తెలుగు దేశం పార్టీ లో చంద్రబాబు, బాలయ్యల మద్య ముఖ్యమంత్రి చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్యకు ముఖ్యమంత్రి దగ్గరవుతున్న కొద్ది తెలుగుదేశం పార్టీలో కొంతమంది మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి అంటే మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాదులేండి? రేపు ప్రమాణ స్వీకరం చేయబోతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ? గుజరాత్ లో మూడు సార్లు వరుసగా గెలిసిన ఘనత సాధించుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే మోడీ తన ప్రమాణా స్వీకరానికి ఆంద్రప్రదేశ నుండి కొంత మంది రాజకీయ పార్టీ నాయకులకు ఆహ్వనం పంపిన విషయం తెలిసిందే. అందులో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కూడా మోడీ ఆహ్వానం పంపించారు. పనిలో పనిగా, నందమూరి బాలయ్యకు మోడీ ఆహ్వానం పత్రికను పంపినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ విషయం టీడీపీ నాయకుల్లో చర్చ జరుగుతుంది. బాలయ్య మోడీ ప్రమాణ స్వీకరానికి వెళ్లితే పార్టీకి నష్టం వస్తుందని, పార్టీ ఇమేజ్ పోతుందని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు. మరికొందరు .. బాలయ్యకు పార్టీ పరంగా కాకుండా పర్సనల్ గా మోడీ ఆహ్వానం పంపించారు కాబట్టి బాలయ్య వెళ్లితే మంచిదని సీనియర్ నాయకులు అంటున్నారు. బాలయ్యను పిలవటానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయినందుకే బాలయ్యను మోడీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం చంద్రబాబు బాలయ్య చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మోడీ ప్రమాణా స్వీకరానికి వెళ్లొద్దు అని చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ లో కార్యకర్తగా అధినేతకు ఇష్టం లేని పని నేను చేయనని బాలయ్య తన విమాన టిక్కెట్ రద్దు చేసుకున్నట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. బాలయ్య మోడీ ప్రమాణానికి వెళ్లితే అక్కడ జరిగే విధానం చంద్రబాబు ముందుగానే పసిగట్టి బాలయ్యను వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని మోడీ బాలయ్యను ఆహ్వానించనట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే చంద్రబాబు బాలయ్యను జారి పోకుండా జాగ్రత్తగా పట్టుకున్నట్లు గా ఉందని రాజకీయ నాయకులు జోకులు వేసుకుంటున్నారు. బావ కోసం బాలయ్య మంచి అవకాశం వదులుకున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మోడీ మాత్రం టీడీపీని విడదీసేందుకు ఈ ప్లాన్ వేసినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసినప్పుడు గుర్తుకు రాని బాలయ్య ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చారు అని టీడీపీ ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇది మోడీ కుట్రలో బాగమని టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇందులో పావుగా బాలయ్యను వాడుకోవాలని మోడీ చూసినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more