Telangana leaders fear in ap bifurcation

Telangana leaders fear in ap bifurcation, ys jagan, ys jagan samaikyandra shankarava in hyderabad, ysrcp, trs party, telangana congress leaders, tr leaders, kcr, harish rao, seemandhra leaders, congress party, ap bifurcation, telangana issue,

Telangana leaders fear in ap bifurcation

నమ్మకం లేదా? లేక భయమా?

Posted: 10/02/2013 04:31 PM IST
Telangana leaders fear in ap bifurcation

‘‘ నమ్మకం పోయిన తరువాత నా నూరేళ్ల జీవితం ఇక శూన్యమే’’ అని ఒక మహానుభావుడు చెప్పటం జరిగింది. నమ్మకం ఉన్నవాడు .. నాలుగు చోట్ల గౌరవించబడతాడు.. నాలుగురికి ఆదర్శంగా నిలుస్తాడు అనేది జగనమేరిగిన సత్యం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కోల్పోయిన కొంతమంది నాయకులు .. తమ నాలుకులకు పని చెప్పి, గుండె నొప్పితో బాధపడుతున్నారు. నమ్మకం లేకపోవటంతో.. తెలంగాణ నాయకులు, తెలంగాణ వాదులు సమైక్యాంద్ర ఉద్యమానికి భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వెయ్యి శాతం వస్తుందనే నమ్మకం తెలంగాణ నాయకుల్లో లేదనే భావన కనిపిస్తుంది? రాష్ట్ర విభజన జరగదు అనే అపనమ్మకంతో తెలంగాణ వాదులు భయపడుతున్నారా? ఢిల్లీ పెద్దలు తెలంగాణ నోట్ రెడీ అవుతుందని, త్వరలో బిల్లుపెడతామని రోజుకోక రకంగా మీడియా ముందు ప్రకటనలు చేస్తున్నారు.

 

కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విభజన ఆగిపోతుందేమో అనే అపనమ్మకంలో బతుకుతున్నారని కొన్ని మీడియా వర్గలు అంటున్నాయి. అసలే సమైక్యాంద్ర ఉద్యమ సెగ దెబ్బతో తెలంగాణ నాయకుల్లో రోజు రోజుకి భయం పెరుగుతుంది. 60 సంవత్సరాల నుండి చేసిన ఉద్యమకారులు సైతం, సీమాంద్ర లో 64 రోజుల నుండి జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమ సెగకు వణికిపోతున్నారు. తెలంగాణ వాదుల్లో రోజు రోజుకి సరికొత్త భయం పుడుతుంది. ‘‘ అసలే ములుగుతున్న నక్క పై తాటికాయపడినట్లు’’ రాష్ట్ర విభజన చేతిదాక వచ్చి ఎక్కడ వెనక్కి పోతుందనే భయంతో తెలంగాణ వాదులు బ్రతుకుతున్నారు. కొంతమంది సీమాంద్ర నాయకులు కూడా .. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇక సమైక్యాంద్ర కోసం ఉద్యమాలు చెయ్యటం అనేది ‘‘లేచిపోయిన పెళ్లికూతురు పెళ్లికి బ్యాండ్ వాయించినట్లుగా’’ ఉంటుందని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు గొంతుచించుకుంటున్నారు.

 

ఒక పక్క సీమాంద్ర నాయకులు, మరో పక్క ఢిల్లీ పెద్దలు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర విభజన జరిగిందని .. రోజుకోక రకంగా చెబుతున్నప్పటికి తెలంగాణ వాదుల్లో మాత్రం ఎక్కడో ఒక చిన్న భయం వారిని వేధిస్తుంది. ఈ భయంతోనే తెలంగాణ వాదులు నమ్మకం కోల్పోయి, సీమాంద్ర ప్రజలపై , సమైక్యాంద్ర ఉద్యమం పై ..కారాలు, మిరియాలు నూరుతున్నారు. టీఆర్ఎస్ నాయకులు అయితే ఏకంగా.. బూతు పుస్తకం తెరిచి, మీడియా సాక్షిగా బూతులు వినిపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే.. సమైక్యాంద్ర కోసం ‘‘అయిదడుగుల బుల్లెట్ (జగన్) రాకెట్ లా జైలు నుండి బయటకు దూసుకువచ్చింది ’’ బయటకు వచ్చిన జగన్ సమైక్యాంద్ర ఉద్యమానికి కొత్త ఊపిరి నింపటానికి మరో ప్రకటన చేసి తెలంగాణ వాదుల, తెలంగాణ నాయకుల గుండెల్లో సమైక్యాంద్ర శంఖారావం అనే బుల్లెట్ ను ప్రయోగించటం జరిగింది.

 

కేంద్రంలో ఉన్న ఢిల్లీ పెద్దలకు సైతం సమైక్యాంద్ర శంఖారావం బుల్లెట్ ను హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రయోగిస్తే, ఏం జరుగుతుందో ముందే ఉహించుకోవటం జరిగిందని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే సమైక్యాంద్ర శంఖారావం సభ హైదాబాద్ లో పెడితే.. దాని ప్రభావం ఎలా ఉంటుందో.. తెలంగాణ నాయకులకు బాగా తెలుసు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఇంక బాగా తెలుసు. ఈ సభవల్ల కొన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయ మనుగడ ఉండదనే భయం పట్టుకుంది. అంతేకాకుండా సమైక్యాంద్ర శంఖారావం ప్రకటనంతో తెలంగాణ వాదులకు, తెలంగాణ నాయకులకు కంటిమీద నిద్రలేకుండా చేసాడు వైఎస్ జగన్. ఈ నెల 19న హైదాబాద్ లో సమైక్యాంద్ర కోసం సభ ఏర్పాటు చేయటానికి భారీ ఎత్తున్న సన్నాహాలు వైఎస్ జగన్ చేస్తున్నారనే మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

అయితే హైదరాబాద్ లో జరిగే సమైక్యాంద్ర శంఖారావం సభను ఎలాగైన అడ్డుకోవాలనే ఉద్దేశంతో.. తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది తమ నోటికి పని చెప్పి, తెలంగాణ నాయకుల చేతే తిట్లు తింటున్నారు. మరికొందరు ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుపుతున్నారు. అసలు తెలంగాణ వాదులు, తెలంగాణ నాయకులు.. ఎందుకు భయపడుతున్నారు? వారికి తెలంగాణ ఉద్యమం పై నమ్మకం లేదా? లేక కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం లేదా? ఎందుకు మీడియా ముందు మీ పరువు తీసుకుంటారని సీమాంద్ర ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక రాష్ట్ర విభజనను ఆపటం, సీమాంద్ర నాయకుల తల్లో జేజేమ్మ వచ్చిన సాధ్యం కాదని తెలంగాణ నాయకులే గొప్పగా చెబుతున్నారు.

 

అలాంటప్పుడు.. ఇలాంటి పిరికి వ్యాఖ్యాలు ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ వస్తుందనే నమ్మకం ఉంటే సైలెంట్ గా ఉండి ఏం జరుగుతుందో చూడండి? అంతేగానీ.. సమైక్యాంద్ర కోసం జగన్ సభ పెడితే.. రాష్ట్ర విభజన ఆగిపోతుందా? నడిరోడ్డులో కొరడాలతో కొట్టుకుంటే రాష్ట్ర విభజన ఆగుతుందా? గడ్డి తింటే రాష్ట్ర విభజన వెనక్కి పోతుందా? చెప్పండి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం అనే నమ్మకం మీకు ఎంత ఉందో. అంతే సమైక్యాంద్ర సాధిస్తాం అనే నమ్మకం సీమాంద్ర ప్రజల్లో ఉంది. ఎవరి నమ్మకం వారిది. నమ్మకంలేని వారిగా మీడియా ముందు పేలటం ఎందుకు? ‘‘ ఏమీ లేని ఆకు ఎగిరేగిరి పడుతుంది.. కానీ అన్ని ఉన్న ఆకు మాత్రం అణిగి ఉంటుందనే ’’ అనే సామెత గుర్తుకు వస్తుంది ’’ అంటే దీనిని బట్టి రాష్ట్ర విభజన అనేది ఆగిపోతుందనే భయం తెలంగాణ వాదుల్లో, తెలంగాణ నాయకుల్లో బలంగా ఉందనే విషయం బయటపడుతుంది.

 

అందుకే సమైక్యాంద్ర ఉద్యమం పై, జగన్ హైదరాబాద్ లో జరిపే సమైక్యాంద్ర శంఖారావం సభ పై తెలంగాణ వాదులు మాటల యుద్దం చేస్తున్నారు. తెలంగాణ నాయకులు అయితే ఒకడుగు ముందుకేసి, బేదిరింపులకు దిగుతున్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుందనే నమ్మకం ఉంటే? కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం ఉంటే? మీరు నిజంగా తెలంగాణ కావాలని కోరుకునే వారైతే..? సమైక్యాంద్ర కోసం చేస్తున్న ఉద్యమానికి, సమైక్యాంద్ర సభలకు అడ్డురాకండి? సీమాంద్రలో మేధావులు లేరనే విషయాన్ని మీరే చెబుతున్నా తెలంగాణ నాయకులారా.. , మేధావులేని ఉద్యమం పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? మేధావులు అనేవారు.. గొప్ప మనసు, సహనం, కలిగి ఉంటారు.

 

కానీ మీరు మేధావులు అని చెప్పుకుంటూ.. ఏమి తెలియని మూర్ఖులు మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అంటే మీ పై మీకు నమ్మకం ఉంటే.. నవ్వుతూ.. సమైక్యవాదులకు స్వాగతం పలకండి. మీకు రాష్ట్ర విభజన ఆగిపోతుందనే నమ్మకం ఉంటే.. మీరు సమైక్యవాదుల సభను, ఉద్యమాన్ని అడ్డుకోండి? అంతేగానీ, అనవరమైన విమర్శలు చెయ్యటం వలన వచ్చేది ఏమిటి? ఏం లేదు..కానీ తెలుగు వారి పరువు పోతుందనే విషయం ఇరుప్రాంతాల నాయకులు తెలుసుకోవాలి. మేధావులారా తెలుగు వారి పరువును కాపాడండి. ఇది ఇరుప్రాంత నాయకులకు వర్తిస్తుందని.. తెలుగు ప్రజలు చెబుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more