ఇటీవల కాలంలో ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు పెంచుతూ..ఉత్తర్వులు జారీ చేసింది. టెక్కెట్ రేట్లు పెంచటంతో.. సినిమా ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. పెంచిన రేట్లతో లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు ఉన్నాయని సినిమా థియేటర్ల యాజమన్య సంఘాలు అంటున్నాయి. సినిమా రెట్ల పెంపు వలన పెద్ద పెద్ద సినిమా మాల్స్ కు, ఐమాక్స్ లకు, లాభాలు వస్తాయి గానీ, జిల్లా స్థాయిలో ఉండే సినిమా హాల్స్ కు భారీ నష్టం జరుగుతుందని సినిమా హాల్ యజమానలు అంటున్నారు. అంటే ఇప్పటికే.. పెరిగిన సినిమా టిక్కెట్ రేట్లు వల్ల ..కొన్ని సినిమా హాల్స్ మూతపడ్డాయి. కొత్త సినిమా రిలీజ్ అయిన ఒక వారంలోనే.. బుల్లితెరపై రావటం, పైరసీ సీడీలు తక్కువ ధరకే దొరకటం వల్ల సినిమా అభిమానులు ఎక్కువ ధర పెట్టి సినిమా హల్స్ కు రావటంలేదు. కేవలం..రూ. 50లు సీడీతో కుటుంబ సభ్యులు మొత్తం ఆ సినిమాను విక్షిస్తున్నారు. పెరిగిన టిక్కెట్ రేట్లు వలన చిన్నచిన్న సినిమా హాల్స్ యాజమాన్యం పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే.. రోజుకు రెండో షోలే వేస్తున్నారు. మిగిలిన రెండు షోలకు జనాలు రావటంలేదు. ఒకవేళ వచ్చిన 10 , 20 మందికి సినిమా షో వేస్తే.. కరెంట్, ఆయిల్, సిబ్బంది, ఖర్చులు కూడా రావటంలేదని థియెటర్ల యజమాన్యం సంఘాలు అంటున్నాయి.
అయితే టిక్కెట్ రేట్లు పెంచినందుకు టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరో పండుగ చేసుకుంటున్నాడు. టిక్కెట్ రేట్లు పెంచాక నా సినిమా విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఇది నేను ఊహించలేదు. ఇది టిక్కెట్ ధరలు పెంచాల్సిన సమయం. ఐదారేళ్లకీ, ఇప్పటికీ పెట్రోల్, డీజిల్, కరెంట్.. ఇలా అన్ని వస్తువుల ధరలూ రెట్టింపయ్యాయి. మాకు షూటింగంటే జనరేటర్ రోజుకు 500 లీటర్ల డీజిల్ తాగేస్తుంది. రోజుకు కనీసం 150 మందికి భోజన సదుపాయాలు కల్పించాలి. వాళ్ల జీతాలు, మా యాక్టర్ల పారితోషికాలు రెట్టింపయ్యాయి. కానీ టిక్కెట్ రేట్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడవి పెరగడం సముచితం. రెండున్నర గంటల వినోదానికి ఆ మాత్రం ధరలుండటం కరెక్టే. ఆ టిక్కెట్ ధరల కంటే థియేటర్లలో అమ్మే కూల్ డ్రింక్స్, ఇతర తినుబండారాల ధరలే ఎక్కువగా ఉంటున్నాయి. టిక్కెట్ ధరలు పెరగడం వల్ల పైరసీ కూడా పెరుగుతుందని అనుకోను. ధరలు పెరిగినా, పెరగకపోయినా పైరసీ అనేది ఉంటుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పలేదు .. టాలీవుడ్ బిజినెస్ మ్యాన్, అమ్మాయిలకు గ్రీకువీరుడు.. ఆంటీలకు మన్మథుడు, సైలెంట్ బిజనెస్ లో ‘కింగ్ ’. హీరో అక్కినేని నాగార్జున. త్వరలో ఆయన నటించిన గ్రీకువీరుడు సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అందుకే నాగార్జున పండుగ చేసుకుంటున్నాడని.. టాలీవుడ్ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more