Teluguwishesh భాయ్ భాయ్ Bhai Telugu Movie Review and Rating, Nagarjuna Bhai Movie Review, Telugu Bhai Movie Review, Bhai Review, Bhai Rating, Bhai 2013 Telugu Movie, Directed by Veerabhadram , Cast and Crew Nagarjuna Akkineni, Richa Gangopadhyay and more on Teluguwishesh.com Product #: 48043 1.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    భాయ్

  • బ్యానర్  :

    అన్నపూర్ణ స్టూడియోస్

  • దర్శకుడు  :

    వీరభద్రమ్ చౌదరి

  • నిర్మాత  :

    అక్కినేని నాగార్జున

  • సంగీతం  :

    దేవీ శ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    1.5/5  1.5/5

  • ఛాయాగ్రహణం  :

    సమీర్ రెడ్డి

  • నటినటులు  :

    నాగార్జున, రీచా గంగోపాధ్యాయ

Bhai Telugu Movie Review And Rating

విడుదల తేది :

2014-10-25

Cinema Story

చిన్నప్పుడే ఇంట్లో నుండి పారిపోయి పెద్దయిన తరువాత భాయ్ (నాగార్జున) గా మాఫియా ముఠాలో పనిచేస్తుంటాడు. తన బాస్ అయిన (ఆశిష్ విద్యార్థి) కి రైట్ హ్యాండ్ గా ఉంటూ తాను చెప్పిన పనిని చూసుకుంటూ తన మాఫియా సామ్రాజ్యానికి అడ్డు వచ్చిన వారిని అంతం చేస్తుంటాడు. ఈ మాఫియా ఆగడాల్ని అరికట్టడానికి అండర్ కవర్ ఆపరేషన్ లోకి పవన్ పోలీస్ ఆఫీసర్ (ప్రసన్నకుమార్ )ని పంపిస్తారు. అతన్ని ఎదుర్కోవడానికి వచ్చిన భాయ్ కి ఆ ఆఫీసర్ తమ్మడని తెలిసి, మాఫియా నుండి తన ఫ్యామిలీని, తమ్ముడిని కాపాడుకుంటూ తిరిగి భాయ్ తన కుటుంబానికి ఎలా దగ్గరయ్యాడనే మిగతా కథ.

cinima-reviews
భాయ్

తన జనరేషన్ అయిపోయినా, తన మార్కెట్ స్థాయిని మించి నిర్మాతలతో బడ్జెట్ ఖర్చు చేయించి, యువ హీరోలకు పోటీగా సినిమాల మీద సినిమాలు తీస్తు వెళుతున్న నాగార్జున భక్తి, రక్తి సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. కానీ చాలా కాలం తరువాత మాస్ అండ్ కమర్షియల్ హంగులతో తన సొంత బ్యానర్ అయిన ‘అన్నపూర్ణ స్టూడియో ’, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో ‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వీరభద్రమ్‌ దర్శకత్వంలో ‘భాయ్ ’ సినిమా నిర్మించాడు. గతంలో ఈయనకు క్రేజ్ తెచ్చిన మాస్ కథనే ఎన్నుకొని, వీరభద్రమ్ ని నమ్ముకొన్న నాగార్జున తన అభిమానులకు ఆశించిన విజయాన్ని ఇచ్చాడా లేదా అనేది ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

నిన్నటి వరకు చిన్న హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకొని ఒకేసారి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్న వీరభద్రమ్ కథ, కథనం విషయంలో ఎంతో జాగ్రత్తపడాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. మొదటి భాగంలో ఓ 20 నిమిషాలు సినిమా పై ఇంట్రెస్ట్ కలిగించి, తరువాత ట్రాక్ మార్చేసి కథను పక్కదారి పట్టించాడు. అవసరానికి మించిన పంచ్‌ డైలాగులతో, తెరపై ఉన్న క్యారెక్టర్లన్నీ మాటల తూటాలు పేలుస్తూ కాన్సన్‌ట్రేషన్‌ని దెబ్బ తీసేవిధంగా చేశాడు.

నాగార్జునను ఏం మాయ చేసి ఒప్పించాడో , లేక నాగార్జననే సినిమాలు చేయాలనే ఆత్రుతతో ఈ సినిమా ఒప్పుకున్నాడో కానీ ఎంతో పబ్లిసిటీ కల్పించుకున్న ‘భాయ్ ’ ప్రేక్షకులను అలరించలేకపోతుందనేది నిజం. భాయ్‌ ని అన్ని మసాలాలున్న కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. కామిడీని మరచిన దర్శకుడు సెకండాఫ్ లో సెంటిమెంటిని దట్టించాడు. కానీ అవేవి వర్కవుట్ కాలేదు. హీరో పరిచయం లోపే పదుల కొద్దీ పంచ్‌ డైలాగులు పేల్చేసారంటే ఎంత అతిగా మాట్లాడించారో అర్థం చేసుకోవచ్చు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌లో కూడా కామెడీని పండించి హిట్టు కొట్టవచ్చు.  ఒక్క సీన్ అయినా బాగుంటుందేమో అని వెయిట్ చేసిన ప్రేక్షకుడు నిరాశతో ధియేటర్ నుండి వెళ్ళటం ఖాయం. అన్ని విభాగాల్లో విఫలం అయిన ‘భాయ్ ’ బాక్సాఫీసు వద్ద వసూళ్లు  భారంగానే ఉంటాయి.

Cinema Review

ఇప్పటి వరకు నాగార్జున చేసిన సినిమాల్లో ఇలాంటి పాత్రలు అనేకం చేశాడు. కానీ ఈ ట్రెండ్ కి తగ్గట్లు యంగ్ లుక్ తో  కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పటిలా మన్మథుడి లుక్ తో కనిపించిన ఆయన క్యారెక్టర్ కి తెలంగాణ యాసను జోడించి కొత్తగా చూపించారు. లుక్ లో ఏజ్ ని కవర్ చేసుకున్న నాగార్జున డాన్సుల్లో దాన్ని కవర్ చేసుకోలేక పోయాడు. ఇక ఆయన సరసన నటించిన రీచా గంగోపాధ్యాయను కేవలం నాగార్జునతో రొమాన్స్ చేయడానికే పెట్టారనిపిస్తుంది. ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర లభించలేదు.

నటి స్నేహ భర్త అయిన  ప్రసన్నకి ఈ చిత్రంలో నాగార్జున తమ్ముడిగా ఓ మోస్తారు క్యారెక్టర్‌ ఇచ్చారు. విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి నటన, సోనూ సూద్‌ నటన తమ టాలెంట్‌కి తగ్గ చేయలేక పోయారు. బ్రహ్మానందం క్యారెక్టర్‌ ఎక్కువ సేపు లేదు. ఉన్నంతలో కాస్తో కూస్తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఎమ్మెస్‌ నారాయణ కూడా అక్కడక్కడా పంచ్‌లు పేల్చాడు.  ఇటీవల ఐటెం పాటల్లో నటిస్తున్న ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న హంసా నందిని ఈ సినిమాలో ముందు బెంచ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

సాంకేతిక విభాగం

ఈ విభాగంలో అన్ని శాఖలు పనిచేసినా చెప్పుకోవాల్సిన రెండింటి గురించి మాత్రమే. ఒకటి సినిమాటో గ్రఫీ, రెండోది నిర్మాణ విలువలు. సమీర్ ప్రతి ఫ్రేమ్ ని బాగా చిత్రీకరించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లో తెరకెక్కిన ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడలేదు. ఈ సినిమాకు మైనస్ ఎడిటింగ్. సీన్ జరుగుతుంటే మధ్యలో కట్ అయిపోయి వేరే సీన్ కి వెళ్లి పోతుంటుంది. సీన్ సీన్ కి సంబంధం లేకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక సంభాషణల విషయానికి వస్తే అన్ని ప్రాస కుదిరేలా రాసుకున్నారా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బాగానే ఉన్నా మిగతా సమయాల్లో పేలలేదు.

ఇక దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సలు బాగోలేదు. బహుశా బిజీగా ఉండటంతో అసిస్టెంట్స్ తో కొట్టించాడేమో అనిపిస్తుంది. గత రెండు చిత్రాలతో కామెడీని నమ్ముకున్న దర్శకుడు ఈ చిత్రంలో యాక్షన్ ని నమ్ముకొని కామెడీని విడిచిపెట్టాడు. కేవలం నాగార్జునను  హైలెట్ చేయడానికి రాసుకున్న కథలో ప్రేక్షకుల్ని మరిచిపోయాడు. మొత్తంగా చూస్తే నాగార్జునని మెప్పించాడు కానీ ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయాడు.

 

 

more