Teluguwishesh టెంపర్ టెంపర్ Temper telugu movie going to release on February 13, 2015. Get information about Temper Telugu Movie Review, Temper Movie Review, Jr. Ntr Temper Movie Review, Temper Movie Review And Rating, Temper Telugu Movie Talk, Temper Telugu Movie Teaser, Temper Telugu Movie Trailer, Temper Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 60696 3.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    టెంపర్

  • బ్యానర్  :

    పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    పూరీ జగన్నాథ్

  • నిర్మాత  :

    బండ్ల గణేష్

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    3.753.753.75  3.75

  • ఛాయాగ్రహణం  :

    శ్యాం.కె.నాయుడు

  • ఎడిటర్  :

    ఎస్.ఆర్.శేఖర్

  • నటినటులు  :

    ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ తదితరులు

Temper Movie Review

విడుదల తేది :

2015-02-13

Cinema Story

దయ (ఎన్టీఆర్) అమ్మానాన్న లేని ఓ అనాధ. చిన్నప్పుడు జరిగిన సంఘటన అతనిని కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్’గా మార్చేస్తుంది. అవినీతినే ధర్మంగా మార్చుకుని ఆ దారిలోనే పయనిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బుకోసం గూండాలతో దోస్తీ చేసే టైపు. ఈ నేపథ్యంలోనే దయా వైజాగ్ కు ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ గూండాయిజంకి కింగ్ అయిన వాల్తేర్ వాసు (ప్రకాష్ రాజ్)తో చేతులు కలిపి, అవినీతి రూట్ లో వెళ్తుంటాడు. అతడు చేసే అక్రమాలకు సపోర్ట్ గా నిలుస్తాడు. ఈ క్రమంలోనే దయ అందమైన అమ్మాయి శాన్వి(కాజల్ అగర్వాల్) ప్రేమలో పడతాడు.

అంతా సవ్యంగానే జరుగుతుండగా అతని జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాల్తేర్ వాసు దయా గర్ల్ ఫ్రెండ్ శాన్విని కిడ్నాప్ చేస్తాడు. దీంతో వాసు అతని పనులకు వ్యతిరేకంగా మారుతాడు. వాసుకి ఎదురుతిరగాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శాన్విని ఎందుకు కిడ్నాప్ చేసారు? వాసుపై దయాగాడి దండయాత్ర ఎలా జరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే వెండితెరమీద సినిమా చూడాల్సిందే.

cinima-reviews
టెంపర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘టెంపర్’. పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలకు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. టెంపర్ టైటిల్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొడుతోంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలతో ప్రారంభమైన ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:

‘టెంపర్’ సినిమాకు పూరీ జగన్నాధ్, ఎన్టీఆర్ ఇద్దరూ మేజర్ పాయింట్సే! వీరిలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే.. ట్రైలర్ విడుదలైనప్పుడే ఎన్టీఆర్ స్టైల్ అందరిని ఆకట్టుకుంది. ఇక సినిమాలో అతని నటన, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ సిరిగిపోయింది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నటనలో అన్ని రంగాల్లో ఆరితేరిన ఎన్టీఆర్ ఈ సినిమాలోని దయా పాత్రలో జీవించేశాడు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. వాల్తేర్ వాసు పాత్రలో ప్రకాష్ అద్భుతంగా నటించాడు.

ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పాత్ర మేరకు బాగానే నటించింది. గ్లామర్ పరంగా కాజల్ బాగుంది. మధురిమ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మూర్తి పాత్రలో ఎన్టీఆర్ తో ట్రావెల్ చేసిన పోసాని కృష్ణమురళి నటన సూపర్బ్. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇక దర్శకుడు చాలారోజుల తర్వాత మళ్లీ తన మార్క్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమి కనిపించలేదు కానీ... కాజల్ అగర్వాల్ పాత్ర సెకండ్ హాఫ్ అంతగా ఏం అనిపించలేదు. స్పెషల్ రోల్ లో నటించిన సోనియా అగర్వాల్  అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫస్ట్ హాఫ్ లో కాస్త ఎంటర్ టైన్మెంట్ పెట్టి వుంటే ఇంకా బాగుండేది. కథ రొటీన్ కావడంతో ప్రేక్షకులు కొన్ని సీన్లు ముందుగానే తెలిసిపోతుంటాయి.

సాంకేతికవర్గ పనితీరు :

దాదాపు పూరీ సినిమాలు అన్నింటికీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన శ్యాం.కె.నాయుడు ఈ సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. శ్యాం అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. వైజాగ్ అందాలను చాలా బాగా చూపించాడు. ఇక అనూప్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అనూప్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్.

వక్కంతం వంశీ రాసిన ఈ కథ బాగుంది. మొదటిసారిగా ఇతరుల కథతో పూరీ తీసిన ఈ ‘టెంపర్’ సినిమా చాలా బాగుంది. పూరీ డైలాగ్స్, స్ర్కీన్ ప్లే సూపర్బ్. ఎన్టీఆర్ ను స్ర్ర్కీన్ మీద చాలా కొత్తగా చూపించాడు. ఇక నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా వున్నాయి.

చివరగా:
టెంపర్: దయాగాడి దండయాత్ర మళ్లీ మొదలైంది.