ఇటీవల హైదరాబాద్ నగరంలో జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ బాంబులు సైకిల్ తో పెల్చినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. పోలీసులకు సైకిల్ పెద్ద సవాల్ మారింది. ఆ సైకిల్ ఎవరిది అనే దానిపై విచారణ జరుగుతున్న సమయంలో ఆ సైకిల్ టిడిపి వాళ్లేదేనని ప్రకటన చేశారు బ్రదర్ అనిల్? వైఎస్ షర్మిల భర్త టిడిపి పార్టీ పై ఇలాంటి విమర్శలు చెయటంతో ఆ పార్టీ నాయకులు అవాక్కాయ్యారు. తాము ధర్మ యుద్దంలో ఉన్నామని, దేవుడు అన్నీ చూస్తున్నాడని , ప్రత్యర్థులు తమపై ఏ స్థాయిలో బురద చల్లినా.. ప్రజల విశ్వసనీయ చూరగొన్న తమ కుటుంబానిదే అంతిమ విజయం అవుతుందని బ్రదర్ అనిల్ కుమార్ అంటున్నారు. గత కొంత కాలంగా బీజేపి, టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బ్రదర్ అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. కావాలంటే నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని ఆయన ఆవేశంగా అన్నారు. బీజేపి, టీడీపీ నాయకులు కూడా వారి పిల్లల మీద ప్రమాణం చేయగలరా అని బ్రదర్ అనిల్ సూటిగా ప్రశ్నించారు. అయితే షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను ఓర్వలేక టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న రాజకీయ కుట్రలో బాగంగానే తనపై విమర్శకులు వస్తున్నాయని బ్రదర్ అనిల్ చెబుతున్నారు. చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని , సొంత మామనే వెన్నుపోటు పొడిచి, ఆయణ మరణానికి కారకుడైన వ్యక్తి చంద్రబాబేనని అనిల్ మండిపడ్డారు. కళ్లు ఆర్పకుండా అబద్దాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు మరొకరుండని వ్యాఖ్యానించారు.
నేను బిజినెస్ చేయడం తప్పా? నాకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. చంద్రబాబు వ్యాపారం చేయటం లేదా? ఐఎంజీ అనే సంస్థకు చంద్రబాబు భూములు కట్టబెట్టిన మాదిరిగా రాజశేఖరరెడ్డి ఏనాడు ప్రవర్తించలేదని , నియమనింబంధనలు కచ్చితంగా పాటించారని ఆయన తెలిపారు. అసలు వీరభద్రరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అలాంటిది ఆయన సూసైడ్ ను అంటగట్టడం చూస్తుంటే రాజకీయాలను నీచమైన స్థాయికి దిగజార్చుతున్నరని మండిపడ్డారు. టీడీపీ, బీజేపి నేతలు చేప్పెవన్నీ కారు కూతలేనని, వారి అబాంఢాలకు హద్దులేకుండా పోతోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. షర్మిల కారు ప్రస్తావన తెస్తున్నారు. కొండల్ రావుది ఆడి క్యూ5సీజీ, మాది ఆడి క్యూ 7సీజీ , కంపెనీ ఒకటే అయినంత మాత్రానా ఒకే గాటన కడతారా? అలాగైతే దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో సైకిల్ ను వాడారట. టీడీపీ సింబల్ సైకిల్ అని వారికి అంటగడతారా? అలా చేస్తే ప్రజలు నవ్వుకుంటారు, విమర్శలు చేసే వారు కొద్దిగా ఆలోచించాలి .. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే బ్రదర్ అనిల్ ఉద్దేశం ప్రకారం దిల్ సుఖ్ నగర్ లో సైకిల్ బాంబులు పెట్టింది టిడిపి నాయకులనే ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారని రాజకీయ నాయకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more