గుజరాత్‌లో ముఖ్యమంత్రి మోడీ, బీహార్ సిఎం నితీష్‌కుమార్ మధ్య పోటీ తప్పేలాలేదు. బీహార్‌లో జెడియు, బిజెపి కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి మోడీ, నితీష్ కుమార్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన మోడీ తమ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తే అంగీకరించేది లేదని నితీష్‌కుమార్ కరాకండిగా చెప్పారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ రెండు పార్టీల మధ్య సంబంధాలు అంత సవ్యంగా లేవు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జెడియు అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇక్కడ ప్రకటించారు. బిజెపితో మిత్రత్వం కొనసాగిస్తామని అయితే గుజరాత్‌లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. గుజరాత్‌లో జెడియు ఒంటరిగా పోటీ చేస్తున్నంత మాత్రాన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. మరో విషయం ఏమిటంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ యాదవ్, నితీష్‌కుమార్ ఇద్దరూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
గుజరాత్ తరహాలోనే బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ జెడియు ఒంటిరి పోటీకి దిగుతుందా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. గుజరాత్‌లో ఎన్ని సీట్లుకు పోటీచేస్తారన్న ప్రశ్నకు పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇలా ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లకు పోటీ చేయాలని జెడియు రాష్ట్ర శాఖ నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. గుజరాత్‌లో ఒంటరిగా పోటీకి దిగడం అన్నది తమకు కొత్తకాదని ఇదివరకే ఎన్నికల బరిలో దిగామని యాదవ్ గుర్తుచేశారు. అలాగే మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో జెడియు పోటీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర శాఖలు నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు. గతంలో కూడా తాను, నితీష్ కుమార్ కలిసి ఎన్నికల ప్రచారం చేసిన సందర్భాలున్నాయని ఇప్పుడూ ఇద్దరం ప్రచారం చేస్తామని ఎన్డీఏ కన్వీనర్ పేర్కొన్నారు. బీహార్‌లో జెడియు సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎనిమిదేళ్ళుగా అధికారంలో ఉంది. జార్ఖండ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడులో సందర్భాన్ని బట్టి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more