గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఒక పెద్దాయనతో తలనొప్పి పుడుతుంది. అతని వలన మోడీ లాభమా? ..నష్టమా ? అనేది మోడికి అర్థంకావటంలేదట. గుజరాత్‌లో అనిశ్చితి ఫలితాలు వెలువడి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్వసించేవారు కొద్ది మందే ఉన్నారు. రికార్డు స్థాయిలో వోటింగ్ శాతం నమోదు కావడం వల్ల కచ్చితమైన వోటర్ల తీర్పు వెలువడగలదని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే సూచన చేస్తున్నాయి. గుజరాత్‌లో ఎప్పుడూ చ్చితమైన ఫలితాలే వెలువడ్డాయి. ఈ సారి ఫలితాలు కూడా నరేంద్ర మోడికే అనుకూలంగా ఉండగలవని భావిస్తున్నారు. అదే జరిగిన పక్షంలో గుజరాత్ కేవలం ఒక ముఖ్యమంత్రి (సిఎం)ని కాకుండా ఒక ప్రధాన మంత్రి (పిఎం)ని ఎన్నుకుందున్న మాట. కేశూభాయ్ పటేల్ సారథ్యంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ (జిపిపి) తీసుకువచ్చిన మార్పు కోసం వోటని నగరాలలో కన్నా గ్రామాలలోనే ఎక్కువగా చర్చించుకునే అవకాశం ఉంది.మోడి పతనం లక్ష్యంగా జిపిపి ప్రచారం సాగింది. అది కూడా హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కాగలదనే కలతోనే. హంగ్ సభ ఏర్పడిన పక్షంలో కొద్ది మంది ఎంఎల్‌ఎలతో మోడిని కాకుండా వేరే ముఖ్య మంత్రి విషయమై భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో బేరసారాలు సాగించే స్థితిలో జిపిపి ఉండగలదు. కాని మోడికి అనుకూలంగా తీర్పు సుస్పష్టంగా వెలువడేటట్లయితే కేశూభాయ్ చివరకుమోడి వ్యతిరేక వోట్లను చీల్చారని కాంగ్రెస్ వాదులు విరుచుకుపడవచ్చు. ప్రతీకారేచ్ఛతో ఊగిపోతున్న 84 ఏళ్ల కేశూభాయ్ తమ తురుఫు ముక్క అని ఒక వర్గం భావిస్తుండగా పటేల్‌ల సమీకరణం వల్ల ఇతర కులాలు సంఘటితం కాగలిగాయని ఇతరులు వాదించనారంభించారు. మోడిని కేశూభాయ్ చావుదెబ్బ తీశారా లేక తన ఆగర్భ శత్రువు, వారసుడు అయిన ఆయనకు మరింత మేలు చేశారా అనే ప్రశ్నకు ఈ నెల 20న ఇవిఎంలే సమాధానం ఇవ్వగలవు. జిపిపి నిలబెట్టిన 84 మంది అభ్యర్థులలో అధిక సంఖ్యాకులు తమ ధరావతు కోల్పోతారనడంలో సందేహం ఏమాత్రం లేదు. నిజానికి ఒక పార్టీ కోల్పోయిన డిపాజిట్ల విషయంలో రికార్డు నెలకొనవచ్చు కూడా. ఫలితం ఎలా వచ్చినా, కేశూభాయ్‌తో పాటు అసెంబ్లీకి వెళ్లే ఎంఎల్‌ఎల సంఖ్యతో పాటు జిపిపి వోట్లు కూడా తీవ్రాతితీవ్రంగా పోటీ సాగిన, గెలుపు ఆధిక్యాలు బాగా తక్కువ ఉండే స్థానాలలో నిశిత పరిశీలనకు రావచ్చు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more