ఇక తెలంగాణ పై ఆశలు వదులుకోవాలని .. కాంగ్రెస్ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పటం జరిగింది. తెలంగాణ విభజన అనివార్యమని, ఇక మనం సమైక్యాంద్ర కోసం పోరాటం చేయటం మంచికాదని చెప్పటం జరిగింది. అయితే కొంత మంది నేతలు ఇంక రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచుతామని, చివరి బంతి వరకు మనకు అవకాశం ఉందని సీమాంద్ర ప్రజలను మోసం చేస్తున్నారని దగ్గుబాటి పురందేశ్వరి మండిపడుతున్నారు. తెలంగాణపై అధిష్టానం వెనక్కు తగ్గే స్థితిలో లేదని కనుక ఇకనైనా సీమాంద్ర నేతలు అక్కడి ప్రజల హక్కులు, అవసరాల కోసం పోరాడితే మంచిదనిపిస్తున్నదని పురందేశ్వరి చెప్పడం సీమాంద్ర ప్రజలను అయోమయంలో పడ్డారు. ఇక తానుండగా విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం అది ఆయన అభిప్రాయమన్నారు. రాజీనామాలపై మిగిలిన ఎంపిల నిర్ణయం కూడా వారి వ్యక్తిగతమని, విభజన విషయంలో సిపిఎం, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు ముద్దాయిలే అన్నారు. సీమాంధ్ర ప్రజలలో నీటి సమస్యలు, విద్యావకాశాల విషయంలో భయాందోళనలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం పోరాడాలని పేర్కొన్నారు.
అయితే తాము సీమాంధ్ర హక్కుల కోసం పోరాడుతుంటే ద్రోహులుగా చిత్రీకరించడం సరికాదన్నారు. అంతేకాదు తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా, ఎంపీగా రాజీనామా చేయాలని అనుకోవడం లేదని, పార్లమెంటు సభ్యురాలిగా లేకపోతే కేంద్రంలో సీమాంధ్రుల గురించి ఎలా మాట్లాడగలుగుతామని, లోక్ సభలో ఓటింగ్ వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పురందేశ్వరి వాస్తవాలకు అనుగుణంగా నాయకులు ఉండాలని, మూఢత్వంగా ఇంకా సమైక్యంగా ఉంటుందన్న భ్రమ కల్పించడం తనకు ఇష్టం లేదని తెలంగాణ విభజనపై ఆశలు వదులుకోవాలనే మాటలను ఆమె బలంగా చెప్పటం జరిగింది. పురందేశ్వరి మాటలు సీమాంద్ర నాయకుల్లో భయందోళనలు రేపుతున్నాయి. ఇప్పటికే.. మీడియా ముందు మాటలు చెప్పుకొనే రాజకీయ పదవులు అనుభవిస్తున్న సీమాంద్ర నాయకులకు పురందేశ్వరి మాటలతో కొత్త భయం పట్టుకుంది. ఇక సీమాంద్ర ప్రజలు సమైక్యాంద్ర కోసం పోరాడటం, ఉద్యమం చేయటం మంచిది కాదని .. పురందేశ్వరి చెప్పటం జరిగిందని సమైక్యవాదులు గుసగుసలాడుకుంటున్నారు..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more