నందమూరి కుటుంబంలో ఉన్న రాజకీయ హీరోల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అటూ సినిమాల్లో బిజీగా ఉంటూ .. అప్పుడప్పుడూ తెలుగుదేశం పార్టీలో తళుకున్న మెరిసిపోయే జూనియర్ ఎన్టీఆర్ కు, ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోని రంగంలోకి దిగిన బాలయ్యల మద్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోల్డ్ వార్ బాగా ముదిరిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరంపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న బాలయ్యకు ఒక మంచి అవకాశం దొరికింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెజవాడ వెళ్లుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బాలయ్య తెలుగు దేశం కార్యకర్తలకు ఒక నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరు వెళ్లరాదు, బ్యానర్స్ కట్టరాదని ఒక ప్రకటన జారీ చేసినట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అ విషయం ముందుగానే తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన బ్యానర్ లో గానీ, ప్లెక్సీలో గానీ, బాలయ్య పోటోగానీ, చంద్రబాబు ఫోటో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ , పెద్ద ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే ఉండేలా చూసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్? ఏదో ఒక నాటికి పార్టీ పగ్గాలు నా చేతికే వస్తాయని అక్కడక్కడా జూనియర్ అంటున్నట్లు చంద్రబాబు, బాలయ్య ధ్రుష్టికి వచ్చాయి. అది మనసులో పెట్టుకున్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ బలం ఎంత ఉందో ఈరోజు బెజవాడులో తెలిసిపోతుందని పార్టీ నాయకులకు చెప్పినట్లు సమాచారం.
నిజానికి సీనియర్ ఎన్టీఆర్ , నందమూరి బాలయ్యకు అభిమానులు చాలా మంది జూనియర్ ను అభిమానిస్తారు. ఇది తెలుసుకున్న బాలయ్య ముందుగా జూనియర్ ప్యాన్స్ సంఘంలో ఉన్న టిడిపి అభిమానులకు కూడా దూరం పాటించాలనే మెజేస్ లు పెట్టినట్లు టీడీపి వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలుసుకున్న హరిక్రిష్ణ మాత్రం బాలయ్య మీద చాలా సీరియస్ గా ఉన్నట్లు పార్టీలో సీనియర్ నాయకులు అంటున్నారు. చంద్రబాబు ముందు బాలయ్య గెలుస్తాడో? లేక జూనియర్ ఎన్టీఆర్ గెలుస్తోడో చూడాలి? బాబు ఈ ఇద్దరి న్యాయం చేస్తాడా? అనే అనుమానం పార్టీ నాయకుల్లో మధ్య ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అప్పుడప్పుడు అరుపులు, అలుగడం చేసే ఎంపీ హరిక్రిష్ణకే కళ్లేం వేసి పార్టీ రింగ్ లో కూర్చోపెట్టిన విషయం ఎవరికి తెలియాదు చెప్పాండి? ఏ రాజకీయ పదవి లేకుండానే బాబాయ్ , అబ్బాయి వేసే వెర్రి వేశాలు బాబు చూస్తు ఉంటాడా చెప్పండి? చినబాబును కాదని వీరికి పార్టీ పగ్గాలు ఇస్తాడా? అయిన ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటున్నారు.
కానీ చంద్రబాబు ముందు ఈ ఇద్దరు వేసే గుప్పిగంతులు .. చివరకు ఫలితం మరోలా ఉంటుందని పార్టీలో సీనియర్ నాయకులు చెవులు కోరుకుంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడ తన మనసులో మాటను బయట పెట్టింది. ఎప్పటికైన నా భర్తను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కూడా బాలయ్య కొంచెం సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుటివరకు బాలయ్య భార్య గానీ, హరిక్రిష్ణ భార్య గానీ మీడియా ముందు రాజకీయ ప్రకటనలు చేసింది లేదు. నందమూరి మహిళ మణులు కూడా ఈ విషయంలో కొంచెం గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more