Kvp vs v hanumantha rao

kvp ramachandra rao Vs V Hanumantha Rao on YSR Book,KVP Ramachandra Rao, YS Rajasekhara Reddy, Death Anniversary, September 2nd, Delhi AP Bhavan, YSR Padayathra Book Release Invitation, Hyderabad Jubilee Hall, Congress Leaders, YS Jagan, Support, People, Gulam Nabi Azad, YSR Padayathra Photos

kvp ramachandra rao Vs V Hanumantha Rao on YSR Book

kvp.gif

Posted: 09/04/2012 06:59 PM IST
Kvp vs v hanumantha rao

kvp ramachandra rao Vs V Hanumantha Rao on YSR Book

రాష్ట్ర కాంగ్రెస్‌లో అధిష్ఠానం తీవ్రస్థాయిలో కాయకల్పచికిత్సకు పాల్పడేందుకు సన్నద్ధమవుతోందన్న వార్తలు వస్తున్న తరుణంలో రాష్ట్రానికి చెందిన ఇరువురు తలపండిన నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరిలో ఒకరు.. రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేవీపీ రామచంద్రరావు. మరొకరు.. అనేక రాజకీయ యుద్ధాల్లో తలపండిన యోధుడు వి.హనుమంతరావు. వీరిలో కేవీపీ.. పార్టీలో వైఎస్ వర్గం మనుగడ దెబ్బతినకుండా పకడ్బందీగా ఒక వ్యూహాన్ని అమలు చేస్తుండగా.. వి.హనుమంతరావు పార్టీలో వైఎస్ అనే పేరు లేకుండా, వైఎస్ అనుయాయుల ఊసే లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేవీపీ 7న ఢిల్లీలోనూ.. వీహెచ్ 8న జుబ్లీహాలులోనూ సమావేశాలు తలపెట్టారు. కాగా.. వైఎస్ తన పాదయాత్ర సందర్భంగా రాసుకున్న డైరీని పుస్తక రూపంలో ప్రచురించి, దాన్ని వైఎస్ మూడోవర్ధంతి సందర్భంగా ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ నెల 7న భారీస్థాయిలో ఆవిష్కరించేందుకు కేవీపీ అపూర్వ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు.

kvp ramachandra rao Vs V Hanumantha Rao on YSR Book

ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ , వీరప్ప మొయిలీతో పాటు పలువురు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులను కేవీపీ ఆహ్వానించారు.ఢిల్లీలో తనకున్న సంబంధాలను ఉపయోగించి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు వారు సుముఖత వ్యక్తం చేసేలా చూశారు. అంతేకాక, ఈ కార్యక్రమానికి తాను స్వయంగా రాలేకపోయినప్పటికీ అది దిగ్విజయం కావాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా కేవీపీకి లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు రాష్ట్ర నేతలను, ఎంపీలను కూడా ఈ సమావేశానికి ఆయన ఆహ్వానించారు. వారితో పాటు వి.హనుమంతరావుకు కూడా కేవీపీ లేఖ రాయడం గమనార్హం.మరోవైపు.. 8న జూబ్లీహాలులో వీహెచ్ ఒక బృహత్తర భేటీకి తెరతీశారు. 1972 నుంచీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షులుగా, ఆఫీసు బేరర్లుగా, పనిచేసిన వారందరితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో చర్చించడమే ఈ సదస్సు ఉద్దేశం. కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, ముకుల్‌వాస్నిక్‌లను ఈ సమావేశానికి రమ్మని కోరారు. ముఖ్యఅతిథిగా ఉండాల్సిందిగా సీఎం కిరణ్‌కు, పీసీసీ చీఫ్ బొత్సకు లేఖలు రాశారు.రాజ్యసభ లాబీలో వీహెచ్.. పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరాకు కేవీపీపై ఫిర్యాదు చేశారు.

kvp ramachandra rao Vs V Hanumantha Rao on YSR Book

కాంగ్రెస్‌లో ఉంటూ వైఎస్ భజన చేస్తే ఏవరికి లాభిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేవీపీ సతీమణి ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి సభకు హాజరైన విషయాన్ని ఆయన వోరాకు చెప్పగా.. ఈ విషయాన్ని ఆజాద్‌కు చెప్పాలని వోరా సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఆజాద్‌కు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వైఎస్ పాదయాత్రపై పుస్తకం విడుదల చేసి, సభను ఏర్పాటు చేస్తే ఎవరికి లాభం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఒక వైపు వైఎస్ భార్య విజయలక్ష్మి కాంగ్రెస్‌ను తూర్పారపడుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం వైఎస్‌ను ఆకాశానికెత్తుతూ భజన గీతాలు ఆలపించడం పార్టీకి ఉపయోగపడదని ఆయన వాపోయారు. ఈ రకంగా ఢిల్లీలో కేవీపీ-వీహెచ్‌ల పోరు తారస్థాయికి చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali tribal century ys jagan centry in jail life
Chandra babu naidu dharna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more