Read Full Review Of Mosagallaku Mosagadu Movie | Sudheer Babu | Nandini

Teluguwishesh మోసగాళ్లకు మోసగాడు మోసగాళ్లకు మోసగాడు Mosagallaku Mosagaadu movie review : Read The Full Review Of Mosagallaku Mosagadu Movie in which Sudheer babu and Nandini Playing in Main Roles. This Movie Is Made By Swamy Rara Makers. Get information about Mosagallaku Mosagaadu Details. Product #: 64438 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మోసగాళ్లకు మోసగాడు

  • బ్యానర్  :

    లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్

  • దర్శకుడు  :

    బోస్ నెల్లూరి

  • నిర్మాత  :

    చక్రి చిగురుపాటి

  • సంగీతం  :

    మణికాంత్ ఖాద్రి

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సాయిప్రకాష్

  • ఎడిటర్  :

    కార్తీక శ్రీనివాస్

  • నటినటులు  :

    సుధీర్ బాబు, నందిని, సప్తగిరి, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహణ్, ప్రవీణ్ తదితరులు

Mosagallaku Mosagaadu Movie Review

విడుదల తేది :

2015-05-22

Cinema Story

చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ జాలీగా లైఫ్ ను గడిపే కుర్రాడు క్రిష్(సుధీర్ బాబు). అనుకోకుండా ఓరోజు జానకి(నందిని రాయ్)ను చూసి ప్రేమలో పడతాడు. అదలా వుండగా... హైదరాబాద్ లోని లోకల్ దాదా కౌశిక్(జయప్రకాశ్ రెడ్డి) గ్యాంగ్ లో క్రిష్ చేరతాడు. క్రిష్ గ్యాంగ్ కు ఓ విలువైన విగ్రహాల సెట్ కొట్టేయాలనే డీల్ ను అప్పగిస్తాడు కౌశిక్. కానీ క్రిష్ మాత్రం ఆ విగ్రహాలను కొట్టేసి, ఎవరికీ ఇవ్వకుండా అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు.

దీనివల్ల కౌశిక్ కు నష్టం రావడంతో... కౌశిక్ బాస్ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రుద్ర(అభిమన్యు సింగ్) రంగంలోకి దిగుతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు క్రిష్ ఎలా చేసాడు? విగ్రహాలను క్రిష్ ఎందుకు కొట్టేసాడు? అసలు విగ్రహాల వెనకున్న కథ ఏంటి? క్రిష్ ప్రేమకు జానకి ఒప్పుకుందా లేదా? క్రిష్ చివరకు ఆ విగ్రహాలను ఏం చేసాడు? అనే పలు ఆసక్తికర అంశాల గురించి తెలుసుకోవాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
మోసగాళ్లకు మోసగాడు

సుధీర్ బాబు, నందిని జంటగా నటించిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. లక్ష్మీనరసింహా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ చిత్రానికి బోస్ నెల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్వామిరారా’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఈనెల 22న విడుదల అయింది. పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించిందో తెలుసుకుందామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్:

సుధీర్ బాబు నటించిన అన్ని సినిమాలకంటే ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. క్రిష్ పాత్రకు సుధీర్ తగిన న్యాయం చేసాడు. నటన పరంగా బాగా మెరుగుపడ్డాడు. యాక్షన్, డాన్స్, పర్ఫార్మెన్స్ పరంగా సుధీర్ అద్భుతంగా నటించాడు. ఇక జానకి పాత్రలో నటించిన నందిని రాయ్ డీసెంట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. క్యూట్ క్యూట్ లుక్స్ తో బాగుంది. ఇక కౌశిక్ పాత్రలో జయప్రకాశ్ రెడ్డి నటన బాగుంది. జయప్రకాశ్ రెడ్డి, ఫిష్ వెంకట్, దువ్వాసి మోహన్ ల కామెడీ ట్రాక్ బాగుంది. వీరిమధ్య వచ్చే కామెడీ డైలాగ్స్ జనాలను కడుపుబ్బ నవ్వించే విధంగా వున్నాయి. ఇక సప్తగిరి తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. అభిమన్యు సింగ్ నటన పర్వాలేదు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలలో పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు ఫస్ట్ హాఫ్ మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే స్లో అయిపోతుంది. కథను సాగదీసినట్లుగా వేగం లేకుండా నడుస్తుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోలేదు. బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ముఖ్యమైనది ట్విస్టులు. అలాంటివి ఈ సినిమాలో అంతగా లేవు. తరువాత ఏం జరుగనుందో మనం ఈజీగా ఊహించేయవచ్చు.

ఇక కొన్ని కొన్ని పాత్రలకు అసలు ప్రాముఖ్యతే లేదు. అలాగే సినిమాను మరింత వేగవంతం చేసుంటే బాగుండేది. కానీ నెమ్మదిగా సాగుతుండటం వల్ల నీరసం వచ్చినట్లుగా అనిపిస్తుంది.

సాంకేతికవర్గ పనితీరు:

ఈ సినిమాకు సాయిప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా చక్కగా చూపించాడు. మణికాంత్ ఖాద్రి అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. రీ రికార్డింగ్ పర్వాలేదు. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. దర్శకుడు బోస్ నెల్లూరి కథ విషయంలో బాగున్నా... స్క్రీన్ ప్లే విషయంలో మరింత చక్కగా తీసుంటే బాగుండేది. దర్శకుడిగా మాత్రం పర్వాలేదనిపించుకున్నాడు. ఇక నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా రిచ్ గా నిర్మించారు.

చివరగా:
మోసగాళ్లకు మోసగాడు: ఈ మోసగాడి ట్రిక్కులు సరిగ్గా వర్కౌట్ అవలేదు.