Teluguwishesh సాహసం సాహసం Sahasam Telugu Movie Review, Sahasam Movie Review, Gopichand Sahasam Movie Rating, Sahasam movie trailers, Videos, Sahasam Wallpapers, Sahasam review, Sahasam telugu review, Sahasam story, Sahasam talk, Sahasam ratings, Sahasam cinema reviews, Movie Working Stills, Star casting, Director, Story, Photos and more Product #: 45991 3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సాహసం

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి.

  • దర్శకుడు  :

    చంద్రశేఖర్‌ యేలేటి

  • నిర్మాత  :

    బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌

  • సంగీతం  :

    శ్రీ

  • సినిమా రేటింగ్  :

    3/53/53/5  3/5

  • ఛాయాగ్రహణం  :

    శ్యామ్‌దత్ ఎస్

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు

  • నటినటులు  :

    గోపీచంద్‌, తాప్సి, శక్తికపూర్‌, అలీ తదితరులు

Sahasam Telugu Movie Review

విడుదల తేది :

12 జూలై 2013

Cinema Story

ఓ సంస్థలో సెక్యురిటీ గార్డ్‌ గా పనిచేసే గౌతమ్‌ వర్మ (గోపీచంద్‌) తన జీతానికి తగినట్లు కాకుండా, రాత్రికి రాత్నే రాత్రే కోటీశ్వరుడు కావాలి, ఖరీదైన జీవితం గడపాలని కలలు కంటుంటాడు. సెక్యూరిటీ గార్డు జాబ్ కి వచ్చిన జీతంతో లాటరీలు కొనడం హాబీ. అనుకోకుండా ఓసారి తన పూర్వీకుల గురించి తెలుస్తుంది. వాళ్లకు సంబంధించిన ఆస్తులు ఓ చోట నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఆ చోటుకి చేరుకోవడం తేలికైన విషయం కాదు. అందుకోసం గౌతమ్‌ ఎన్ని సాహసాలు చేశాడనేదే ఈ చిత్ర కథ. మరోవైపు శ్రీనిధి (తాప్సి)కి దైవభక్తి ఎక్కువ. ఈ ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతూ, ఈలోగా జీవితాన్ని ఆనందంగా గడిపేయాలి అనుకొంటుంది. విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరూ ఎలా ప్రయాణం ఎన్ని సాహసాలు చేస్తే సుఖాంతం అవుతుందనేదే కథ.

cinima-reviews
సాహసం

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి పలువురు దర్శకులు హాలీవుడ్ రుచి చూపిస్తున్నారు. ఇఫ్పటికే కొన్ని సినిమాలకు హాలీవుడ్ సినిమాల ప్లేవర్ తగిలించారు. ఇప్పుడు గతంలో కన్నా కాస్తంత ఎక్కువ ప్లేవర్ దట్టించి, ఓ విభిన్నకథనంతో గోపిచంద్ తో హాలీవుడ్ అడ్వెంచర్ టైపులో సినిమా ‘సాహసం ’ చేశాడు. ఇప్పటికే ఈయన తెరకెక్కించిన కొన్ని ప్రయాణం, ఒక్కడున్నాడు వంటి సినిమాల్లో ఆ ఫ్లేవర్ కాస్తంత మనకు కనిపిస్తుంది కూడా. ఇక గత కొన్ని రోజుల నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీతో కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు తీసే చంద్రశేఖర్ కమర్షియల్ సినిమా తీశాడు. యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న గోపీచంద్ తో చేసిన ఈ కమర్షియల్ సినిమా ప్రేక్షకులు చూసేంత ‘సహనం ’ ’సాహసం ’ ఈ సినిమాలో ఉన్నాయో లేవో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ అండ్ అడ్వెంచర్ గా వచ్చే సినిమా చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అంశాలను జోడించి తీసిందే ‘సాహసం ’ సినిమా. పూర్తి భిన్నమైన నేపథ్యంలో సాగే ఈ చిత్రం హాలీవుడ్ ఎండ్వెంచర్ సినిమాలు చూసే వారినే ఆకట్టుకుంటుంది. ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల మందుకు వచ్చిన చంద్రశేఖర్ ఏలేటి కమర్షియల్ హంగులను జోడించే క్రమంలో తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ, రొమాన్స్ ని మిస్ చేశాడు. కానీ హై స్టాండర్డ్స్ తో మాత్రం చాలా బాగా తెరకెక్కించాడు. అయితే తన శైలిని  మాత్రం మర్చిపోలేదు. కమర్షియల్ అంశాలకంటే వాస్తవికతకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చాడు.  దర్శకుడు మలిభాగం సాహసాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టడంతో ప్రేక్షకులకు కోరుకునే కీలకమైన వినోదాన్ని మిస్ అయ్యాడు. క్లాస్ దర్శకుడిగా ముద్ర వేసుకున్న ఏలేటి బి, సి సెంటర్ల ప్రేక్షకులను మరిచి ఈ సినిమా తీశాడు. ఫస్టాఫ్ లో గోపీ చంద్ ఎంట్రీని, ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్ ని బాగా తెరకెక్కించాడు. సినిమా కొన్ని సన్నివేశాలు లెన్తీ గా ఉంటడంతో మధ్య మధ్యలో పడుతూ , లేస్తూ ముందుకు సాగుతుంది. ఏలేటి గత చిత్రాలను చూసిన వారు అతని నుండి ఆశించే గొప్ప చిత్రం కాకపోయినా, ఢిఫరెంటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి వెళ్లేవారు అన్ని తెలుగు సినిమాల లాగే ఈ సినిమా ఉంటుందని వెళితే మాత్రం ఢిఫరెన్స్ చిత్రం చూసిన ఫీల్ తో బయటికి వస్తారు. తెలుగు ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరించే దాన్ని బట్టే కలెక్షన్లు, విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Cinema Review

ఈ సినిమాలో హీరో గోపీచంద్ చాలా చక్కగా చేశాడు. యాక్షన్ అండ్ మాస్ హీరోగా పేరు తెచ్చకున్న గోపీచంద్ తన పాత్రలో ఓదిగిపోయాడు. హావభావాలను కూడా చక్కగా పలికించాడు. గత సినిమాల పాత్రలలో కన్నా ఈ సినిమాలో గోపీ చంద్ పాత్ర భిన్నంగా ఉందని చెప్పవచ్చు. తెల్లపిల్ల తాప్సీ కి నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కగపోగా, యాక్షన్ చిత్రంలో రొమాన్స్ లేదు కాబట్టి  తెల్లపిల్ల అందాలు కూడా ఈ సినిమాలో అంతగా కనిపించవు. ఎప్పుడు భగవంతుడి నామ స్మరణలో ఉండే పాత్ర చేసిన తాప్సీ ఫర్వాలేనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్ర వేసిన శక్తి కపూర్ నటన చాలా బాగుంది. ఉగ్రవాది పాత్రలో శక్తి కపూర్ లీనమైనటించాడు. ఈ సినిమాలో కమేడియన్ పాత్ర పోషించిన ఆలీకి పెద్ద ప్రాధాన్యత లేదు. ఇక మిగతా నటుల గురించి కానీ, వారి పాత్రల గురించి కానీ చెప్పుకునేంతగా లేవు.

సాంకేతికతిక విభాగం :

‘సాహసం’ సినిమా యాక్షన్ అండ్వెంచెర్ ని తలపించే విధంగా ఉందంటే అది ఖచ్చితంగా టెక్నీషియన్ల ఘనతే. ముఖ్యంగా ఇందులో సినిమాటోగ్రఫీ చేసిన శ్యాందత్ పనితనాన్ని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు అనుకున్న దాని కంటే కాస్తంత ఎక్కువగా ప్రేక్షకుల కళ్లు చెమర్చే విధంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక్క శ్యాందత్ కాకుండా మిగతా సాంకేతిక విభాగ నిపుణుల పనితనం ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది.   కళా దర్శకుడు రామక్రిష్ణ వేసిన సెట్స్, దానికి తగ్గట్లుగా చేసిన విజువల్ ఎపెక్ట్ చాలా బాగున్నాయి. చాలా కాలం తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసిన శ్రీ పాటలు ప్రేక్షకులను అంత తొందరగా ఆకర్షించే విధంగా లేకున్నా, ఫర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ కి పాటల్లో మిస్సయిన ఫీల్ కవర్ చేయగలిగాడు. ఎప్పుడు భిన్నంగా సినిమాలను తెరకెక్కించ చంద్రశేఖర్ ఏలేటి కూడా కొత్త రకమైన స్టోరీని ఎన్నుకొని దానిని తెర పై తెలుగు ప్రేక్షకులకు అడ్వెచర్ మరియు థ్రిల్లర్ సినిమాగా తీయడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినా, కమర్షియల్ సినిమాగా మలచడంలో ఎక్కడో కొంచెం తగ్గినట్లు అనిస్తుంది. ఈ సినిమాను ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత బి.వి.ఎన్. ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. లడఖ్ ని పర్ఫెక్ట్ పాకిస్థాన్ లుక్ లో చాలా రియలిస్టిక్ గా చూపించారు అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. 

more