Harikrishna vs chandrababu naidu

harikrishna vs chandrababu naidu, TDP leaders Chandrababu Naidu vs Hari Krishna, Telugu Desam leader N Harikrishna, Harikrishna plans Chaitanya Yatra, TDP MP Hari Krishna resigns, Chaitanya Yatra in Seemandhra, Nandamuri Harikrishna, Chaitanya Yatra

harikrishna vs chandrababu naidu, TDP leaders Chandrababu Naidu vs Hari Krishna

బాబులో ఎన్టీఆర్ భయం? హరిక్రిష్ణ చైతన్య యాత్ర

Posted: 08/22/2013 03:06 PM IST
Harikrishna vs chandrababu naidu

చంద్రబాకు ఎన్టీఆర్ భయం పట్టుకుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. నిన్నటి బావ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్నా బావమరిది..నేడు బావ పై కయ్యానికి బస్సుయాత్ర మొదలపెడుతున్నాడు. నా తండ్రి పెట్టిన పార్టీ, నా తండ్రి ఆశయాలు, నా తండ్రి కోసమే నేను ఎంపీ పదవి రాజీనామా చేస్తున్నానని నందమూరి హరిక్రిష్ణ రాజ్యసభ సభ్యత్వానికిరాజీనామాచేయటం జరిగింది. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి అందజేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కలత చెందిన హరిక్రిష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేయటం జరిగింది. హరిక్రిష్ణ చేసిన రాజీనామాతో చంద్రబాబులోహైటక్ భయం పట్టుకుంది. ఎన్నో సార్లు అలుపెరుగని గజనిలా .. చంద్రబాబు పై రాజకీయ యుద్దం చేసి, అలసిపోయి.. చివరకు బావ వద్దకు చేరిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం వజ్రాయుదంతో హరిక్రిష్ణ ప్రజల ముందుకు వెళ్లుతున్నాడు. ఒక పక్క చంద్రబాబు ఆత్మయాత్ర అంటూ.. సీమాంధ్రలో తిరగటానికి సిద్దమైన విషయం తెలిసిందే. మరో పక్క హరిక్రిష్ణ బస్సు యాత్ర అంటూ సీమాంద్రలో తిరిగితే.. తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఎక్కువుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణ కు అనుకూలంగా ప్రకటన చేసిన విషయం పై సీమాంద్రలో కారాలు మిరియాలు నూరుతున్నారు. సెగతో రగిలిపోతున్న సీమాంద్రలో బావ, బావమరిది యాత్ర మొదలుపెడితే..చంద్రబాబుకు భారీ నష్టం జరుగుతుందని టిడిపి సీనియర్నాయకులు అంటున్నారు. సమైక్యాంద్రప్రదేశ్ నినాదంతో , చైతన్య యాత్ర చేపట్టనున్న హరిక్రిష్ణ, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తారన్న గుసగుసలు టీడీపీ భవన్ లో పార్టీ నాయకుల మధ్య వినిపిస్తున్నాయి. తన తండ్రి రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఆకాంక్షించేవారనీ, తెలుగు దేశం పార్టీ పుట్టిందే తెలుగు జాతి ఐక్యంగా వుండి, ప్రగతిని సాధించడం కోసమనీ ఆయన ఆశయాలను అనుగుణంగానే తాను నడుచుకుంటానని హరిక్రిష్ణ అంటున్నారు. సమైక్య నినాదంతో యాత్ర చేస్తే, సీమాంద్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ ఖాయమే. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు ఇక నుంచి హరిక్రిష్ణ వెంట నడిచే అవకాశాలు ఎక్కువు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సమైక్య యాత్రలో హరిక్రిష్ణ విజయం సాధిస్తే మాత్రం.. చంద్రబాబుకు రాజకీయ పరిస్థితి దారుణంగా ఉంటుందని సీనియర్ టిడిపి నాయకులు అంటున్నారు. సీమాంద్రలో ప్రజలు ఈ ఇద్దరు చేసే యాత్రలకు ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more