వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి చాపకింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నాయాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో విలీనం కుదరకపోతే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఈ ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపటానికి వైఎస్ ఆర్ ఆత్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ నాయకుల సమాచారం. ఈ పుణ్యకార్యనికి వైఎస్ ఆర్ ఆత్మబందువు అయిన కేవీపి నడుంబిగించారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేవిపి ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపటంతో తెలంగాణ పై నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణమాలు, ఆలస్యంగా వెలుగుచూస్తున్న వాస్తవాలు పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. అయితే ఇటీవల కేవిపి రామచంద్రరావు సీమాంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి షిండే, వయలార్ రవి, ఆజాద్, దిగ్విజయ్ సింగ్ కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. జగన్ తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలినీం చేయిస్తానని, అది సాధ్యం కాకపోతే ఎన్నికల్లో పొత్తుకు ఒప్పిస్తానని కేవిపి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
జగన్ తిరిగి కాంగ్రెస్ లో చేరితే ఇక పార్టీకి తిరుగుఉండదు కాబట్టి అప్పుడు తెలంగాణలో కొన్ని సీట్లు వచ్చినా కాంగ్రెస్ కు ఎలాంటి డోక ఉండదని కేవిపీ రాయభారం నడిపినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒక వేళ తెలంగాణ ఇస్తే సీమాంద్రలో జగన్ విజయం సాధిస్తారని, తెలంగాణలో కనీసం 20 సీట్లు సాధిస్తారని దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుదని ఆయన కాంగ్రెస్ పెద్దలకు వివరించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అందువల్ల తెలంగాణ ఇవ్వకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని, అప్పుడు జగన్ కూడా షరతులకు అంగీకరిస్తారని అధిష్టానానికి కేవిపి నచ్చ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రానికి సీఎం అయేందుకు జగన్ అంగీకరించరని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినట్టయితే జగన్ తమ షరతులకు అంగీకరిస్తారని ఆయన సన్నిహితులు చెప్పిన విషయాన్ని కేవిపీ పార్టీ పెద్దల ముందు ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. అవసరమైతే జగన్ కుటుంబ సభ్యులకు నచ్చచెబుతానని కేవీపి భరోసా ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more