Teluguwishesh అలియాస్ జానకి అలియాస్ జానకి Alias Janaki Telugu Movie Review, Alias Janaki Movie Review, Alias Janaki Review, Alias Janaki Movie Rating, Alias Janaki Review, Alias Janaki Movie Trailers, Videos, Alias Janaki Wallpapers, Alias Janaki Movie Working Stills, Alias Janaki Movie Gallery, Alias Janaki Movie Teasers, Star casting, Director, Alias Janaki Story, Alias Janaki Movie Photos, Alias Janaki Movie Wallpapers, Alias Janaki Movie Release Date, Alias Janaki Auido Release and more. Product #: 46303 2/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అలియాస్ జానకి

  • బ్యానర్  :

    సంఘమిత్ర ఆర్ట్స్

  • దర్శకుడు  :

    దయా.కె.

  • నిర్మాత  :

    విక్రమ్.ఎస్

  • సంగీతం  :

    శ్రావణ్

  • సినిమా రేటింగ్  :

    2/52/5  2/5

  • ఛాయాగ్రహణం  :

    సుజిత్ సారంగ్

  • ఎడిటర్  :

    శ్రీజిత్ సారంగ్

  • నటినటులు  :

    వెంకట్ రాహుల్, అనీషా అంబ్రోస్, శ్రీ రమ్య, నాగబాబు

Alias Janaki Telugu Movie Review

విడుదల తేది :

26 జూన్ 2013

Cinema Story

జానకి రామ్ (రాహుల్ వెంకట్ ) చిన్నప్పటి నుండి తన తండ్రి నేర్పిన నిజాయితీ, నీతిని నమ్ముకొని పెరుగుతాడు. పెద్దయిన తరువాత హైదరాబాద్ గవర్నమెంట్ మున్సిపాలిటీలో ఆఫీసర్ ఉద్యోగం సంపాదిస్తాడు. నిజ జీవితంలో ఎలా ఉంటాడో, ఉద్యోగంలో కూడా అలానే ఉంటాడు. సిటీలో పెద్ద రౌడీ షీటర్ అయిన మైసా (శత్రు) పేదల గుడిసెలను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తాడు. న్యాయబద్ధంగా ఆ స్థలం పేద ప్రజలకి చెందాలని జానకి పోరాటం మొదలు పెడతాడు, అందులో ఎదురైన ఇబ్బందులను నిజాయితీగా ఎలా అధిగమిస్తాడు. ఓ కేసు విషయంలో పరిచయం అయిన చైత్ర(అనీష అంబ్రోస్) తో ప్రేమలో పడి ఆమె ప్రేమను గెలుస్తాడా ? అనేది తెర పై చూడాల్సిందే.

cinima-reviews
అలియాస్ జానకి

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక ఆ ఫ్యామిలీతో ఎక్కడో బీరకాయ పీచు చుట్టం ఉన్న వారు కూడా అదే ఫ్యామిలీ పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి మేనమామ కొడుకు వెంకట్ రాహుల్ కూడా సినిమాల మీద ఉన్న మోజుతో తనతో సినిమాలు తీసేందుకు ఎవరూ మందుకు రాకపోవడంతో తనే కథను రాసుకొని లేటు వయస్సులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మరి అందరి మెగా హీరోల లాగా ఇండస్ట్రీని ఏలేద్దామని వచ్చిన వెంకట్ రాహుల్ ఏ మేరకు సక్సెస్ అయ్యాడు. ఫ్యూచర్ లో హీరోగా వెలిగిపోయే లక్షనాలు ఏమైనా ఉన్నాయో ఓ సారి ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు దౌర్జన్యాలు పెరిగిపోతున్న ఈ సమాజంలో వారికి మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను తెరకెక్కించడం వరకు బాగానే ఉంది. ఈ ఆలోచన అందరికి మెచ్చే విధంగా, నచ్చే విధంగా ఉండాలి. కానీ వీరి ఆలోచనను సమాజం ఆచరణలో పెట్టే విధంగా ఈ సినిమా తీయలేదు. నీతి, నిజాయితీలు కనుమరుగువుతున్న ఈ సమాజంలో ఒక వ్యక్తి వాటిని పాటిస్తూ సమాజంలో మార్పును తీసుకురావానుకోవడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం. కానీ రెండు గంటల పాటు క్లాసు పీకి చల్లగా థియేటర్ నుండి బయటకి పంపించేస్తారు. కాదు కాదు... ఆ రెండు గంటలు ఎప్పుడు అయిపోతాయా అని ఎదు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో చేద్దామని, చేసేద్దామని అనుకున్నాడు దర్శకుడు. కానీ ‘పస ’ లేని సరుకు కావడంతో ఏమీ చేయలేక పోయాడు. సమాజం గురించి ఆలోచించే హీరో చెప్పే రెండు డైలాగుల క్లాస్ తోనే అక్కడ సీన్లు మారిపోతాయి. ఇంత సులువుగా సమాజాన్ని మార్చేయవచ్చా అని ఆ సీన్లు చూసిన తరువాత సిల్లీగా నవ్వుకోవచ్చు.  సమాజానికి మెసేజ్ ఇచ్చే ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో వచ్చాయి. కానీ ఈ ఆలియాస్ జానకి చూస్తే ఇలాంటి సిమాలు తీద్దామనుకునే వారికి కూడా తీయాలనిపించదు. ఏ మాత్రం చెప్పుకోవడానికి కూడా లేని ఈ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోల్లాగా వెలిగిపోతాడా ? కాలమే నిర్ణయించాలి. 

 

Cinema Review

హీరో రాహుల్ వెంకట్ కి ఇది తొలి చిత్రం. కాస్త లేటు వయస్సులో ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఇతను రాసుకున్న కథ.   ఇక ఎలా నటించిన చూస్తాడనుకున్నాడో లేక తనలో ఉన్న నటనను చూపిస్తే జనాలు దడుసుకుంటాడని అనుకున్నాడో లేక హీరో అంటే ఇంతకంటే బాగా ఎవడు నటించలేడని ఫిక్సయిపోయాడో కానీ ఇతని ఏజ్ కి తగ్గట్లు నటన లేని కథను రాసుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆసాంతం ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటెయిన్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో, రొమాంటిక్ ట్రాక్ వచ్చినప్పుడు ఆ సీరియస్ అదే లుక్ ని మెయింటేన్ చేశాడు. సినిమాలో నటించే కథానాయకుడి నటనే బాగోలేనప్పుడు సినిమా ఇంకేం చూస్తాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ అదే జరింది. ఇక హీరోయిన్ విషయానికొస్తే చాలా చిత్రాలలో లానే కథతో సంబంధంలేని పాత్ర కి అందంగా ఉండే అమ్మాయిలను హీరోయిన్ గా పెడతారు. ఇక్కడ అలానే చేసిన ఆమె క్యారెక్టర్ మాత్రం ప్రేక్షకులకు ఇరిటేషన్ వచ్చే విధంగా చేశారు. నటనలో ఇద్దరు పోటీ పడి చిత్రాన్ని చెడగొట్టారు.  వీరిదే ఇలాగ ఉంటే ఇందులో నటించిన సీనియర్ నటులు మామూలుగానే చేసినా, చెప్పుకునే క్యారెక్టర్లు మాత్రం దక్కలేదు. సో వారి గురించి అవసరం లేదు కూడా.

సాంకేతిక వర్గం పనితీరు

సినిమా కథ బాగో లేకపోయినా, ఇందులో కొన్ని పాటలు మాత్రం శ్రవణానందాన్ని కలిగించేలా మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అందించిన స్వరాలే. సన్నివేశాలలో బలం లేకపోయినా ఈ సంగీత దర్శకుడు తన నేపధ్య సంగీతంతో కాస్తయిన బలం చేకూరేలా చూసుకున్నాడు . ఈ సినిమాలో కథనం మాటలు దర్శకత్వంకి తోడుగా ఫైట్స్ మరియు సాంగ్స్ కోరియోగ్రఫీ కూడా చేసిన దర్శకుడు ఆ శాఖల గురించి చెప్పుకునే పని లేకుండా చేశాడు. వేరే వారు చేసిఉంటే రెండు లైన్ల మేటర్ ఎక్కువగా వచ్చేది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా అయినా క్వాలీటీ పరంగా బాగా అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే... ఎడిటర్ ఈ సినిమాను రెండు గంటలు కూడా లేకుండా కత్తిరించాడు. దర్శకుడు కథను, ఎమోషన్స్ ని పండించాల్సింది. కానీ అవేమి ఇందులో కనిపించలేదు.