Teluguwishesh లౌక్యం లౌక్యం loukyam movie review : tollywood hero gopichand loukyam movie review in which rakul preet singh playing an actress role Product #: 56379 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    లౌక్యం

  • బ్యానర్  :

    భవ్య క్రియేషన్స్

  • దర్శకుడు  :

    శ్రీవాస్

  • నిర్మాత  :

    వి.ఆనంద్ ప్రసాద్

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    వెట్రి

  • ఎడిటర్  :

    ఎస్.ఆర్.శేఖర్

  • నటినటులు  :

    గోపిచంద్, రకూల్ ప్రీత్ సింగ్, హంస నందిని, చంద్రమోహన్, బ్రహ్మానందం, పోసానీ కృష్ణమురళీ తదితరులు

Loukyam Movie Review

విడుదల తేది :

2014-09-26

Cinema Story

‘లౌక్యం’లో గోపిచంద్ క్యారెక్టర్ పేరు వెంకీ. ఇక మన హీరోయిన్ పాత్ర పేరు చంద్రకళ. కధ విషయానికి వస్తే.., ఈ సినిమాలో గోపిచంద్ ది వరంగల్. స్థానికంగా ఉండే పేరుమోసిన రౌడి బాబ్జి( సంపత్ రాజ్) పెద్ద చెల్లి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అతడు గోపిచంద్ స్నేహితుడు. ఫ్రెండ్ కోసం రౌడి ఇంట్లో నుంచి అమ్మాయిని బయటకు తీసుకువచ్చి పెళ్లి చేసేందుకు గోపిచంద్ సాయం చేస్తాడు. పెళ్ళి విషయం బాబ్జికి తెలియటంతో.., జంటతో కలిసి కొద్దిరోజులు దూరంగా ఉండాలని వెంకట్ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ బాబ్జి చిన్న చెల్లి చంద్రకళ (రకుల్ ప్రీత్) అనుకోకుండా వెంకట్ కు పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ప్రేమలో పడిపోవటంతో పాటు.., అమ్మాయినీ ప్రేమలోకి దింపుతాడు. ఈ విషయం బాబ్జికి తెలుస్తుంది. పెద్ద చెల్లి ప్రేమించి ఇంట్లోనుంచి వెళ్లిపోగా.., చిన్న చెల్లి కూడా ప్రేమలో ఉండటంతో.. కుటుంబం పరువు పోతుందని భావించి చంద్రకళను వరంగల్ తీసుకొచ్చేస్తాడు. విషయం తెలుసుకున్న వెంకట్.., చంద్రకళ కోసం సొంతూరికి వెళ్తాడు. అక్కడ బాబ్జి ఇంట్లోవారిని ఎలా ఒప్పిస్తాడు. పెద్ద చెల్లికి సాయం చేసిన విషయం తెలిసి బాబ్జి ఏమంటాడు అనేది కధ. ఇదంతా మీరు సినిమా థియేటర్ కు వెళ్లి చూడాల్సిందే.

 

cinima-reviews
లౌక్యం

ప్లస్ పాయింట్లు :

ప్రేక్షకుల లౌక్యం తెలిసిన వారంతా కలిసి ‘లౌక్యం’ సినిమా తీసినట్లుగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.., సినిమా మొత్తం ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఎక్కడా బోర్ అన్పించే ఫీల్ రానివ్వకుండా తీశారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇద్దరి మద్య లవ్ కెమిస్ర్టి కూడా బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ సినిమాకు అస్సెట్ అని చెప్పాలి. రెండవ సినిమా అయినా చాలా చక్కగా నటించింది. ఈ సినిమాతో రకుల్ కెరీర్ కు టర్న్ ఇచ్చేదిగా చెప్పవచ్చు.

ఇక కామెడి సీన్లు అయితే నవ్వు ఆపుకోలేనంతగా ఉన్నాయి. సినిమా మొదలవటంతో ప్రారంభమైన కామెడి.., శుభం కార్డు పడే వరకు కొనసాగింది. దీంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా చంద్రమోహన్, బ్రహ్మానందం, థర్టీ ఇయర్స్ ఇండస్ర్టీ ‘పృథ్వీ’ కామెడిని బాగా పండించారు. ‘పృథ్వీ’ ఉన్న సమయంలో అయితే థియేటర్ లో ప్రేక్షకులు నవ్వును ఆపుకోలేకపోయారు. స్టోరీ లైన్ తో పాటు, సీన్లను కూడా చాలా నీట్ గా చూపించారు. గ్లామర్ అవసరమైనంతగా ఉంచారు తప్ప... ఎక్కువగా ఆరాట పడలేదు. కధ రొటీన్ అయినా.., డైరెక్షన్, స్ర్కీన్ ప్లే బాగుంది. ఇక శ్రీధర్ మాటలు కూడా బాగున్నాయి. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. ప్రతి ఒక్కరూ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్లు :

ప్రేమ కథ నేపథ్యంగా వచ్చిన సినిమా కావటంతో.., కాస్త రొటిన్ గా చెప్పవచ్చు. సినిమాలో కొన్ని చోట్ల తర్వాత వచ్చే సీన్లను ప్రేక్షకులు ముందుగానే ఊహించగలుగుతారు. కధను ఎక్కువగా చూపించకుండా.., కామెడిని బేస్ చేసుకుని సినిమాను తీశారు. ఇందులో కూడా చాలా సినిమాలు కలిపి తీసినట్లుగా ఉందని కొంత టాక్ వస్తోంది.

టెక్నికల్ పనితీరు

ఈ సినిమాకు టెక్నికల్ సిబ్బంది కూడా ప్లస్ అయ్యారనే చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది. ఏ పాట ఎక్కడ ఉండాలో.., సరిగ్గా అక్కడే ఉంచారు. ఇక వెట్రి కెమెరా పనితనం కూడా చక్కగా ఉంది. అన్ని సీన్లను బాగా కవర్ చేయటంతో పాటు.., పాటలు, లొకేషన్లను నీట్ గా కవర్ చేశారు. ఎంపిక చేసుకున్న లొకేషన్లు కూడా చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో భవ్య ప్రొడక్షన్స్ వెనకడుగు వేయలేదు అన్పిస్తోంది. అందువల్లే.., ఎక్కడా లోటు లేకుండా స్క్రీన్ ప్లే నీటుగా వచ్చింది.

క్లుప్తంగా చెప్పాలంటే..

సినిమా రొటిన్ కథ అయినా.., కామెడి, టోటల్ ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలా రోజుల తర్వాత వచ్చిన గోపిచంద్ కు ఇది ఓ హిట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఇక రెండవ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ టాలీవుడ్ కెరీర్ కు ఇదో టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పుకోవచ్చు.

Movie TRAILERS

లౌక్యం

play