అంచలెంచలుగా ఎదుగుతున్న మెగా స్టార్ చిరంజీవికి మంత్రి పదవి రాబోతుందనే వార్తలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. మెగా స్టార్ చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త పై చిరంజీవి కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి తన పదవి కన్న తనను నమ్ముకున్న నాయకులకు పదవులు కావాలని సీఎం ముఖ్యమంత్రితో బేటి అయినట్లు తెలుస్తోంది. తన మంత్రి పదవి కంటే .. తన పై నమ్మకం ఉంచిన రాజకీయ నాయకుల కోసం చిరంజీవి పడుతున్న ఆరాటం కాంగ్రెస్ నాయకులను ఆశ్చర్యంలోకి నెట్టిందని ..కాంగ్రెస్ సినీయర్ నాయకులు అంటున్నారు. తన పదవి వస్తే చాలు.. నన్ను నమ్ముకున్న నాయకులు ఏమైన పర్వలేదు అనుకొనే ఈ రోజుల్లో .. చిరంజీవి తన నాయకుల పై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, చూసి కాంగ్రెస్ నాయకులు చిరంజీవి కొనియాడుతున్నారు. మంచి నాయకుడు కాంగ్రెస్ పార్టీ కి దొరికినందుకు చాలా ఆనందంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే కేంద్రంలో మాత్రం చిరంజీవికి స్టీల్ మంత్రి పదవి ఇవ్వటానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దమైనట్లు ఢిల్లీ నాయకులు చెబుతున్నారు. ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆయన మంత్రిగా పదవీస్వీకారం చేయవచ్చు.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్తీకరణకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నందున చిరంజీవికి బెర్త్ లభించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆయనకు షిప్పింగ్ శాఖను ఇవ్వవచ్చని కూడా అంటున్నారు.అయితే రాష్ట్రంలో సమతుల్యత ఉండే విధంగా కేంద్రంలో కూడా మంత్రి పదవులు ఉంటాయా? లేదా అన్నది చూడాలి. కొంతకాలం క్రితం వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ కు కేంద్రంలో కాబినెట్ పదవి ఇచ్చారు. అయితే సాయిప్రతాప్ ను తప్పించారు. ఇక పల్లంరాజు, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి కూడా మంత్రులు గా ఉన్నారు.తెలంగాణ నుంచి జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. స్టీల్ మంత్రి గా బెని ప్రసాద్ వర్మచేస్తున్నారు. అయితే స్టీల్ మంత్రి పదవి కేంద్రలో ఇస్తారో , లేక స్టేట్ మంత్రి గా చేస్తోరో అనే విషయం మాత్రం తెలియాలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పటికి వరకు స్టీల్ మంత్రిగా చేసిన వారు అశోక్ కుమార్ సేనా, వీరభద్ర సింగ్, రామ్ విలాస్ పాశ్వన్, ఇప్పుడు ప్రస్తుత స్టీల్ మంత్రిగా బెని ప్రసాద్ వర్మ ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more