Teluguwishesh రాజా - రాణి రాజా - రాణి Raja Rani Telugu Movie Review, Raja Rani Telugu Movie Review and Rating, Telugu Raja Rani Movie Review, Raja Rani Telugu Review, Directed by Atlee Kumar, Cast and Crew Arya, Nayantara, Nazriya Nazim, Raja Rani Telugu Movie Stills, Videos, Teasers, Trailers, Wallpapers, Songs and more on Teluguwishesh.com Product #: 50936 3.0 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రాజా - రాణి

  • బ్యానర్  :

    ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌

  • దర్శకుడు  :

    ఎ.ఆర్‌. మురుగదాస్‌

  • నిర్మాత  :

    ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎఆర్ మురుగ దాస్ ప్రొడక్షన్స్, దినెక్ట్స్ జగ్ ఫిలిమ్

  • సంగీతం  :

    జి. వి. ప్రకాష్‌కుమార్‌

  • సినిమా రేటింగ్  :

    3.03.03.0  3.0

  • ఛాయాగ్రహణం  :

    జార్జి సి. విలియమ్స్

  • ఎడిటర్  :

    ఎల్. రూబెన్

  • నటినటులు  :

    నయనతార, నదియా, ఆర్య, జై, సత్యరాజ్, సంతానం

Raja Rani Telugu Movie Review

విడుదల తేది :

14 Mar 2014

Cinema Story

జాన్(ఆర్య), రెజీనా(నయనతార) ఇష్టం లేని పెళ్లి చేసుకుంటారు. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఇద్దరు కీచులాడుకోవడం, పోట్లాడుకుంటారు. దీనికి కారణం వీరిద్దరి ప్రేమ కథలుంటాయి. రెజీనా ఇది మొదటి ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్ లో రెజీనా, సూర్య(జై) అనే ఓ అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. రెజీనాను తానూ ప్రేమించినా...తండ్రికి భయపడి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు. సూర్య వదిలి వెళ్లడం భరించలేని రెజీనా...తీవ్రంగా కుంగిపోతుంది. అయితే తండ్రి మాట కాదనలేక జాన్ ను పెళ్లి చేసుకుంటుంది. రెజీనా ప్రేమకథను తెల్సుకున్న జాన్...ఆమెను ఇష్టపడటం మొదలు పెడతాడు. కానీ రెజీనా మారకపోవడం చూసిన జాన్ స్నేహితుడు సంతానం.. జాన్ గతంలోని ప్రేమ కథను రెజీనాకు చెబుతాడు. ఇది రెండో ఫ్లాష్ బ్యాక్..దీంట్లో జాన్..మనసారా ప్రేమించిన యువతి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ఆసక్తి కర సన్నివేశాలు చోటుచేసుకున్నాయనేది మిగతా కథ.

cinima-reviews
రాజా - రాణి

నయన తారా' లవ్ ఎఫైర్స్ నుంచి బయటపడ్డ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ ఫుల్ గా స్టార్ చేసింది. దానిలో భాగంగానే దీనిలో బంపర్ హిట్ కొట్టిన సినిమా 'రాజారాణి'. ఆర్యతో కలిసి నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు 'అట్లీ' డైరెక్షన్ లో తెరకెక్కింది.

తమిళంలో ఇంతకు ముందే విడుదలై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ కలెక్షన్లనూ రాబట్టింది. లవ్ ఎంటర్ టైన్మెంట్ , మెసేజ్ ఓరియెంట్ గా వచ్చిన ఈమూవీ తెలుగులో డబ్బింగ్ అయి ఈ శుక్రవారం విడుదలయ్యింది. తమిళంలో హిట్ కావడంతో ఈ మూవీపై తెలుగు ఆడియెన్స్ లో కూడా అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో 'రాజా రాణి'లు సక్సెస్ అయ్యారా..? లేదా ? అనేది చూద్దాం..

జీవితంలో మనకు కావాల్సిన వారు శాశ్వతంగా దూరమైనా...అక్కడితో జీవితం ముగిసిపోదని...మనకు జరగాల్సిన మంచి లైఫ్ లో మిగిలే ఉందనే ఓ చక్కటి పాయింట్ తో దర్శకుడు 'అట్లీ' చేసిన ప్రయత్నమే 'రాజా రాణి'. లవ్ బ్రేక్ తర్వాత లైఫ్ ఉంటుంది, లవ్ ఉంటుందనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. కథ పాతదే అయినా...ఫీల్ గుడ్ స్క్రీన్ ప్లే, కథకు కామెడీ టచ్ సినిమాను నిలబెట్టాయి.

 నిజానికి ఇది పాథటిక్ స్టోరీ. కానీ దర్శకుడు 'అట్లీ' కొత్త వాడైనా...కామెడీ కోటింగ్ తో చక్కగా నేరేట్ చేశాడు. ఇక్కడే అతని ప్రతిభ కనపడింది. సినిమా ప్రారంభంలో జాన్, రెజీనా మధ్య సన్నివేశాలు ఆసక్తికంగా సాగుతాయి.

రెండు ఫ్లాష్ బ్యాక్ ల్లో రెజీనా, సూర్య లవ్ స్టోరీ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. వీరి మధ్య సాగిన లవ్ ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేయడమే కాకుండా హార్ట్ టచ్ గా ఉంటుంది. ఇక సెకండాఫ్ కాస్త నెమ్మదించింది.

జాన్, కీర్తి ల లవ్ స్టోరీలో పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కాకపోతే.. కామెడీతో పాటు సెంటిమెంట్ సన్నివేశాలు సినిమాలో ఫీల్ ను నింపాయి. అయితే ఇద్దరి ప్రేమలో చివరికే కలిపే సన్నివేశాలు కాస్త రోటీన్ గానే ఉన్నా..క్లైమాక్స్ లో చనిపోయాడనుకున్న జై ఎయిర్ ఫోర్ట్ లో కనిపించే ట్విస్ట్ ఆడియెన్స్ లో ఆసక్తిని పెంచుతోంది.

Cinema Review

ఇక నటీనటుల్లో నయనతార సినిమాను లీడ్ చేసింది. ఆమె నటన సినిమాకు హైలెట్. ఆర్య, జై, నజ్రీయా నజిమ్ మంచి నటన కనబరిచారు. జై క్యారెక్టర్ లో ఏడుపులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు సెంటిమెంట్, ఏడిపించే సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా మారాయి.కథా, కథనం ఆకట్టుకునేలా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు సంగీతం మైనస్ గా మారింది. ఉన్న రెండు, మూడు పాటలు ఏ మాత్రం అర్థంకాకుండా..ఏదో ఉన్నాయనిపించేలా ఉన్నాయి.జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త ఫర్వాలేదనిపించింది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కట్ చేస్తే ఇంకా బాగుండేది. సినిమా నిడివి ఎక్కువైంది. సెకండాఫ్ లో స్లో నెరేషన్ ప్రేక్షకులను కొంతసేపు విసిగెస్తుంటుంది. మొత్తానికి 'రాజా రాణి' సినిమాను వీలైతే ఓసారి చూడొచ్చు.