Teluguwishesh మనం మనం Manam Get information about Manam Telugu Movie Review, Manam Telugu Review, Manam Movie Review, Manam Review And Rating, Manam Review, Manam Movie Review And Rating, Manam Movie Rating, Manam Movie Stills, Manam Movie Wallpapers, Manam Movie Trailers and more on Teluguwishesh.com Product #: 52912 4/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మనం

  • బ్యానర్  :

    అన్నపూర్ణ స్టూడియోస్

  • దర్శకుడు  :

    విక్రమ్. కె. కుమార్

  • నిర్మాత  :

    క్కినేని కుటుంబం

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    4/54/54/54/5  4/5

  • ఛాయాగ్రహణం  :

    పి.ఎస్. వినోద్

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున; నాగచైతన్య, శ్రేయ, సమంతా, అఖిల్

Manam Telugu Movie Reviews

విడుదల తేది :

23 మే, 2014

Cinema Story

రాధా మోహన్ (నాగ చైతన్య) క్రిష్ణ వేణి (సమంతా) వీరిద్దరు దంపతులు. వీరికి బిట్టు అనే బాబు ఉంటాడు. ఈ దంపతుల మధ్య చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోదామనే ఆలోచనకు వస్తారు. ఇంతలోనే ఒక కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోతారు. బిట్టు పెరిగి పెద్దయి సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌ నాగేశ్వరరావు (నాగార్జున) అవుతాడు. అనుకోకుండా ఓ సారి  నాగచైతన్య, సమంతల చూసి తన చిన్నతనంలో చనిపోయిన తల్లి, తండ్రులు (రాధా మోహన్, కృష్ణవేణి) మళ్లీ పుట్టారు అని నిర్థారించుకొని వారిని కలిపేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటాడు.  చైతన్య (నాగేశ్వరరావు) నాగేశ్వరరావుని, అంజలిని (శ్రియ) జంటగా ఉండటం చూసి షాక్‌ అవుతాడు. చివరికి నాగార్జున, నాగేశ్వరరావులు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా ? వారి వెనుక ఉన్న కథేంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాకు వెళ్లిరావాల్సిందే.

cinima-reviews
మనం

టాలీవుడ్ లో తొలిసారి మూడు తరాలకు చెందిన హీరోలు అంతా కలిసి నటించిన సినిమా ‘మనం ’. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలను తలదన్నే విధంగా ఇప్పటి వరకు వచ్చిన టీజర్లు. ట్రైలర్లు, పాటలు ఇలా ఒక్కటేమిటి సినిమాలో అన్ని బాగున్నాయనే టాక్ రావడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసిన ప్రేక్షకులకు ఆ రోజు రానే వచ్చింది.

నేడు ఈ సినిమా ప్రపంప వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక మూడు తరాల హీరోలను రెండు చిత్రాల అనుభవం (13 బి, ఇష్క్ ) ఉన్న విక్రమ్ కె.కుమార్ సినిమాను ఎలా హ్యాండిల్ చేశాడు. సరికొత్త కథ, కథనంతో మనసుకు హత్తుకునేలా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిందా ? లేదా ? అన్నది తెలియాలంటే మనకు అందుబాటులో ఉన్న ‘మనం ’ థియేటర్స్ వెళ్ళండి.

Cinema Review

అక్కినేని నాగేశ్వరరావు తన నట జీవితం మొదలు పెట్టి నటప్పటి నుండి చివరి క్షణం వరకు నటిస్తూ వచ్చాడు. చివరి సారిగా తన కొడుకు మనవలతో కలిసి నటించిన ఈ చిత్రంలో ఆయన పాత్ర హైలెట్. ఆయన సినీ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో పాత్రలు పోషించి మెప్పించిన ఆయన ఈ సినిమా లో తన స్థాయికి తగ్గ పాత్ర రావడంతో వెంటనే ఒప్పుకోవడమే కాకుండా, తన అనుభవాన్నంత రంగరించి ఈ పాత్రకు జీవం పోశాడు. తన సినీ కెరియర్ లో ఈ పాత్ర చిర స్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నాగార్జున, నాగ చైతన్యలు కూడా తన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

గత కొంత కాలంగా సరైన పాత్రలు లేక నాగార్జున, సరైన సినిమాలు లేక చైతన్య కు సరైన హిట్లు లేక సతమతం అవుతున్న వారిద్దరికి ఇది సరైన సినిమా. ఇప్పటి వరకు నటనా పరంగా అంతంత మాత్రంగానే మార్కుల కొట్టేసిన చైతన్య ఈ సినిమాలో ఎంతో పరిపక్వత సాధించాడని స్పష్టంగా తెలుస్తుంది. సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రల్లో నటించారు. సమంతా పాత్ర, చైతన్యతో చేసిన రొమాన్స్ సీన్స్ బాగా పండాయి. శ్రేయ కూడా నాగార్జున తో నడిపిన కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఇక చివర్లో గెస్ట్ పాత్రలో నటించిన అఖిల్ కనిపించిన కాసేపు అందర్ని అలరించారు. ఆలీ, బ్రహ్మనందం, సప్తగిరి వారి వారి పాత్రల మేరకు నటించారు.

కళాకారుల పనితీరు

మూడు తరాల హీరోలను హ్యాండిల్ చేయాలంటే దానికి తగ్గట్లు కథ, స్ర్కీన్ ప్లే, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇలా ఒక్కటేమిటి అన్ని కుదిరితేనే సినిమా బాగొస్తుంది. ఈ సినిమాకు అన్ని కుదిరాయి. ముఖ్యంగా ఈ చిత్ర కథను రూపొందించిన విక్రమ్ కే కుమార్ కథను హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.  రెండు పునర్జన్మ కథలను చక్కగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆలరింప చేయడంలో విక్రమ్ కుమార్ సఫలమయ్యారు. ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులు వచ్చినా, అనతి కాలంలోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. అనూప్ రూబెన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ.

కెమెరామెన్ పీఎస్ వినోద్ కెమెరా పనితనం ఓ రేంజ్ లో ఉంది. దర్శకుడు అనుకున్న విధంగా ప్రతి సీన్ ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. పెద్ద పెద్ద సినిమాల్లో సైతం ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉన్నఈ రోజుల్లో... ఇంత విషయమున్న సినిమాని వీలయినంత పొందిగ్గా ప్రవీణ్ పూడి పొందు పరిచాడు.  సంభాషణల రచయిత హర్షవర్ధన్‌ మనస్సుకు హత్తుకునే సంభాషణలు ఇచ్చాడు. నిర్మాణ విలువలు చాగా బాగున్నాయి. ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాగార్జున ఏ మాత్రం వెనకాడలేదు. మొత్తంగా చూస్తే ఈ సినిమా హై స్టాండర్డ్స్ సినిమాల జాబితాలో ఒకటి.