Teluguwishesh వర్ణ వర్ణ Varna Telugu Movie Review, Rating, Varna Movie Review, Anushka Varna Movie Review, Telugu Varna Movie Review, Anushka Arya Varna Movie Review, Varna Telugu Movie Stills, Varna Telugu Movie Wallpapers, Varna Telugu Movie Gallery, Varna Telugu Movie Trailers, Varna Telugu Movie Songs, Varna Telugu Movie, Varna Telugu Movie Posters, Varna Telugu Movie Videos, Varna Telugu Movie Release Date and More on Teluguwishesh.com Product #: 48700 1/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    వర్ణ

  • బ్యానర్  :

    పివిపి సినిమా

  • దర్శకుడు  :

    సెల్వరాఘవన్

  • నిర్మాత  :

    ప్రసాద్ వి. పొట్లూరి

  • సంగీతం  :

    హరీష్ జయరాజ్

  • సినిమా రేటింగ్  :

    1/5  1/5

  • ఛాయాగ్రహణం  :

    రామ్ జీ

  • ఎడిటర్  :

    కోల బాస్కర్

  • నటినటులు  :

    ఆర్య, అనుష్క శెట్టి

Varna Telugu Movie Review

విడుదల తేది :

నవంబర్ 22 2013

Cinema Story

అనుష్క, (రమ్య), ఆర్య (మధుబాలక్రిష్ణ) భూలోకంలో వీరిద్దరు ప్రేమించుంటారు. మరో లోకంలో (వర్ణ) అనుష్క, మహేంద్ర (ఆర్య) ల ప్రేమ కథ నడుస్తుంటుంది. ఆలోకంలో సేనాధిపతి కొడుకు అయిన ఆర్య వర్ణ ప్రేమలో పడతాడు. ఆ రాజ్యంలో అందరు బానిసలుగా బతుకుతుంటే వర్ణ మాత్రం అలా ఉండటానికి ఇష్టపడదు. ఆమెను దారిలోకి తెచ్చుకోవడానికి మహేంద్రుడు చాలా పాట్లు పడతాడు. ఇక భూలోకంలో హాయిగా సాగిపోతున్న రమ్య, మధుల ప్రేమ విషయంలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకొని మధు పరలోకానికి వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరుగుతుంది, ఆ లోకంలో మహేంద్రుడు , వర్ణ ఎలా ఒక్కటవుతారు అనేదే మిగతా కథ.

cinima-reviews
వర్ణ

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ కి తమిళంలో కాకుండా తెలుగులో కూడా మంచి పేరుంది. ఇఫ్పటి వరకు తెలుగులో 7/జి, బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్థాలే వేరు, యుగానికి ఒక్కడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన సెల్వ రాఘవన్ ప్రేమ కథా చిత్రాల జోనర్ నుండి ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు. ‘యుగానికి ఒక్కడు ’ చిత్రంతో ప్రేక్షకులకు హాలీవుడ్ చిత్రాల వాసన చూపించిన సెల్వరాఘవన్ మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు ‘వర్ణ ’ చిత్రం ద్వారా  ‘ఫాంటసీ ’ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ‘వర్ణ ’ రంజితం చేసిందో లేదో చూద్దాం.

ఎలాగు ప్రేమ కథా చిత్రాలు తీశాను కదా అని, కొత్త రకమైన ప్రేమ కథను ప్రేక్షకులను చూపించాలనే అత్యుత్సాహంలో దర్శకుడు తాను ఏం చెప్పదలచుకున్నాడో చెప్పకుండా దారి తప్పాడు. ఎప్పుడు ఒకే లోకంలో ప్రేమలా ? రొటీన్ కదా అదే రెండు లోకాల్లో ఒకేరకమైన ప్రేమ కథ నడిపించి మధ్యలో ఓ ప్రేమ కథకు ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుందని డిఫరెంటుగా ఆలోచించి ఈ సినిమా చేసి వర్ణించడానికి వీలులేకుండా ప్రేక్షకుల్ని హింసించి వదిలేశాడు సెల్వరాఘవన్. ప్రతి సీన్ కి ప్రేక్షకుడు హింసకు గురవుతూనే ఉంటాడు.

అయినా ఎందుకు కూర్చుంటారంటే ఈ సీన్ తరువాత అయినా మంచి సీన్ రాకపోదా అనే ఆలోచనతో చివరకు ఉంటారు. దర్శకుడు అనే వాడు ప్రతి సీన్ ని రక్తి కట్టించే విధంగా చేసి కుర్చీలకు అతుక్కుపోయేలా చేయాలి కానీ సెల్వరాఘవన్ మాత్రం నేను ఇలాంటి సినిమా చేసినా మీరింకా కుర్చీల్లోనే ఉన్నారంటే మీ టేస్ట్ ఏమిటో నాకు అర్థమైంది అనే వెటకారంగా అన్నట్లు మనది మనకే అనిపిస్తుంది. ప్రేమ గొప్పతనం అంతా, ప్రేమ గొప్పతనం ఇంతా అంటూ ఎప్పటికప్పుడు లెక్చర్లు దంచుతూ ప్రేక్షకుడి సహనానికి మరింత పరీక్ష పెట్టి ప్రేమ అంటే ఇంత వర్ణనాతీతంగా ఉంటుందా ? అనే ఫీలింగ్ కలిగించాడు. తెరపై ఏం జరిగిందో అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది. చూసింది నిజమా కాదా అని తేల్చుకునే లోపే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుంది.

ఒక సినిమా చూస్తూ బాలేదు అనుకోవడం మామూలే కానీ అసలేం తీశాడు, ఎందుకు తీశాడు, ఇంకా ఎందుకు చూస్తున్నాం అని మనల్ని మనమే పదే పదే ప్రశ్నించుకునేలా చేసేలా సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన ‘వర్ణ ’నాతీమైన చిత్రాల్లో ఇదొకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. సో ఇలాంటి చిత్రాలకు వెళ్లి ఆ హింసను భరించే కంటే ఇంట్లో కామెడీ ప్రోగ్రామ్ చూసి కాసేపు నవ్వుకుంటే ఆరోగ్యానికి నాలుగు విధాల మంచిది.

Cinema Review

గతంలో పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అనుష్క ఈ సినిమాలో కూడా లీడ్ రోల్ పోషించింది. ఓ పాత్రలో వీరనారిగా, మరో పాత్రలో సాదాసీదా అమ్మాయిగా నటించింది. పరలోకంలో వీరనారి పాత్రలో అనుష్క ఎప్పుడు చిరాగ్గా కనిపించింది. మరో పాత్రలో ఏం చేస్తున్నానో అనే సందిగ్దంలో నటించింది. కత్తి పట్టుకొని చేసిన సన్నివేశంలో ఆమెకు కత్తి పట్టుకోవడం ఇదే మొదటిసారా అన్నట్లుగా చేసింది. ఆ విద్య పై ఈమెకు ఎలాంటి మెలకువలు నేర్పలేదేమో అనిపిస్తుంది. ఇక ఇందులో అనుష్క సరసన నటించిన ఆర్య దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ పోయి అయ్యాడు. దర్శకుడు చేస్తున్న ఈ సినిమా ప్రయోగంలో ఆర్య ఓ పావుగా మాత్రమే ఉపయోగపడ్డాడు. ఇక పరలోకంలో దేవత పాత్రను పోషించిన ఆవిడ థియేటర్లోనే ప్రేక్షకులకు దేవుడు కనిపించేలా చేసింది. ఆర్య తండ్రి చేసిన అతను కూడా సొసోగానే చేసి ముగించారు.

సాంకేతిక వర్గం  :

అంత్యంత భారీ హంగులతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో చెప్పుకోవడానికి బాగానే హంగులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటో గ్రఫి. కెమెరామెన్ రామ్ జీ హాలీవుడ్ స్టాయిలో చిత్రీకరించాడు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. దర్శకుడు చేసే కఫ్యూజన్ కి హరీష్ కి కూడా మైండ్ దొబ్బి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మరొకర్ని పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. దర్శకుడికి అసలు వేరే లోకంలో ప్రేమ కథ కూడా నడిపించాలని, మరో లోకాన్ని సృష్టించి, అక్కడ వింత జంతువుల్ని పెట్టాలని చూపి ప్రేక్షకుల్ని హింసించాడు. ఇక తెలుగులో గత చిత్రాల రికార్డును చూపి, ఈ మధ్యనే సినిమా నిర్మాణంలోకి వచ్చిన పివిపి సినిమా వాళ్ళు ఈయన సినిమాకు ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడం చూస్తేంటే ఓ వైపు జాలి, మరో వైపు తాను చేస్తున్న వేల కోట్ల వ్యాపారానికి దీనికి లింకు పెట్టి ట్యాక్స్ ఎగ్గొట్టాలని చూశాడేమో అనిపిస్తుంది.

చివరగా :

రెండు గంటలు పడిన బాధ ‘వర్ణానాతీతం ’

 

more