Teluguwishesh భద్రమ్ భద్రమ్ Bhadram Telugu Movie Review, Bhadram Movie Review, Bhadram Movie Review and rating, Telugu Bhadram Review, Bhadram Review, Bhadram Movie Stills, Bhadram Movie Trailer, Videos, Songs, Gallery, telugu movie reviews and more on teluguwishesh.com Product #: 51199 3.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    భద్రమ్

  • బ్యానర్  :

    పుష్యమి ఫిలిం మేకర్స్‌-శ్రేయాస్‌ మీడియా

  • దర్శకుడు  :

    పి. రమేష్

  • నిర్మాత  :

    గుడ్ ఫ్రెండ్స్బి &. రామ కృష్ణ రెడ్డి

  • సంగీతం  :

    నివాస్. కే . ప్రసన్న

  • సినిమా రేటింగ్  :

    3.5/53.5/53.5/5  3.5/5

  • ఛాయాగ్రహణం  :

    దినేష్ కృష్ణన్

  • ఎడిటర్  :

    లియోజాన్ పౌల్

  • నటినటులు  :

    అశోక్‌ సెల్వన్‌, జనని అయ్యర్‌, జయప్రకాష్‌ తదితరులు

Bhadram Telugu Movie Review

విడుదల తేది :

21-3- 2014

Cinema Story

"విల్లా" చిత్రంతో మంచి థ్రిల్లర్ ను డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించిన గుడ్ సినిమా గ్రూప్ ఈ శుక్రవారం మన ముందుకు మరో థ్రిల్లర్ తో వచ్చారు. రమేష్ దర్శకత్వంలో అశోక్ సెల్వన్ మరియు జనని అయ్యర్ నటించిన ఈ చిత్రం తమిళంలో "తెగిడి" అనే పేరుతో విడుదల అయ్యి ఘన విజయం సాదించింది. 'భద్రమ్' అనే పేరుతో తెలుగులో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను భయపెట్టిందా లేక టెన్షన్ పెట్టిందా అనేది ఇప్పుడు చూద్దాం..

గుంటూరు అమరావతికి చెందిన వేణు(అశోక్ సెల్వన్) క్రిమినాలజి కోర్సు పూర్తి చేస్తాడు. అతను కోరుకున్నట్లుగానే హైదరాబాద్ లో రాడికల్ డిటెక్టివ్ ఏజెన్సీలో డిటెక్టివ్ గా జాబ్ వస్తుంది. మొదటి నాలుగు కేసులను చాలా తెలివిగా పరిష్కరించి అందరి మన్ననలను పొందుతాడు. 

ఇదిలా సాగుతుండగా మధు శ్రీ(జనని అయ్యర్) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు వేణు. తరువాతి కేసు గా మధు శ్రీ నే రావడంతో ఆమెకు తెలియకుండానే ఆమె మీద నిఘా ఉంచుతాడు. అదే సమయంలో వేణు - మధు మధ్య పరిచయం ఏర్పడి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. 

అప్పుడే వేణుకి తను గతంలో డీల్ చేసిన నాలుగు కేసులలోని వ్యక్తులు చనిపోతున్నారని, వారి చావుతో ప్రస్తుతం తను డీల్ చేస్తున్న మధు కేసు కి కూడా సంభంధం ఉన్నట్టు గ్రహిస్తాడు. ఆ ఐదు కేసులకి ఉన్న సంభంధం ఏంటి? వాటితో మధుకి ఉన్న సంభంధం ఏంటి? అసలు వారెందుకు చనిపోయారు? అన్న అంశాలు తెర మీద చూడవలసిందే...

cinima-reviews
భద్రమ్

సస్పెన్స్ థ్రిల్లర్ అంటే చిత్రం ఆసాంతం ప్రేక్షకుడిని థ్రిల్ చెయ్యగలిగి ఉండాలి ఈ మధ్య కాలంలో తెలుగులో ఇటువంటి చిత్రాలు కరువయ్యాయి అప్పుడప్పుడు వచ్చినా అవికాస్తా తమిళ్ డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. ఈ చిత్రం కూడా అదే కోవకు చెందింది దర్శకుడు రమేష్ లఘు చిత్రాల ద్వారా తెరకు పరిచయం అయ్యాడు. 

మొదటి చిత్రమే అయినా కథనం విషయంలో చాలా పరిపఖ్వత కనబరిచారు. ముఖ్యంగా ట్విస్ట్ విషయంలో అయన అనుసరించిన విధానం చాలా బాగుంది. సగటు ప్రేక్షకుడికి చివరి వరకు ట్విస్ట్ ని ఊహించడం దాదాపుగా కష్టం అనే చెప్పుకోవాలి అంత పగడ్బందీగా స్కీన్ ప్లే రాసుకున్నారు. 

కానీ ట్విస్ట్ అంది రివీల్ అయ్యాక ఇవ్వాల్సిన జస్టిఫికేషన్ లో మాత్రం డైరెక్టర్ న్యాయం చేయలేకపోయాడు. ఇక నటీనటులు కూడా పాత్రకు తగ్గ ప్రతిభ కనబరచడంతో చిత్రం ఆసాంతం మంచి సస్పెన్స్ గా సాగిపోతుంది. అందులోనూ ఇంటర్వెల్ దగ్గర వచ్చే సన్నివేశం చాలా బాగుంటుంది. నివాస్ అందించిన సంగీతం చిత్రానికి చాలా ప్లస్ అయ్యింది. 

సస్పెన్స్ సన్నివేశాలకు అత్యంత బలం చేకూర్చి ఆడియన్స్ లో మూడ్ సృష్టించడంలో చాలా సహాయపడింది. మొదటి అర్ధ భాగం చాలా వేగంగా సాగిపోతుంది కానీ అసలు ట్విస్ట్ ఉన్న రెండవ అర్ధ భాగంలో ఉంది. దర్శకుడు కథనం విషయంలో అక్కడక్కడా తడబడ్డాడు అందుకే సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్టు అనిపిస్తుంది. 

థ్రిల్లర్ కథలు నచ్చే ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం.. పక్కా మాస్ లేదా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కోరుకునే వారికి మాత్రం ఈ సినిమా 50-50 చాన్స్ అని చెప్పుకోవాలి.

Cinema Review

మనమెప్పుడు చూసే పెద్ద పెద్ద నటీనటులెవ్వరు ఈ చిత్రంలో కనిపించరు. ఒక్క జయప్రకాశ్ మాత్రమే పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. అలానే హీరో అశోక్ సెల్వన్ తన బాడీలాంగ్వేజెస్ ను, తన చుపులోను, నటనలోను డిటెక్టివ్ పాత్రకు అనుగుణంగా మలుచుకున్నాడు. హీరోయిన్ గా నటించిన జెన్నిలేయర్ తన పాత్రకు న్యాయం చేసింది. అశోక్ కి ఫ్రెండ్ గా నటించిన కాళి పర్వాలేదనిపించాడు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్ లో చెప్పుకోవాల్సింది నివాస్ కె ప్రసన్న మ్యూజిక్ మరియు దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ. నివాస్ కె ప్రసన్న అందించిన పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో సస్పెన్స్ సీన్ ని ఎలివేట్ చేసి ఆడియన్స్ లో టెన్సన్ క్రియేట్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు. 

దినేష్ కృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ బాగుంది కానీ ఇంకాస్త బెటర్ గా ట్రై చేసి ఉంటే సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యేది. డైలాగ్స్ మరియు తెలుగు వెర్షన్ డబ్బింగ్ కూడా సినిమాకి బాగా సరిపోయింది.

ఇక డైరెక్టర్ గా పి. రమేష్ కి ఇది మొదటి సినిమా, అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ మూవీని చాలా బాగా హాండిల్ చేసాడు. సెకండాఫ్ క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

యంగ్ డిటెక్టివ్ పాత్రకి అశోక్ సెల్వన్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. డైరెక్టర్ రాసుకున్న పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. టెన్షన్, సస్పెన్స్ సన్నివేశాల్లో అతని నటన బాగుంది. పోలీస్ ఆఫీసర్ జయ ప్రకాష్, హీరో ఫ్రెండ్ గా చేసిన కాళి తమ పాత్రలకు న్యాయం చేసారు.

డైరెక్టర్ అది ఇది అని పక్కదార్లు పట్టకుండా మొదటి సీన్ తోనే కథలోకి వెళ్ళిపోయాడు. సినిమా స్టార్టింగ్ ఒకమాదిరిగా మొదలయ్యి, మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ దగ్గర కాస్త స్లో అయ్యి ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు 30 నిమిషాలు మాత్రం చాలా వేగంగా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ని కూడా ప్రేక్షకులలో ఉత్కంఠని పెంచేలా డైరెక్టర్ పి. రమేష్ బాగా డీల్ చేసాడు.

డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సినిమాలోని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే సినిమా నిడివి కూడా 2 గంటలే కావడం ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

సినిమా సెకండాఫ్ మొత్తాన్ని కాస్త సస్పెన్స్ గా లాక్కొచ్చినప్పటికీ క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత జస్టిఫికేషన్ సరిగా ఉండదు. దానివల్ల సినిమాకి ముగింపు కాస్త అర్ధవంతంగా అనిపిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కాబట్టి మనం కామెడీ ఆశించకూడదు.

మనం ఆశించినట్టుగానే ఈ సినిమాలో కామెడీ అస్సలు లేదు. అందువల్ల ఈ సినిమా బి, సి సెంటర్స్ లో ఎక్కడం కాస్త కష్టతరం అని చెప్పాలి.

హాలీవుడ్ టీవీ సీరీస్ మరియు హిందీ సిఐడి సీరీస్ లు ఫాలో అయ్యేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు.

చివరిగా మా మాట :  

సస్పెన్సు తో కూడిన ఒక చిన్న సినిమా అయినప్పటికీ, చూసేవారికి రెండుగంటలు అన్నీ మరచిపోయి, ఏం జరుగుతుందో అనే టెన్షన్ కలిగేలా తీసిన ఈ చిత్రాన్ని.. అనువాధ చిత్రంగా కాకుండా సినిమాలా చూడండి. భద్రం గా వెళ్ళండి భద్రమ్ గా రండి..