‘‘ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే... చుట్టకు నిప్పుకావాలని ఒకడొచ్చట’’ అనే విధంగా టిడిపి నాయకులు పరిస్థితి ఉందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఒక టీవీ ఛానల్స్ వారు జగన్ దీక్ష పై చర్చ వేదిక ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చర్చ వేధికలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తెలుగుదేశం పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు సాగాయి. వైఎస్ జగన్ దీక్ష ను ఆమరవీరుడు పొట్టి శ్రీరాములు దీక్షతో సరిపోల్చటం పై టిడిపి నాయకుడు వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. అసలు పొట్టి శ్రీరాములు ఎందుకు ఆమరణ నిరహర దీక్ష చేశారో తెలుసా అని వైసీపీ పార్టీ నాయకుడ్ని ప్రశ్నించారు. మద్రాస్ నుండి ఆంద్రప్రదేశ్ ను విడదీయటానికి దీక్ష చెయ్యటం జరిగింది కానీ, కలిసి ఉండటానికి ఆయన దీక్ష చెయ్యలేదని వర్ల రామయ్య చెప్పటం జరిగింది. దీనికి వైసీపీ నాయకులు మరో అర్థం చెప్పారు. పొట్టి శ్రీరాములు దీక్ష చేసి సాధించిన ఆంద్రప్రదేశ్ ను విడదీయకండి? ఆంద్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచాలని జగన్ దీక్ష చేస్తున్నాడని వైసీపీ గట్టిగా వాధించారు. ఇది కేవలం జగన్ బెయిల్ కోసమే దీక్ష అని వర్ల రామయ్య అనటంతో వైసీపీ నాయకులు రెచ్చిపోయి.. చంద్రబాబు దొంగ పాదయాత్ర చెయ్యలేదా? పాదయాత్రతో బాబు ఏం సాధించారు? తెలంగాణకు అనుకూలంగా లేఖగా రాసింది చంద్రబాబు కదా? ఇప్పుడేమో .. మళ్లీ సమైక్యా రాగం పాడుతుంది చంద్రబాబే కదా అని అనటం తో వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. జగన్ దీక్ష వల్ల ఏమీ జరగదని, 100 రోజలు ఆమరణ నిరహార దీక్ష చేసిన రాష్ట్రం విభజన జరగటం ఖాయమని అన్నారు. అంతేకాకుండా జగన్ ఆత్మహుతి చేసుకున్న రాష్ట్ర విభజన జరగటం ఆగదని వర్ల రామయ్య పదేపదే అనటం జరిగిందని మీడియా వర్గాలుఅంటున్నాయి. వైసీపీ నాయకులు, వైఎస్ విజయమ్మ, షర్మిల గానీ ఎవరైన.. ఇప్పటి వరకు సోనియాగాంధీని ఒక్క విమర్శ అయిన చేశారా. రాష్ట్ర విభజన పై ఎందుకు నిలదీయ్యటం లేదు, చంద్రబాబు వలనే, టిడిపి వలనే.. రాష్ట్ర విడిపోతుందని ఎలా అంటున్నారు. మీకు దమ్ముంటే.. సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి జగన్ ఆమరణనిరాహార దీక్షలు, ఆత్మహుతి చేసుకోండి? అయిన మాకు నష్టం ఏమి లేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరిగిపోయింది కాబట్టి ఎవరు ఎన్ని దీక్షలు చేసిన, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రావటం ఖాయమని వర్ల రామయ్య అంటున్నారు. అయితే వైసీపీ నాయకులు వర్ల రామయ్యకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.. కారణం అప్పటికే చర్చవేదిక సమయం మించిపోయిందని మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more