సీమాంద్ర ఉద్యమం అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ దొర గారు నిద్రలేచారు. సమైక్యాంద్ర ఉద్యమం ఉవ్వెత్తున్న లేవటానికి కారణం తెలంగాణ దొరే అని సీమాంద్ర నాయకులు, తెలంగాణ ప్రాంత నాయకులు అంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సమైక్యాంద్ర ఉద్యమానికి కొంచెం ఆజ్యం పోయటం జరిగింది. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత తెలంగాణ దొర కేసిఆర్ .. సీమాంద్ర ఉద్యోగులపై కురిపించిన నోటి దురుసు తనం వల్ల .. సీమాంద్రలో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతుంది. మళ్లీ తెలంగాణ దొర తొందరపడకపోతే.. సీమాంద్ర ఉద్యమం చల్లారిపోతుందనే ఉద్దేశంతో.. వెంటనే మీడియా ముందు తెలంగాణ దొర నోటి నుండి కొన్ని విచిత్రమైన కామెంట్స్ రాలిపడ్డాయి. ఈ కామెంట్స్ వెనుక ఉన్న అర్థం ఏమిటో ఆయనకే తెలియాలి. తెలంగాణ దొరకు తెలంగాణ రాష్ట్రం రావటం అసలు ఇష్టంలేదని ఢిల్లీ స్థాయిలోని నాయకులు అంటున్నారు. ఇప్పుడు కేసిఆర్ చేసిన కామెంట్స్ చూస్తే నిజమే అనే భావన తెలంగాణ ప్రజలకు కలుగుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఏపీ ఎన్జీవోల సభ కు అనుమతి తెలంగాణ దొర ఇచ్చినట్లు చెబుతున్నారు. మేము అనుమతి ఇవ్వబట్టే మీ సభ సక్సెస్ అయ్యిందని తెలంగాణ దొర గర్వంగా చెబుతున్నారు.
అదే మేం.. తలచుకుంటే.. సీమాంద్ర వాళ్లని తెలంగాణ పొలిమేర్ల కూడా అడుగుపెట్టేవారు కాదని తెలంగాణ దొర తలకాయను కిందకి, పైకి ఊపుతూ మీడియా ముందు చెప్పటం జరిగింది. తెలంగాణ దొర తలకాయను కిందకి ఊపిన ప్రతిసారి .. చపట్లు మోత వినబడుతుంది. పైకి, ఊపిన చపట్లు సౌండ్ ఆగిపోతుంది. అయితె తెలంగాణ దొర తెలంగాణ ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారో, ఏమీ సందేశం ఇవ్వదలచుకున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఒక్కటి మాత్రం అక్కడున్న వారందరికి అర్థమైంది. సీమాంద్రలో జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమానికి కొత్త ఆజ్యం పోయటం జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది. గతంలో సీమాంద్ర ఉద్యోగులపై తెలంగాణ దొర చేసిన విమర్శల వలనే.. సమైక్యాంద్ర ఉద్యమం ఊపిరిపోసుకుందనే విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఇలాంటి సందర్భంలో మళ్లీ తెలంగాణ దొర తన నోటిదులను ఇలా తీర్చుకుంటే.. కేంద్రం చేసిన విభజన ప్రకటనను వెనక్కి తీసుకున్న ఆశ్చర్యంలేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ఉద్యమం జరిగినప్పుడు సీమాంద్రల ప్రజలు మౌనంగా ఉన్నారు. సీమాంద్ర ప్రజలు ఏ రోజు తెలంగాణ ఉద్యమానికి అడ్డుగానీ, హానీగానీ కలిగించలేదు.. కానీ ఇప్పుడు వారు సమైక్యాంద్ర కోసం సీమాంద్రలో ఉద్యమం చేస్తున్నారు. అలాంటప్పడు.. తెలంగాణ ప్రజలు సమైక్యాంద్ర ఉద్యమానికి ఎలా అడ్డుకుంటాం అనే భావన తెలంగాణ ప్రజల్లో నిజాయితీగా ఉంది. ఇప్పుడు తెలంగాణ దొర లాంటి వారు మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో చేతికొచ్చిన రాష్ట్రం వెనక్కి పోయే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజలు, తెలంగాణ మేథావులు, ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్లితే.. అప్పుడు తెలంగాణ ప్రజల విశ్వరూపం ఏమిటో చూపిద్దాం. అంతేకానీ.. సీమాంద్ర ప్రజలను అడ్డుకోవటం, వారిపై దాడులు చేయటం, వారిని బాధించటం అనేది , తెలంగాణ ప్రాంతానికే మంచిది కాదని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇరుప్రాంతాల రాజకీయ నాయకులార.. మీ రాజకీయ పదవుల కోసం, మీ రాజకీయ జీవితం కోసం, ఇరుప్రాంతల ప్రజల స్వచ్చమైన మనసులను కలుషితం చెయ్యకండని.. తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. మీలాంటి నోటిదుల నాయకుల వల్ల .. రాష్ట్రం రావణాకష్టంగా మారిదనే విషయం తెలుసుకోండి? మీరు ఏసీ రూమ్ ల్లో, ఏసీ కార్లు తిరుగుతూ.. మీడియా కనిపించగానే..మీతిమీరీ మాట్లాడకండి? తెలుగు ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు.. మీకు తగిన బుద్ది చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని తెలుగు ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more