Teluguwishesh క్రిష్ - 3 క్రిష్ - 3 Krrish 3 Telugu Movie Review and Rating, Telugu Movie Krrish 3 Review, Krrish 3 Telugu Movie Review, Telugu Krrish3 Movie Review, Krrish 3 in Telugu, Hrithik Roshan Krrish 3 Telugu Movie Review, Krrish 3 Telugu Movie Release Date and More on Teluguwishesh.com Product #: 48195 1.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    క్రిష్ - 3

  • బ్యానర్  :

    ఫిలిం క్రాఫ్ట్ ప్రొడక్షన్ లిమిటెడ్

  • దర్శకుడు  :

    రాకేష్ రోషన్

  • నిర్మాత  :

    రాకేష్ రోషన్

  • సంగీతం  :

    రాజేష్ రోషన్

  • సినిమా రేటింగ్  :

    1.5/5  1.5/5

  • ఛాయాగ్రహణం  :

    ఎస్. తిరు

  • ఎడిటర్  :

    చందన్ అరోరా

  • నటినటులు  :

    హ్రుతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, వివేక్ ఒబేరాయ్

Krrish 3 Telugu Movie Review And Rating

విడుదల తేది :

నవంబర్ 1 2013

Cinema Story

రోహిత్ మెహ్రా (హృతిక్‌ రోషన్‌) సైంటిస్ట్ గా దేశానికి సేవలు అందిస్తున్నాడు. నిర్జీవంగా ఉన్నవాటికి ప్రాణం పోయడం పరిశోధనలు చేస్తుంటాడు. సమాజంలోని ప్రజలకు ఆపద వస్తే రోహిత్ కుమారుడు క్రిష్ అలియాస్ కృష్ణ (హృతిక్‌) ఎవరికి ఆపదవచ్చినా క్రిష్ రూపంలో ఆదుకుంటాడు. డీఎన్‌ఏ ద్వారా జన్మించిన కాల్ (వివేక్‌ ఒబెరాయ్‌) ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి, అంతా తన గుప్పింట్లోకి తెచ్చుకోవాలని అనుకొని ఓ భయంకరమైన వైరస్ ని కనిపెట్టి భారత దేశం పై వదిలిపెడతాడు. సైంటిస్ట్ అయిన రోహిత్ ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపేస్తాడు. దీంతో ‘కాల్ ’ రోహిత్ పై పగ తీర్చుకోవడానికి సైన్యంగా బయలు దేరితే దాన్ని క్రిష్ విచ్చిన్నం చేస్తాడు. కాల్ గర్భిణిగా ఉన్న క్రిష్ భార్యను ఎత్తుకెళతాడు. కాల్ భారినుండి క్రిష్ తన భార్యను ఎలా రక్షించుకుంటాడు. క్రిష్ కి కాల్ కి మధ్య జరిగిన భీభత్సమైన యుద్దమే క్రిష్-3 మిగతా కథ.

cinima-reviews
క్రిష్ - 3

బాలీవుడ్ లో మంచి సినిమా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన క్రిష్ సినిమా మంచి హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్ గా సినిమాలు చేస్తూ పోతున్నాడు. రెండవ భాగానికి సీక్వెల్ గా హాలీవుడ్ హంగులను  జోడించి గ్రాఫిక్స్ ప్రధానంగా తీసిన చిత్రం హాలీవుడ్ సినిమాల అంత ప్రేక్షకుల్ని అలరించలేక పోయినా, కథ, కథనం అన్నా స్ట్రాంగ్ ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో లేదో ఈ సినమా రివ్యూ ద్వారా చూద్దాం

Cinema Review

క్రిష్ చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న హ్రుతిక్ రోషన్ సూపర్ హీరో పాత్రకు ప్రతి సినిమాలో న్యాయం చేస్తున్నాడు. తన పాత్రకు తగ్గ శరీర ధారుఢ్యంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో  రోహిత్ మెహ్రా, క్రిష్, కృష్ణ రెండు విభిన్న షేడ్స్ ఉన్న రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అంతా బాగానే ఉన్నా, ముసలి వేషంలో హ్రుతిక్ చేసిన పాత్ర ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. కథలో పస లేకపోవడంతో రోహిత్, కృష్ణ పాత్రల ద్వారా నటనను ప్రదర్శించేందుకు అంతగా స్కోప్ లేకపోయింది. క్రిష్ పాత్ర ద్వారా కొంత హీరోయిజం చూపించడానికి కొంత అవకాశం కలిగింది.

ఇక ఈయన సరసన నటించిన ప్రియాంక చోప్రా కేవలం చెప్పుకోవడానికి ఉన్నది తప్పితే ఈమెకు దక్కింది ఏమీ లేదు. ఈమె తన నటనను చూపించుకునే స్కోప్ లేకుండా పోయింది. కాల్ సృష్టించిన నలుగురు దుష్ట శక్తుల్లో ఒకరైన కాయా(కంగనా రనౌత్) విలన్ షేడ్స్ ఉన్న పాత్ర కొంత మెరుగ్గా ఉందన్న ఫీలింగ్ కలిగినప్పటికి.. క్రిష్3 కి ఎలాంటి అదనపు ఆకర్షణ కాలేకపోయింది. ప్రియాంక కంటే కంగనా రనౌత్ అందాల ఆరబోతలో కాస్తా పైచేయి సాధించింది. విలన్‌ పాత్రలో వివేక్‌ ఒబెరాయ్‌ క్రూరత్వం చూపించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఆ పాత్రని సరిగా తీర్చి దిద్దకపోవడం వల్ల చివర్లో మరీ జోకర్‌లా కనిపిస్తాడు. మిగతా వారి పాత్రల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు

సాంకేతిక విభాగం :

యాక్షన్ నే ప్రధాన ఆయుధంగా తీసుకొని విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉపయోగించి తీసిన ఈ చిత్రంలో అవే దారుణంగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయనుకున్న సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. కనీసం గతంలో వచ్చిన బాలీవుడ్ యాక్షన్ చిత్రాల రేంజ్ లో కూడా అనిపించవు. నిమాకి కీలకమైన క్రిష్‌ - కాల్‌ యుద్ధ సన్నివేశమైనా ఆకట్టుకునే గ్రాఫిక్స్‌తో ఉంటుందని అనుకుంటే అదీ తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇలాంటి సినిమాలకు బలం విజువల్ ఎఫెక్ట్స్ అలాంటి విభాగమే ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది. అదే జరిగింది ఇక్కడ. రాజేష్‌ రోషన్‌ స్వరపరిచిన పాటలైతే కనీసం రెండు కోట్ల ఖర్చుతో తీసే సినిమాల్లో కూడా అప్రూవ్‌ కావు. ఈ పాటల బదులు క్రిష్‌ మొదటి రెండు భాగాల్లోని పాటలే మళ్లీ చూపించినా అంతో ఇంతో ఫలితం ఉండేది. సలీమ్‌ సులైమాన్‌కి నేపధ్య సంగీతం కాస్తంత హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ప్రొడక్షన్‌ డిజైన్‌ బాగుంది. భారీ బడ్జెట్ తో సినిమా తీసి కోట్లు దండుకోవాలని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టారని స్పష్టంగా కనిపిస్తుంది.

ఖర్చుకు తగిన పనిని తెర పై చూపించలేక పోయారు. సీక్వెల్ సినిమాలు తీస్తే ఒక దాన్ని మించి మరొకటి ఉండాలి. కానీ మొదటి రెండు వెర్షన్ల కన్నా ఈ సినిమా నిరాశ పరుస్తుంది.  క్రిష్ 3 చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగినట్టు లేకపోవడానికి దర్శకుడు రాకేశ్ రోషన్ తప్పటడుగులే ప్రధాన కారణం. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటం ఆద్యంతం ప్రేక్షకుడిని విసిగించింది. చిత్ర కథ ఫ్లాట్ గా ఉండటంతో ఎక్కడ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ స్థాయిలో క్రిష్ ను తీర్చి దిద్దాలనుకున్న రాకేశ్ రోషన్ విఫలమయ్యాడనే చెప్పవచ్చు.