మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన టీవీ ఛానల్ త్వరలో మూతపడనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఛానల్ ఏ రాజకీయ నాయకుడికి చెందినది ? ఆ ఛానల్ పేరు ఏంటి ? పీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ గత కొంత కాలం క్రితం కొనుగోలు చేసిన జీ 24 గంటల న్యూస్ ఛానల్ నుండి బొత్స సత్యనారాయణ వర్గం వైదొలిగినట్లు ఆ ఛానల్ ఎటిటర్ అయిన శివ ప్రసాద్ అధికారిక ప్రకటన చేశారు.
దీంతో ఏ ఛానల్ మూత పడుతుందో అని ఉన్న సందేహాలకు తెర పడింది. బొత్స సత్తిబాబుకు చెందిన ఈ ఛానల్ ప్రముఖులు అయిన అక్కినేని నాగార్జున, డిజీపీల పై న్యూస్ ప్రసారం చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో బొత్స టీం వచ్చేనెల 1 నుండి అధికారికంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇన్నిరోజులు దీన్ని నమ్ముకొని పనిచేసిన సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని శివ ప్రసాద్ తన ఆవేదనను తెలిపారు. సిబ్బందిని కొత్త కొలువులు చూసుకోవాల్సిందిగా సూచించారు.
ప్రస్తుతం మీడియా ఛానల్ ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. టీఆర్ పీ రేటింగులను బట్టే ఆ ఛానల్ కి పాపులారిటీ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోవడానికి నానా అవస్థలు పడుతున్న టీవీ ఛానల్స్ ముందు ముందు ఎన్ని మూతపడతాయో చెప్పలేం అంటున్నారు. ఈ జీ 24 గంటల ఛానల్స్ కోసం త్వరలో డిల్లీకి చెందినా ఓ టీం హైదరబాద్ రానుంది. ఈ చానల్ భవితవ్యం తేల్చనుంది. మొత్తానికి బొత్స నిండా మునగముందే దీనిని నుండి తప్పుకున్నాడని కూడా అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more