The Review Of Sampoornesh Babu Latest Flick Singham 123 | mohan babu | 24 frames productions

Teluguwishesh సింగం 123 సింగం 123 Singham 123 movie telugu review sampoornesh babu mohan babu : The Full Review Of Sampoornesh Babu Latest Flick Singham 123 Which is produced by Manchu Vishnu in 24 frames banner. Product #: 64892 1 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సింగం 123

  • బ్యానర్  :

    24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

  • దర్శకుడు  :

    అక్షత్ అజయ్ శర్మ

  • నిర్మాత  :

    మంచు విష్ణు

  • సంగీతం  :

    శేషు

  • సినిమా రేటింగ్  :

    1  1

  • ఛాయాగ్రహణం  :

    సతీష్ ముత్యాల

  • ఎడిటర్  :

    యం.ఆర్.వర్మ

  • నటినటులు  :

    సంపూర్నేష్ బాబు, సనం తదితరులు

Singham 123 Movie Telugu Review Sampoornesh Babu Mohan Babu

విడుదల తేది :

2015-06-05

Cinema Story

సింగరాయకొండ అనే ఊర్లో లింగం(భవాని) అనే రౌడీ సారా వ్యాపారం చేస్తూ, దొంగనోట్లు ముద్రిస్తూ పలు అక్రమాలకు పాల్పడుతాడు. ఎదురుతిరిగిన వారిని చంపేస్తుంటాడు. అన్యాయాన్ని సహించని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సింగం(సంపూర్ణేష్ బాబు). లింగం చేసే అరాచకాలకు చెక్ పెట్టాలంటే సింగం లాంటి వాడివల్లే సాధ్యమని... సింగంను సింగరాయకొండకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. సింగరాయకొండలో ఎంట్రీ ఇచ్చిన సింగం... తనదైన శైలిలో రౌడీలకు బుద్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే సింగరాయకొండతో తనకున్న అనుబంధం గురించి తెలుసుకుంటాడు. కానీ ఈ క్రమంలోనే సింగం పోలీస్ ఆఫీసర్ కాదనే ఓ విషయం లింగంకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయ్యింది? సింగం ఎవరు మరి? అసలు సింగం పోలీస్ గా ఎలా ఎంట్రీ ఇచ్చాడు? సింగంకు సింగరాయకొండకు వున్న అనుబంధం ఏంటీ? వీరిద్దరి మధ్య వున్న పగ ఏంటీ? లింగంకు సింగం ఎలా బుద్ధి చెప్పాడు? అనే విషయాలు తెలియాలంటే వెండితెర మీద ‘సింగం123’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
సింగం 123

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా మంచు విష్ణు నిర్మించిన తాజా చిత్రం ‘సింగం 123’. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సంపూ కనిపించనున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సంపూ చెప్పిన డైలాగులు కేకపుట్టిస్తున్నాయి. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సంపూర్ణేష్ బాబు. సంపూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. సంపూ తన డైలాగులతో పొట్టచెక్కలయ్యే విధంగా నవ్వించాడు. అలాగే సంపూ చిలిపి ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసాడు. సినిమా మొత్తం సంపూ సంపేసాడు. ఇక హీరోయిన్ సనమ్ కనిపించేది కొన్ని సన్నీవేశాలలో అయినప్పటికీ పర్వాలేదనిపించింది. తన పాత్ర మేరకు తాను బాగానే నటించింది. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని చిలిపి రొమాంటిక్ సీన్లు బాగున్నాయి. అలాంటి సీన్లు మరికొన్ని వుండి వుంటే మరింత కామెడీ వర్కౌట్ అయ్యేది. ఇక విలన్ గా నటించిన భవాని అద్భుతంగా నటించాడు. సంపూ లాంటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు గట్టి పోటీనిచ్చాడు. పృధ్వీరాజ్ కామెడీ బాగుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

ఇక ఈ సినిమా మొత్తం మిగతా స్పూఫ్ కామెడీతో బాగుంది. ఇప్పటి వరకు వచ్చిన పలు హిట్ చిత్రాల్లోని సన్నీవేశాలను, డైలాగులను స్పూఫ్ చేసి తీసేసారు. పర్ ఫెక్ట్ టైమింగ్ తో రాసుకోవడం వల్ల కామెడీ బాగా పండింది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపించింది. ఇక సినిమా మొత్తం కూడా సంపూ గోల తట్టుకోగలం అనుకుంటే పర్వాలేదు. లేదంటే ఇక అంతే!

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో చాలా మైనస్ పాయింట్స్ వున్నాయి. ఏదో కామెడీ స్కిట్ లలో నుంచి సెలెక్ట్ చేసినట్లుగా వుంది ఈ స్పూఫ్ సినిమా. కథలో లాజిక్ లేకపోవడం, స్పూఫ్ కామెడీ తరహాలోనే మరే ఇతర కథైనా ఎంచుకొని వుండివుంటే మరింత బాగొచ్చేది. కానీ ఈ సినిమా ప్రారంభమైన క్షణం నుంచి బాబోయ్ అనిపించేలా వుంటుంది. ఇక ఇంతకంటే మైనస్ పాయింట్స్ చెప్పడం మా వల్ల కాదు.

సాంకేతికవర్గ పనితీరు:

మంచు విష్ణు మొదటిసారిగా ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లేను అందించారు. ఒకవిధంగా చెప్పుకుంటే ఈ విషయంలో విష్ణు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్పూఫ్ కామెడీ చిత్రాలకు స్ర్కీన్ ప్లే అందించడం మాములు విషయం కాదు. ఈ విషయంలో విష్ణు బాగా ఆకట్టుకున్నాడు. ఇక నిర్మాతగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా వుంది.

ఈ సినిమాకు డైమండ్ రత్నం అందించిన డైలాగులు అదుర్స్. ఇందులోని డైలాగులకు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. దర్శకుడిగా అక్షత్ శర్మ పర్వాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. సంగీతం కూడా పర్వాలేదనిపించింది.

చివరగా:
సింగం 123: వామ్మో...అనిపించే స్పూఫ్ సింగం మాత్రమే!