Teluguwishesh బసంతి బసంతి Basanti Telugu Movie Review, Basanti Movie Review, Basanti Movie Review and Rating, Basanti Review, Telugu Basanti Movie Review, Basanti Movie Stills, Basanti movie press meet stills, Basanti Movie Audio Launch Stills, Basanti Movie Teasers, Basanti Movie Trailers, videos and more on teluguwishesh.com Product #: 50587 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బసంతి

  • బ్యానర్  :

    స్టార్ట్‌ కెమెరా పిక్చర్స్‌

  • దర్శకుడు  :

    చైతన్య దంతులూరి

  • నిర్మాత  :

    చైతన్య దంతులూరి

  • సంగీతం  :

    మణిశర్మ

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • ఛాయాగ్రహణం  :

    అనిల్‌ బండారి, పి.కె. వర్మ

  • ఎడిటర్  :

    మార్తాండ్‌ కె. వెంకటేష్‌

  • నటినటులు  :

    గౌతమ్, అలీషా భేగ్

Basanti Movie Review

విడుదల తేది :

ఫిబ్రవరి 28, 2014

Cinema Story

సరదాగా స్నేహితులతో కాలేజ్ లైఫ్ ను గడిపే అర్జున్ (గౌతమ్ ) అదే కాలేజీలో చదువుతున్న రోషిణి (ఆలీషా) తో ప్రేమలో పడతాడు. ఆమెతో ప్రేమను ఎక్స్ ప్రెస్ చేద్దామనుకునే ఆమె కనిపించకుండా పోతుంది. అదే సమయంలో అతను చదువుతున్న బసంతి ఇంజినీరింగ్ కాలేజీని టెర్రరిస్ట్ లు చుట్టుముట్టి ఆధీనంలోకి తీసుకుంటారు. పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్ట్ బాబాఖాన్ ని విడుదల చేయాలని కండీషన్ పెడతారు. ఈ క్రమంలో అర్జున్‌ ప్రాణ స్నేహితుడు అబ్బాస్‌ని (రణధీర్‌) చంపేస్తారు. కాలేజీలో బందీ అయిన వారిని గౌతమ్ ఉగ్రవాదుల భారి నుండి ఎలా కాపాడుతాడు. తన ప్రేమను రోషిణికి తెలియజేస్తాడా ? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
బసంతి

టాలీవుడ్ టాప్ కమేడియన్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చి రెండు సినిమాల్లో నటించినా, ఇంత వరకు సక్సెస్ బాట పట్టలేదు. చాలా గ్యాప్ తరువాత మళ్లీ హీరోగా నిరూపించుకోవడానికి ‘బాణం ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న చైతన్య దంతులూరి దర్శకత్వంలో ‘బసంతి ’ సినిమా చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టి తన కెరియర్ ని గాడిలో పడేసుకోవాలనుకున్న ఆయన సినిమాకు ముందు టాలీవుడ్ మెగా హీరోలతోనే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులతో కావాల్సినంత ప్రచారం చేయించాడు. మరి ఈసారైనా బ్రహ్మీకి పుత్రోత్సాహం దక్కిందా ? హీరోగా గౌతమ్ నిలదొక్కుకునే చిత్రం అయ్యిందా లేదా ఈ చిత్రం రివ్యూ ద్వారా చూద్దాం.

Cinema Review

చాలా రోజుల తరువాత మళ్ళీ వెండితెర పై కనిపించిన గౌతమ్ గత రెండు సినిమాల కంటే ఇందులో మెచ్చ్యూర్డ్ గా నటించాడు. ఇంకా నటన మెరుగు పరుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా మొదటి నుండి చివరి వరకు ఒకే ఎక్స్ ప్రెషన్స్ పెట్టారు. కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో కూడా క్యాజువల్స్ గా నటించేశాడు. డైల్సాగ్ కూడా నార్మల్ గానే చెప్పాడు. హీరోయిన్ ఆలీషా బేగ్ నటన అంతంత మాత్రంగానే ఉంది. ఇక ఆమెకు రాసిన సంభాషణలు ఎబ్బెట్టుగా ఉండటమే కాకుండా, లిప్ రీడింగ్ మూమెంట్స్ కూడా అస్సలు సెట్ కాలేదు. సయాజీ, తనికెళ్ళ భరణి, షిండే సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌తో సినిమాకు కాస్తంత బలం తీసుకొచ్చారు. గౌతమ్ ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించిన రణదీర్ ఫర్వాలేదించారు. మిగతా వారు తమ తమ పాత్రల మేరకు నటించారు.

సాకంకేతిక వర్గం :

మణిశర్మ మ్యూజిక్‌ ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. ఎమోషన్‌ పండాల్సిన సీన్స్‌ చాలా ఆర్డినరీగా తెరకెక్కినా కానీ ఆ లోటుని మణిశర్మ చాలా వరకు పూరించాడు. ఫొటోగ్రఫీ, పేలవమైన కథ, కథనాన్ని మరుగున పరిచే విధంగా చిత్రానికి కొంత ఊపిరి పోసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి అంశాలు బసంతి చిత్రానికి ఎస్సెట్ గా నిలిచాయి.  గోల్కొండ ఫోర్ట్‌లో తీసిన పాట చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. దర్శకుడు చైతన్య దంతులూరి తన టెక్నికల్‌ టీమ్‌ నుంచి మంచి అవుట్‌పుట్‌ రాబట్టుకున్నాడు. కథ, కథనం విషయంలో మాత్రం బాగా గ్రౌండ్ వర్క్ చేయలేదేమో అనిపిస్తుంది. దర్శకుడిగా రాణించినా కానీ రచయితగా కాంప్రమైజ్‌ అయినట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌ అంతా ఒకే లొకేషన్‌లో తీసినా కానీ ఆ ఫీల్‌ రానివ్వలేదు. సెకండ్‌ హాఫ్‌లోని ఆ ఎక్స్‌ట్రార్డినరీ సిట్యువేషన్‌ని డీల్‌ చేసిన విధానం ఆకట్టుకోదు.