ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఏ హీరోయిన్ అయిన ముందు వరుసలో ఉంటారు. ఈ సారి మాత్రం ఆయనంటే భయంతో వణికిపోతున్నారు. అంటే సినీ ప్రపంచంలో కాదులేండి. సినిమాలు తగ్గి , ఆదాయం కోసం ప్రైవేట్ యాడ్ చేస్తు బ్రతికే హీరోయిన్లకు ఇప్పుడు మహేష్ బాబు భయం పట్టుకుందట. మహేష్ బాబు చాలా కంపెనీలక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఆయన వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. అయితే రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఇప్పుడు హీరోయిన్లకే పరిమితం అయిన వస్త్ర ప్రపంచం కూడా ఇప్పుడు మహేష్ బాబు అడుగు పెట్టడంతో పెద్ద హీరోయిన్ నుండి చిన్న హీరోయిన్ వరకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నగల దుకాణాలకి హీరోయిన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. అదీకూడా మొదట మహేష్ బాబు జోస్ అలుక్కాస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత .. జూనియర్ ఎన్టీఆర్ మలబార్ గోల్డ్, నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి .. హీరోయిన్లకు గుడ్ బై చెప్పారు. నగల దుకాణాలను మొత్తం హీరోల వశం చేసుకున్నారు. పాపం హీరోయిన్లకు చోటు లేకుండా చేశారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోవడంతో.. హీరోయిన్లకు కొత్త భయం పట్టుకుందట. హీరోయిన్స్ ఆదాయానికి గండి కొట్టినట్లు గా ఉందని హీరోయిన్స్ వాపోతున్నారని టాలీవుడ్ ప్రజలు అనుకుంటున్నారు. ఈ డీల్ వెనక మహేష్ బాబు భార్య హస్తం ఉందని ఫిలింనగర్ టాక్.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more