా కూడా అంచనాలు రెట్టింపు అయితే వాటిని అందుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ‘బాహుబలి’ విషయంలో అవన్నీ పటాపంచలయ్యాయి. అంచనాల మించి ‘బాహుబలి’ మేకింగ్ వీడియోలు, పోస్టర్లు, లుక్స్, ట్రైలర్స్ వుండటంతో ‘బాహుబలి’పై తారాస్థాయిలో క్రేజ్ ఏర్పడింది. వీటి వెనుక ఎన్నో వేలమంది కష్టం వుంది.

కె. రాఘవేంద్రరావు సమర్పణలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్లో నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రముఖ రచయిత, దర్శకులు వి.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించగా, స్వరవాణి యం.యం.కీరవాణి సంగీతం అందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించగా, సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ యాక్షన్ సన్నివేశాలను సమకూర్చారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించగా నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో గ్రాండ్ గా జులై 10వ తేదిన ‘బాహుబలి - ది బిగెనింగ్’ విడుదల కానుంది. రెండు భాగాలుగా రూపొందిన ‘బాహుబలి’ చిత్ర మొదటి భాగాన్ని జులై 10న విడుదల చేస్తున్నారు. రెండవ భాగాన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు. మరి ఇన్ని అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఎలా వుందో, అంచనాలను అందుకుందో లేదో ఒకసారి చూద్దామా!

నటీనటుల పనితీరు:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - బాహుబలి & శివుడు

ఇప్పటి వరకు ప్రభాస్ ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించాడు. కానీ ‘బాహుబలి’ చిత్రం పూర్తిగా వేరు. ‘బాహుబలి’ చిత్ర టైటిల్ కు ప్రభాస్ సరిగ్గా సరిపోయాడు. ప్రభాస్ గురించి చెప్పాలంటే ముందుగా ఇద్దరు ప్రభాస్ ల గురించి చెప్పుకోవాలి. ‘బాహుబలి’ ప్రభాస్ మరియు ‘శివుడు’ ప్రభాస్. ముందుగా ‘శివుడు’ పాత్రకు సంబంధించిన ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే... ప్రభాస్ ను ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేం. ఎంతటి సాహసమైన చేయగలిగే ఒక అడ్వెంచర్ పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఇందులో ‘శివుడి’ పాత్రలో ప్రభాస్ ఎంట్రీ సూపర్బ్.

ఈ పాత్రలో ప్రభాస్ లుక్స్ పరంగా అద్భుతంగా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని అడ్వెంచర్ సన్నివేశాలలో దుమ్ముదులిపేసాడు. ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలలో నటించినట్లుగా ఎక్కడా అనిపించలేదు. పోరాట సన్నివేశాలలో ప్రభాస్ అదరగొట్టేసాడు. ‘శివుడు’ పాత్రలో ప్రభాస్ కాస్త అల్లరి కుర్రాడిగా కనిపించాడు. అలాగే అడ్వెంచర్ ధీరుడిగా కనిపించాడు. అలాగే ఓ ప్రేమికుడిగా కనిపించి అదరగొట్టేసాడు. ముఖ్యంగా వాటర్ ఫాల్స్ దగ్గర సన్నివేశాలలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు.

‘బాహుబలి’ సినిమా కోసం ప్రభాస్ తన శరీరాన్ని భారీగా పెంచేసుకున్నాడు. చూడటానికి ప్రభాస్ కటౌట్ సూపర్బ్. అలాంటిది ‘బాహుబలి’ పాత్రలో ప్రభాస్ జీవించేసాడు. ఒక రాజ్యాన్ని కాపాడుకోవడానికి పోరాటే రాజు పాత్రలో, అలాగే ‘శివుడు’ పాత్రలో ప్రభాస్ అదరగొట్టేసాడు. ‘బాహుబలి’ చిత్రాన్ని మొత్తం ప్రభాస్ తన భుజాలపై వేసుకొని నడిపించేసాడు. ఒక అడ్వెంచర్ హీరో, ఒక రాజ్యానికి రాజు, పవర్ ఫుల్ వ్యక్తి, పేరులోనే కాకుండా చూడటానికి కూడా నిజమైన ‘బాహుబలి’ వలే ప్రభాస్ ఈ సినిమాలో చింపేసాడు. చివరగా ఈ సినిమాలో ప్రభాస్ నటన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... ‘బాహుబలి’ చిత్రాన్ని తెలుగులో ప్రభాస్ తప్ప ఇంకెవరూ చేయలేరని అనిపిస్తోంది.

రానా దగ్గుబాటి - భల్లలదేవా

ఇప్పటి వరకు రానా నటించిన ఏ ఒక్క సినిమా కూడా అంతగా విజయం సాధించలేదు. అయినా కూడా రానాకు తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో అవకాశాలు వస్తూనే వున్నాయి. హీరోగా ఇప్పుడిప్పుడే సినీ కెరీర్ ను మొదలుపెట్టిన రానా... ‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవ పాత్రలో విలన్ గా అదరగొట్టేసాడు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ‘బాహుబలి’ మరియు ‘శివుడు’ అనే రెండు పాత్రల్లో నటించి తన సత్తా ఏంటో చూపిస్తే... రానా మాత్రం కేవలం ఒక్క ‘భల్లలదేవా’ పాత్రలో నటించి తుప్పురేగొట్టాడు.

‘బాహుబలి’ సినిమా కోసం రానా పెంచిన బాడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. అహంకారంతో విర్రవీగే భల్లలదేవాగా రానా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా వార్ యాక్షన్ సీన్లలో భీభత్సం సృష్టించేసాడు. రాజ్యంలో తనకంటూ ఓ స్థానం దక్కాలని చెడు భావనతో మెదిలే యువరాజుగా రానా నటన బాగుంది. రానా ఈ సినిమా కోసం తీస్కున్న జాగ్రత్తలు బాగున్నాయి. రానా బాడీ విలన్ పాత్రకు బాగా ప్లస్ పాయింట్ గా నిలిచింది. ‘బాహుబలి’ ఒక్క సినిమాతో రానాలోని నటుడు దాదాపు బయటపడ్డట్లుగా అనిపిస్తోంది. ‘బాహుబలి’కి సంబంధించిన మరో భాగం విడుదలయ్యాక రానా నటన పరంగా పూర్తిగా పరిపక్వత చెందాడని చెప్పుకోవచ్చు.

‘బాహుబలి’ పోరాటం చేయగలిగే భారీ పర్సనాలిటీ, హైటు, చూడగనే భయపడే విధంగా వుండే భల్లలదేవాగా రానా అద్భుతంగా నటించాడు. ‘బాహుబలి’కి భల్లలదేవా గట్టి పోటిని అందించాడు. మొత్తానికి  ‘బాహుబలి’ సినిమాలో భల్లలదేవాగా రానా చింపేసాడు.

రమ్యకృష్ణ - శివగామి
‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్, రానా పాత్రల తర్వాత చెప్పుకోవలసిన పాత్ర శివగామి. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతం. అప్పట్లో రమ్యకృష్ణ నటించిన ‘అమ్మోరు’ సినిమాలో కొన్ని సీన్లలో మాత్రమే శక్తివంతమైన స్త్రీ రూపంలో కనిపించింది. కానీ ‘బాహుబలి’లో శివగామి పాత్రలో మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా శివగామిగా రమ్యకృష్ణ కనిపించే తీరు, హవాభావాలు అద్భుతం. ఆ పాత్రకు రమ్యకృష్ణ తప్ప మరెవరూ న్యాయం చేకూర్చలేరనే విధంగా నటించి మెప్పించింది.

తమన్నా - అవంతిక
ఇంత పవర్ ఫుల్ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో అవంతిక ఓ పవర్ ఫుల్ గ్లామర్ పాత్ర అని చెప్పుకోవచ్చు. అవంతిక పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. తన అందచందాలతో, నటనతో బాగా ఆకట్టుకుంది. కొన్ని కొన్ని సన్నివేశాలలో యాక్షన్ ఇరగదీసింది. తమన్నా గ్లామర్ ఈ సినిమాలో మరింత రెట్టింపు అయ్యింది. ప్రభాస్, తమన్నాల సీన్లు చాలా బాగున్నాయి.

అనుష్క - దేవసేన
దేవసేన పాత్ర కనిపించేది కొన్ని సీన్లే అయినప్పటికీ సూపర్బ్ గా వుంది. దేవసేన పాత్రలో అనుష్క జీవించేసింది. యాక్షన్ సన్నివేశాలలో అనుష్క దుమ్ముధులిపేసింది. అనుష్క పాత్ర మరికాసేపు వుంటే బాగుంటుందని ఆశపడ్డ ప్రేక్షకులకు కాస్త నిరాశే అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ప్రేక్షకులకు రెండవభాగంలో దేవసేన కనువిందు చేయనుందేమో త్వరలోనే చూడాలి.

ఇక నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ మరియు ఇతర నటీనటులు వారి వారి పాత్రలలో చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా నాజర్, సత్యరాజ్ ల నటన అద్భుతం. నాజర్ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ప్రభాకర్ యాక్షన్ సీన్లలో ఇరగొట్టేసాడు. మిగతావాళ్లంతా కూడా వారి వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా న్యాయం చేసారు.

ప్లస్ పాయింట్స్:

‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రం మొత్తం ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. పైన ఎలాగో నటీనటుల నటన గురించి తెలుసుకున్నాం కాబట్టి. ఇందులో సినిమాకు ఏయే అంశాలు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయో తెలుసుకుందాం. ముందుగా ‘బాహుబలి’ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కారణం కథ.

‘బాహుబలి’ కథను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ రచించారు. శివుడు పాత్రలో ఓ అడ్వెంచర్ ప్రభాస్ ను చూస్తే... ‘బాహుబలి’ పాత్రలో ప్రభాస్ దుమ్ముధులిపేసాడు. రెండు పాత్రలలో కూడా ప్రభాస్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు పోరాట సన్నివేశాలు మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్ సూపర్బ్. గ్రాఫిక్స్ అద్భుతంగా సెట్ చేసారు. విజువల్స్ పరంగా ‘బాహుబలి’ సినిమా అదిరిపోయింది. ఇందులోముఖ్యంగా శివుడు పాత్ర చేసే నటన అద్భుతం. ఈ సినిమాకు సాబు సిరిల్ ఆర్ట్ వర్క్ సూపర్బ్. సినిమాను ఒక కళాఖండంలా తీర్చిదిద్దారు.

ఫస్ట్ హాఫ్ లో శివుడు పాత్ర కాస్త ఎంటర్ టైన్మెంట్, అడ్వెంచర్ సాహాసాలతో చాలా చక్కగా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో అద్భుతమైన భారీ యాక్షన్ సన్నివేశాలతో దుమ్ముదులిపేసారు. ముఖ్యంగా ప్రభాస్ రాజసం సన్నివేశాలు, ఒక రాజ్యానికి రాజుకు వుండాల్సిన అన్ని హంగులను అద్భుతంగా చూపించారు. హీరోతో పాటుగా విలన్ పాత్రలో రానా అద్భుతంగా నటించాడు. హీరో పాత్రనే కాకుండా విలన్ పాత్రను కూడా చాలా పవర్ ఫుల్ డిజైన్ చేసారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కూడా బాహుబలికి కనెక్ట్ అయ్యే వుంటుంది. ఈ పాత్రల తీరుతెన్నులను మలిచిన పద్ధతి అద్భుతం.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమి లేవు. ఇప్పుడొచ్చే సినిమాలలో వుండే భారీ డాన్సులు, కామెడీలు వుండకుండా ఓ కొత్త ప్రపంచాన్ని చూపించి అద్భుతంగా చూపించాడు. ఈ రెండు అంశాలు కోరుకునే అభిమానులు కాస్త నిరాశ చెందుతారు. అయినా ఇలాంటి చిత్రాల్లో కూడా డాన్సులు, కామెడీ అంశాలను ఎవరూ ఆశించి వెళ్లరు కాబట్టి... వీటిని కూడా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవడం వృధా.

సాంకేతికవర్గ పనితీరు:

‘బాహుబలి’ సినిమా కేవలం కొంతమంది వల్లనే బయటకు వచ్చిందంటే ఎవరూ ఒప్పుకోరు. ఈ విషయాన్ని ఇటీవలే ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి కూడా తెలియజేసారు. ఈ సినిమా ఇలా రావడానికి దాదాపు 4వేల మంది కష్టం వుందని, అందరూ కష్టపడి, ఇష్టపడి పనిచేస్తేనే ‘బాహుబలి’ సినిమా రూపుదిద్దుకుందని తెలిపారు. కాబట్టి... ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు హ్యాట్సాఫ్.

అయితే ‘బాహుబలి’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ గా కొంతమందిని తీసుకుందాం. కథ: విజయేంద్ర ప్రసాద్, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి, సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్, సంగీతం: యం.యం.కీరవాణి, ఆర్ట్ డైరెక్టర్: సాబు సిరిల్, స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్స్, విజువల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ మరియు నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.

ముందుగా కథ విషయానికొస్తే.. విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ కథను చాలా అద్భుతంగా రచించారు. ఈ సినిమాతో ఆయన అందరిని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారని చెప్పుకోవచ్చు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించారు. కానీ అన్ని సినిమా కథలకంటే ‘బాహుబలి’ సినిమా కథ చాలా అద్భుతం. వేరే ఓ కొత్త ప్రపంచాన్ని అద్భుతంగా సిద్దం చేసారు. ‘బాహుబలి’ సినిమాలో అన్ని పాత్రలను అద్భుతంగా మలిచారు. ప్రతి ఒక్క పాత్రను ‘బాహుబలి’ పాత్రకు కనెక్ట్ అయ్యే విధంగా పర్ఫెక్ట్ గా రచించారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలను అద్భుతంగా మలిచారు.

సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్
దర్శకుడి అంచనాలను అందుకొని విజువల్స్ ను అందించడమంటే అది మాములు విషయం కాదు. అందులోనూ ఇలాంటి సినిమాలకు చాలా కష్టం. ఇక మిగతా దర్శకులతో పనిచేయడం ఒక ఎత్తైతే రాజమళి మరో ఎత్తు. రాజమౌళి ఆలోచనలను అందుకొని, దానికి సరైన విధంగా విజువల్స్ చూపించడంలో సెంథిల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాకు సెంథిల్ అద్భుతమైన సినిమాటోగ్రఫిని అందించాడు. ఆ విషయం కాస్త పక్కన పెట్టి.. బాహుబలి సినిమా గురించి మాట్లాడుకుంటే... ఈ సినిమాకు సెంథిల్ ఒక అందమైన అద్భుత లోకాన్ని మనకు చూపించాడు. ప్రతి ఒక్క సీన్ వాహ్.. సూపర్బ్. ఏ ఒక్క సీన్ కూడా ‘పర్వాలేదు’, ‘బాగుంది’.. అని కాకుండా ప్రతి ఒక్క సీన్ కూడా అద్భుతంగా చూపించాడు. ఇక కొన్ని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో సెంథిల్ పనితనం నిజంగా అభినందనీయం. విజువల్స్ తో పిచ్చెక్కించేసాడు. శివుడు పాత్ర చేసే అడ్వెంచర్ సన్నివేశాలను ప్రేక్షకుల కళ్లకు పండగలా అనిపించేలా చేసాడు. అలాగే VFX డైరెక్టర్ శ్రీనివాస్ మోహన్ తన విజువల్ ఎఫెక్ట్స్ తో అదరగొట్టేసాడు. గ్రాఫిక్స్ ఈ సినిమాలో సూపర్బ్. ప్రతి ఫ్రేం చాలా గ్రాండ్ గా చూపించారు.

సంగీతం: యం.యం.కీరవాణి
‘బాహుబలి’ సినిమాకు అన్ని క్రాఫ్టులు ఒక వైపైతే.. సంగీతం మరోవైపు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కీరవాణి సంగీతం అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇక ఈ సినిమాకు కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. రీరికార్డింగ్ ప్రాణంలా నిలిచింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు, హీరోయిజం, విలనిజం వంటి అంశాలలో కీరవాణి తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో చింపేసాడు.

ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్
‘బాహుబలి’ వంటి సినిమాకు ఆర్ట్ వర్క్ చేయాలంటే కేవలం వర్క్ మాత్రమే తెలిసి వుంటే సరిపోదు. ఎంతో ఓపిక కావాలి, ఎంతో మందిని గైడ్ చేయాలి, టెన్షన్స్... ఇలా ఎన్నో సమస్యలుంటాయి. అంతే కాకుండా చాలా అనుభవం కూడా కావాలి. వీటన్నింటిని చక్కగా మలచాలంటే సాబు సిరిల్ వంటి అనుభవజ్ఞులే కరెక్ట్. ఈ సినిమా కోసం సాబు సిరిల్ చేసిన ఆర్ట్ వర్క్ అద్భుతం. కొన్ని కొన్ని సెట్టింగ్స్ కూడా నిజమైన కట్టడాల వలే అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా భల్లలదేవా పాత్రకు సంబంధించిన విగ్రహం కేక. అంతే కాకుండా ఆ కాలం నాటి టెక్చర్స్, కలర్స్ అన్నింటిని అద్భుతంగా క్రియేట్ చేసారు.

స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్
‘బాహుబలి’ సినిమా అంటేనే భారీ యాక్షన్, అడ్వెంచర్ సినిమా అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. యాక్షన్ అనగానే హీరో ఓ పదిమందిని ఎలా పడితే అలా కొట్టేయకుండా చాలా పవర్ ఫుల్ గా, స్టైలిష్ గాఉతికి ఆరేయడం ఎలాగో పీటర్ హెయిన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేసి చూపించారు. ముఖ్యంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో అంతమందితో యాక్షన్ సీన్లు తీయాలంటే చాలా కష్టం. కానీ పీటర్ అద్భుతమైన పవర్ ఫుల్ యాక్షన్ స్టంట్స్ చేయించాడు. ముఖ్యంగా శివుడు పాత్రతో భారీ అడ్వెంచర్ చేయించేసి అదరగొట్టేసాడు. మొత్తానికి పీటర్ యాక్షన్ కు ‘బాహుబలి’ దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు.

చివరగా అని కాకపోయినా.. ఒక రాజ్యానికి సరైన నాయకుడు ఎలా అవసరమో, ఒక సినిమాను చక్కగా మలిచి ప్రేక్షకులకు అందించే దర్శకుడు కూడా అంతే అవసరం. అలాంటి దర్శకుడే ఎస్.ఎస్.రాజమౌళి. రాజమౌళి ఈ సినిమా అనుకున్న సమయం నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తాను మాత్రం ‘బాహుబలి’ని ఏ విధంగా చూపించాలని అనుకున్నాడో అదే విధంగా తెరకెక్కించాడు. విజువల్స్ పరంగా ఎలాంటి అవుట్ పుట్ రాబట్టుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. ‘బాహుబలి’ చిత్రంలో ప్రతి సన్నివేశాన్ని కూడా అద్భుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. ముఖ్యంగా వార్ సన్నివేశాలు సూపర్బ్. హీరోయిజాన్ని మాత్రమే కాకుండా విలన్ మరియు వుమెన్ పవర్ ఏంటో ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

నిర్మాతలు
భారీ బడ్జెట్ అని చెప్పుకోవడం మాత్రమే కాకుండా మూడు సంవత్సరాల పాటు ఒకే ప్రాజెక్టు కోసం ఇంతగా కృషి చేయడం చాలా గ్రేట్. డబ్బుకు ఎక్కడా కూడా వెనుకాడకుండా నిర్మాతలు శోభు, ప్రసాద్ లు ‘బాహుబలి’ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ప్రతి సీన్ కూడా చాలా గ్రాండ్ గా, విజువల్స్ పరంగా కన్నుల పండుగగా వుంది. నిర్మాణ విలువలు చాలా హై స్టాండెడ్ లెవల్లో అదిరిపోయాయి.

చివరగా:
‘బాహుబలి - ది బిగినింగ్’: తెలుగు సినీఇండస్ట్రీ గర్వించదగ్గ చిత్రం

 

 

- Sandy