కామెంట్ అంటే ఏదో అనుకోండి? రెబల్ సినిమా గురించి దర్శకుడు లారెన్స్ ప్రభాస్ ఫ్యామిలీ మొత్తన్ని పొగడ్తలతో ముంచేసాడు. సినిమా అలస్యం అయినందుకు కోపం రాకుండా వారి కుటుంబాన్ని బాగా కాకపట్టినట్లు తెలుస్తోంది. రెబల్ ఆడియో ఫంక్షన్ లో కడుపు నిండా పెట్టాలన్నా... స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాసే అని, ఆ రేంజిలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ పండించాడని దర్శకుడు రాఘవ లారెన్స్ చెప్పారు. ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్లో రూపొందిన రెబల్' ఆడియో వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు. ప్రభాస్ ఫ్రెండ్ షిప్ కి మర్యాదనిస్తాడు. వచ్చిన పేరును నిలబెట్టుకోవడానికి చాలా కష్ట పడతాడు, ఈ సినిమాకు రెబల్ అనే టైటిల్‌ని ప్రభాసే సూచించాడని తెలిపారు. రెబల్ సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలు వెల్లడిస్తూ.... ప్రభాస్‌కి కథ చెప్పాను,విన్న తర్వాత కొంచెం మాస్‌గా ఉంటే బాగుంటుందని అన్నారు. ప్రభాస్ కోరిక మేరకు కథలో మార్పులు చేసాను.
రెబల్ సినిమాను డీల్ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేసాను. హీరోయిన్స్ డేట్స్ ప్రాబ్లం రావడం కూడా మరో కారణం. మొదట ఈచిత్రంలో కీలక పాత్రకు శరత్ కుమార్‌ని అనుకున్నాం, కానీ పెద్దనాన్నే కరెక్ట్ అని ప్రభాస్ చెప్పడంతో కృష్ణంరాజు గారికి తగిన విధంగా మార్పులు చేయడానికి కూడా కొంత సమయం పట్టిందని లారెన్స్ అన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది. ఒకరకంగా ఈచిత్రం ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రం ద్వారా ప్రభాస్‌కు మాస్‌లో మరింత ఫాలోయింగ్ పెరుగుతుందని లారెన్స్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more