శ్రీహరన్న మరణానికి కారణం ..మానవ తప్పిదమే కారణమైందనే అనుమానాలు కలుగుతున్నాయి. తాను మట్టిమనిషినంటూ ఎప్పుడూ చెప్పుకొనే శ్రీహరి మట్టిలో కలిసిపోయారు. చీకటి కడుపును చీల్చుకుని మళ్లీ పుట్టడానికి చీకటిలోనే మాయమైపోయారు. మట్టి ముద్దలు సాక్షిగా అంతర్థానమైపోయారు మన శ్రీహరన్న. ఎప్పుడు ఎవరి ఆపదలోనైన వెన్నంటే ఉండే షేర్ ఖాన్.. శ్రీహరన్న ఆపదలో ఉన్నప్పుడు మాత్రం సరైన వారు లేరనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అయితే ఆయన సినిమా షూటింగ్ కోసం ముంబయ్ వెళ్లడమే పెద్ద శాపమైందా.. అనే అనుమానం కలుగుతుంది. శ్రీహరి అస్వస్థతకు గురయినప్పుడు వైద్యం అందడంలో లేట్ అవడం వల్లే మృతి చెందినాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
తుపాన్ ఆడియో ఫంక్షన్ వేదిక మీద కనిపించిన శ్రీహరన్న ఆకారం అందరికి గుర్తుంది. ఒక్కసారిగా శ్రీహరన్నలో కనిపించిన మార్పుకు అందురు షాక్ తిన్నారు. ఇటీవల కాలంలో.. చాలా మంది శరీర బరువులు తగ్గుతున్న విషయం తెలిసిందే. అందుర అదే విధంగా ఆలోచించారు. కానీ శ్రీహరన్న ఇలా సడన్ మాయమవుతాడని ఎవరు ఊహించలేదు. గత కొన్నేళ్లుగా ఆయన చాలా వీక్‌గా కనిపిస్తున్నారు. దీంతో శ్రీహరి ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే నిజానికి శ్రీహరి 'లివర్ సిరోసిస్' అనే వ్యాధితో బాధ పడుతున్నారని ఆయన సన్నిహితుడైన డాక్టర్ మాదాల రవి తెలిపారు. అన్నవాహిక నాళాలు ఉబ్బడం, అవి పగిలి వాటిలోంచి బ్లీడింగ్ కావడం లివర్ సిరోసిస్ వ్యాధి లక్షణాలు.
రెండు మూడేళ్ల క్రితం మొదటిసారి శ్రీహరిలో ఈ సింప్టమ్స్ కనిపించాయని ఆయన పేర్కొన్నారు. స్వయంగా డాక్టరైన..నటుడు మాదాల రవి శ్రీహరిని డయాగ్నైజ్ చేశారు. తనకన్నా సీనియరైన కిమ్స్ లోని డాక్టర్ నాగార్జునకు రెఫర్ చేశారు. చికిత్స సందర్భంగా శ్రీహరి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని ఆ డాక్టర్ హెచ్చరించారు. అయితే ఇది రెండు మూడుసార్లు శ్రీహరి ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉండగా కూడా జరిగింది.ఇక తాజాగా 'ప్రభుదేవా' దర్శకత్వంలో వస్తున్న 'రాంబో రాజ్ కుమార్'సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి తనకు ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నాయని చెప్పినట్లు శ్రీహరి సోదరుడు చెబుతున్నారు. దీంతో స్థానిక డాక్టర్‌ను పిలువగా, శ్రీహరికి పెయిన్ కిల్లర్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే లివర్ సిరోసిస్ ఉన్నపుడు తప్పుడు మెడిసిన్ ప్రాణాల మీదకు తెస్తుంది. శ్రీహరి విషయంలో ఇదే జరిగి ఉంటుందని రవి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే శ్రీహరిని లీలావతి ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ శ్రీహరి కేస్ హిస్టరీ తెలీనందువల్ల వివిధ రకాల పరీక్షలు చేయడంలో విలువైన కాలం వృథా అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలు శ్రీహరిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more