Son Of Satyamurthy Movie Review | Allu Arjun | Trivikram Srinivas | Samantha | Adah Sharma

Teluguwishesh సన్నాఫ్ సత్యమూర్తి సన్నాఫ్ సత్యమూర్తి son-of-satyamurthy-movie-review : Read the full review of son of satyamurthy movie in which stylish star allu arjun playing in lead role and directed by trivikram srinivas. In this movie samantha, adah sharma and nitya menon acting as heroines. Product #: 62732 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సన్నాఫ్ సత్యమూర్తి

  • బ్యానర్  :

    హారిక & హాసిని క్రియేషన్స్

  • దర్శకుడు  :

    త్రివిక్రమ్ శ్రీనివాస్

  • నిర్మాత  :

    రాధాకృష్ణ. ఎస్

  • సంగీతం  :

    దేవిశ్రీప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    ప్రసాద్ మూరెళ్ల

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ, ఆలీ, రాజేంద్ర ప్రసాద్, ఉపేంద్ర, స్నేహ, సింధు తులానీ తదితరులు

Son Of Satyamurthy Movie Review

విడుదల తేది :

2015-04-09

Cinema Story

ఎన్నారై సత్యమూర్తి(ప్రకాశ్ రాజ్) కొడుకైన విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్).. అత్యంత విలాసవంతంగా తన జీవితాన్ని గడుపుతూ వుంటాడు. అయితే.. అనుకోకుండా విరాజ్ తండ్రి చనిపోవడంతో... అతని జీవితంలో అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. తండ్రి మరణానంతరం విరాజ్ తన ఆస్తులను కోల్పోవడంతో అతని కుటుంబం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసిన  పరిస్థితి ఏర్పడుతుంది.

ఇటువంటి సమయంలో సత్యమూర్తి స్నేహితుడు రాజేంద్రప్రసాద్... విరాజ్ కు సహాయం చేస్తాడు. విరాజ్ కుటుంబం ఇండియాకు వెళ్తుంది. అక్కడ విరాజ్ కు ఓ అనుకోని అదృష్టం కలిసొస్తుంది. కానీ తన అదృష్టానికి అడ్డుగా దేవరాజ్(ఉపేంద్ర) నిలుస్తాడు. అసలు విరాజ్ కుటుంబం ఎందుకు ఆస్తులన్నీ కోల్పోవాల్సి వచ్చింది? సత్యమూర్తి ఎలా చనిపోయాడు? దేవరాజ్ ఎవరు? దేవరాజ్, విరాజ్ లకు మధ్య వున్న సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే వెండితెరపై చిత్రం చూడాల్సిందే!

cinima-reviews
సన్నాఫ్ సత్యమూర్తి

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజాగా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఈనెల 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ ను సాధించాయి. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా ఒకరికి మాత్రమే క్రెడిట్ ఇవ్వలేము. ఎందుకంటే ఎవరిపాత్రలో వారు జీవించేసారు. విరాజ్ ఆనంద్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అద్భుతంగా నటించడంతోపాటు గత సినిమాలకంటే మరింత స్టైలిష్ గా కనిపించాడు. తన లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ప్రతి విషయంలో కూడా బన్నీ చాలా కొత్తగా కనువిందు చేశాడు. ఇక సమీరా పాత్రలో నటించిన సమంత.. తన నటన, గ్లామర్ తో యువతను బాగా ఆకట్టుకుంది. నిత్యామీనన్ తన పాత్రకు బాగా సరిపోయింది. నిత్యామీనన్ తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కాస్త ఎక్కువ గ్లామర్ ఒలకబోసిందనే చెప్పుకోవచ్చు. ఇక ఆదాశర్మ తన పాత్రలో తాను ఒదిగిపోయింది.

దేవరాజ్ పాత్రలో నటించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర... తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతడు ఈ సినిమాకు ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు. అలాగే ఉపేంద్రకు భార్యగా స్నేహ అద్భుతంగా నటించింది. ఇందులో బేబి వర్ణిక గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. బేబి వర్ణిక చాలా చక్కగా చేసింది. క్యూట్ హవాభావాలతో అందరికి తెగ నచ్చేసింది. ఇక రాజేంద్ర ప్రసాద్, ఆలీ, బ్రహ్మనందం, సింధు తులానీ తదితరులు వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్:

నటీనటులలో అంతగా మైనస్ పాయింట్స్ ఏమి లేవుకానీ... అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నీవేశాలు బోర్ అనిపిస్తాయి. ఆదాశర్మ పాత్ర, అలాగే ఆలీ కామెడీ మరింత బాగా తీసుంటే బాగుండేది. ఇక వెన్నెల కిషోర్ పాత్ర అనవసరం అనిపించింది. ఇక టెక్నికల్ గా చూస్తే.. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నీవేశాలు మరీ సాగదీసినట్లుగా అనిపించాయి.

సాంకేతికవర్గ పనితీరు:

‘అత్తారింటికి దారేది’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ ఆ అంచనాలకు చేరుకున్నాడనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం బాగా చేరువయ్యి, మరోసారి సక్సెస్ సాధించేసాడు. కానీ ఈ సినిమాను మరింత ఎంటర్ టైనింగ్ గా చూపించి వుంటే బాగుండేది. పూర్తిగా ఫ్యామిలీ ఎమోషనల్స్, సెంటిమెంట్ తరహాలోనే చూపించడంతో మాస్ ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అవుతారు.

ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించిన ప్రసాద్ మూరెళ్ల.. ప్రతి విజువల్స్ ను అద్భుతంగా చూపించారు. దేవిశ్రీప్రసాద్ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ విషయంలో మరింత దృష్టి పెట్టాల్సింది. ఇక నిర్మాత రాధాకృష్ణ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అంతా కూడా చాలా గ్రాండ్ గా వుంది.

చివరగా:
సన్నాఫ్ సత్యమూర్తి: ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్