Teluguwishesh రన్ రాజా రన్ రన్ రాజా రన్ Run Raja Run Telugu Movie Review, Run Raja Run Movie Review, Run Raja Run Movie Review and Rating, Run Raja Run Review, Telugu Movie Run Raja Run Review, Run Raja Run Movie Stills, Run Raja Run Movie Trailer, Videos, Photos, Audio, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 54981 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రన్ రాజా రన్

  • బ్యానర్  :

    వివి క్రియేషన్స్

  • దర్శకుడు  :

    సుజీత్

  • నిర్మాత  :

    వంశీ-ప్రమోద్

  • సంగీతం  :

    ఘిబ్రన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    మధి

  • ఎడిటర్  :

    మధు

  • నటినటులు  :

    శెర్వానంద్, సీరత్ కపూర్

Run Raja Run Movie Review

విడుదల తేది :

01-08-2014

Cinema Story

రాజా హరిశ్చంద్ర ప్రసాద్ (శెర్వానంద్) అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడడు. అది ఎవరైనా సరే.. నిజాలను దాచకుండా అందరి ముందు చెప్పేస్తుంటాడు. ఇలా ఎప్పుడూ నిజాలు మాట్లాడటం వల్లే అతను ప్రేమించిన ప్రతి అమ్మాయితోనూ బ్రేకప్ అవుతూ వుంటుంది. అలాగే ప్రియ (సీరత్ కపూర్) ఏ అబ్బాయినైనా ప్రపోజ్ చేసి ప్రేమలో పడేయాలి అని అనుకుంటే... అనుకోకుండా వారందరికీ పెళ్లిళ్లు అయిపోతూ వుంటాయి.

ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లెమ్ తో నిరాశలో వుంటారు. అనుకోకుండా ఒకరోజు వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. దాంతో వీరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదురుతుంది... అది రానురాను ప్రేమగా మారిపోతుంది. కట్ చేస్తే.. ప్రియ వాళ్ల నాన్న దిలీప్ కుమార్ (సంపత్) సిటీ పోలీస్ కమిషనర్ అని రాజాకి తెలుస్తుంది. దాంతో దిలీప్ కుమార్ తమ పెళ్లికి ఒప్పుకోడని రాజా ఫిక్స్ అయిపోతాడు. కానీ దిలీప్ కుమార్ ఒక మెలిక పెట్టి రాజా - ప్రియ పెళ్లికి ఒప్పుకుంటాడు.

వీళ్ల ప్రేమకథను కొంతసేపు పక్కనపెడితే.. సిటీలో ఒక కిడ్నాప్ గ్రూప్ ప్రముఖులను కిడ్నాప్ చేస్తూ డబ్బులను సంపాదిస్తుంటారు. ఆ గ్రూప్ ను పట్టుకోవడం కోసమే దిలీప్ కుమార్ సిటీకి వస్తాడు. మరి దిలీప్ ఆ కిడ్నాప్ ముఠాను పట్టుకుంటాడా..? లేదా..? దిలీప్ రాజా - ప్రియకు పెట్టిన ఆ మెలికేంటి..? ఆ మెలికకు - కిడ్నాప్ కు ఏమైనా సంబంధం వుందా..? రాజా ఇందులో జోక్యం చేసుకుంటాడా..? లేదా..? అనే ట్విస్టులతోనే స్టోరీ మొత్తం నడుస్తుంది.

cinima-reviews
Run Raja Run Movie Review

ఇప్పటివరకు కేవలం కమర్షియల్ పాత్రలను మాత్రమే పోషిస్తూ... టాలీవుడ్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్న హీరో శెర్వానంద్... మొదటిసారిగా లవర్ బాయ్ గా తన గెటప్ ను మార్చుకుని ప్రేక్షకులను అలరించడానికి చేసిన తాజా చిత్రం ‘‘రన్ రాజా రన్’’! ‘‘మిర్చి’’ మూవీలాంటి బ్లాక్ల్ బస్టర్ హిట్ అందించిన యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ మూవీని.. షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజీత్ డైరెక్టర్ గా పరిచయమవుతూ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీకి జిబ్రాన్ అందించిన పాటలు చాలా బాగున్నాయంటూ ప్రేక్షకులు మంచి మార్కులు ఇచ్చేశారు. శెర్వానంద్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతుందో లేదో తెలుసుకోవడానికి రివ్యూలోకి వెళ్లాల్సిందే!

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

కమర్షియల్ హీరోగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన హీరో శెర్వానంద్... ఈసారి తన టోటల్ లుక్స్ మార్చేసి ఈ సినిమాకి పర్ ఫెక్ట్ హీరోగా సెట్ అయ్యాడు. ఆడియెన్స్ అందరూ శెర్వానంద్ పాత్ర చాలా థ్రిల్లింగ్ గా వుందంటూ తెగ పొగిడేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో శెర్వానంద్ ఒక్కడే సోలోగా ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించేశాడు. ఈ సినిమాకు మేజర్ హైలైట్ ఎవరైనా వున్నారంటే.. అది శెర్వానంద్ పాత్రేనని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు.

హీరోయిన్ సీరత్ కపూర్ కు ఇది మొదటి సినిమా అయినా.. తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తెలుగు రాకపోయినా లిప్ మూవ్ మెంట్ లో తేడాలు రాకుండా చాలా జాగ్రత్తలు పాటించింది. డాన్స్ స్టైల్ తో తన ఎనర్జీ లెవెల్స్ ను ప్రూవ్ చేసుకుంది. సినిమా మొత్తం మీద మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ... బాగానే గ్లామర్ ఒలకబోసేసింది. ఒకవేళ లక్ కలిసొస్తే.. తన మొదటి సినిమా నుంచే ఆఫర్లను కొల్లగొట్టేయొచ్చు ఈ అమ్మడు.

ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన దిలీప్ కుమార్ కామెడీని కూడా బాగానే పండించాడు. అలాగే అడవి శేష్ కూడా అమాయకంగా కనిపిస్తూనే.. ఇంటలిజెన్స్ వున్న వ్యక్తిలా బిహేవ్ చేసే పోలీస్ పాత్రలో బాగానే నటించాడు. మొదటిసారి డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించిన జయప్రకాశ్ పర్ ఫార్మెన్స్ డీసెంట్ గా వుంది. కోట శ్రీనివాసరావు, అలీ, ఇంకా తదితర నటీనటులు తమ పాత్రలను బాగానే న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్రెష్ గా వుంటూ ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది. క్లైమాక్స్ లో 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా సాగుతుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మొదటి మైనస్ పాయింట్ సెకండాఫ్. చివరి 20 నిమిషాల చిత్రం తప్ప.. మిగతా పార్ట్ అంతా బోరింగ్ గా సాగదీశారు. ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులకు సహనం వుండాల్సిన అవసరం చాలా వుంది. వరుసగా రెండు పాటలు పెట్టడమే కాకుండా.. కామెడీ మిస్ చేసి.. అసలు కథ నుంచే పక్కకు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఫస్టాఫ్ లో వున్నంత ఎంటర్ టైన్ మెంట్ సెకండాఫ్ లో పూర్తిగా మిస్సయ్యింది.

ఇక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి కమిషనర్ పాత్రను పరిచయం చేసినా.. అంత పవర్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లలేదు. చివరి వరకూ పోలీస్ ట్రాక్ చాలా సిల్లీగా నడుస్తుంది. దొంగకి పోలీస్ చెక్ పెట్టగలిగితేనే ఆడియెన్స్ కి సినిమాలో ఏం జరుగుతుందా అనే థ్రిల్ వస్తుంది. కానీ డైరెక్టర్ అలా చేయలేకపోయాడు. దొంగతనాలు ఎవరు చేస్తున్నారనే ట్విస్ట్ ముందుగానే రివీల్ అయిపోతుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా అంతగా బాగోలేదు.

సాంకేతిక పరిజ్ఞానం :

డైరెక్టర్ గా సుజీత్ కు మొదటి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా పర్ ఫెక్ట్ గా డీల్ చేశాడు. ఒక థ్రిల్లర్ సినిమాలో వుండాల్సిన లాజిక్స్ అన్ని బాగానే ప్లాన్ చేశాడు. కానీ ఇంకా బాగా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసి వుంటే బాగుండేది. ఇందులో వుండాల్సిన ఓ రేంజిలో వుండాల్సిన ట్విస్ట్ లు డీలా పడిపోయాయి. సుజీత్ తీసుకున్న కథ పాతదే అయినా.. ప్రెజెంటేషన్ కొత్తగా చూపించాడు. స్ర్కీన్ ప్లే - లాజిక్స్ మిస్ కాకుండా కేర్ తీసుకున్నాడు. వన్ లైన్ డైలాగ్స్ బాగానే పేలాయి. డైరెక్టర్ గా మొదటి సినిమాతోనూ సుజీత్ ఫస్ట్ క్లాస్ లోనే పాసయ్యాడని చెప్పుకోవచ్చు.

ఇక సినిమాటోగ్రఫీ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. హైదరాబాద్ లొకేషన్స్ గ్రాండ్ గా చూపించారు. సూపర్ లొకేషన్స్ కి తగ్గట్టు సంగీత దర్శకుడు జిబ్రాన్ మంచి మ్యూజిక్ నే అందించాడు. జిబ్రాన్ పాటలు ఎంత హిట్ అయ్యాయో.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే హిట్ అయ్యింది. ఇక ఎడిటర్ విషయానికి వస్తే.. మధు సెకండాఫ్ ని ఇంకాస్త తగ్గించి వుంటే బాగుండేది. యూవీ ప్రొడక్షన్స్ నిర్మాతలైన వంశీకృష్ణరెడ్డి - ప్రమోద్ ఉప్పలపాటి సినిమాను బాగా రిచ్ ఫీల్ వచ్చేలా నిర్మించారు.

చివరగా..
రాజా బాగానే రన్ చేస్తున్నాడు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలా పరుగెత్తుతాడో కొన్నాళ్ల వరకు వేచి చూడాల్సిందే!