ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్తానం లో, వివిధ భావాలు పలికించగల నటులు ఎంతో మంది... కొందరు కుటుంబ కథా చిత్రాలు కోసమే పుట్టినట్టుగా ఓదిగిపోయి నటిస్తే, మరి కొందరు భక్తీ రస చిత్రాలలో కథానాయకులుగా మెరిసారు, ఇంకొందరు సామాజికి ప్రయోజనం ఉన్న కథలను ఎంచుకునే వారు... అయితే, ప్రత్యేకించి అరవయ్యో శతకం లో రొమాంటిక్ హీరోగా మెరిసిన, అమ్మాయిల కళల రాకుమారుడిగా మెప్పించిన, కథానాయకుడు, హరినాథ్...
ఈ నటుడి జయంతి, సెప్టెంబర్ రెండు... ఈ సందర్భంగా, ఇవాల్టి లెజెండ్స్ లో హరినాథ్ గారి సిని ప్రస్తానం గురించిన కొన్ని అనుభవాలు, మీ కోసం...
ధనవంతుల కుటుంబం లో పుట్టిన హరనాథ్ గారికి, చిన్నపాతినుంది, చదువుతో పాటు, నాటకాల పై కూడా ఆసక్తి... డిగ్రీ పూర్తీ అయిన తరువాత, మద్రాస్ చేరుకున్న హరినాథ్ గారు, ఒక రోజూ, బస్సు స్టాండ్ లో నించుని తన స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన రూపం ఒకానొక సిని దర్శక - నిర్మాతని ఆకర్షించింది... హరినాథ్ గారికి సినిమాల్లో హీరోగా అవకాశం లభించింది... అయితే, మొదటి సినిమా అనుకున్న విజయం సాధించలేకపోయింది... కాని హరినాథ్ గారి రూపం, సహజ నటన, ఆరు అడుగుల ఆజానుబాహుడైన ఈ అందగాడి రూపం తెలుగు సిని పరిశ్రమలో హేమా హేమీలు అందరిని ఆకర్షించింది... విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, నందమూరి తారక రామ రావు గారిని కూడా... అందుకే తాను దర్శకత్వం వహించిన 'సీత రామ కల్యాణం' లో రాముదిగాను, తనకు ముందుగా నటించే అవకాశం వచ్చిన ఆ అవకాశాన్ని కాదు అనుకుని, తాను చెయ్యవలసిన, కృష్ణుడి పాత్రని 'భీష్మ' చిత్రం లో హరినాథ్ గారికి నటించే అవకాశం ఇచ్చి, తెలుగు సినిమా పరిశ్రమ లో, రామ రావు గారి తరువాత అంతటి పౌరాణిక పురుషుడిగా హరినాథ్ గారికి పేరు ఒచ్చేలా చేసారు రామ రావు గారు... ఆ తరువాత, 'గుండమ్మ కథ', వంటి ఎన్నో సాంఘిక చిత్రాల లో కూడా హరినాథ్ గారు నటించి మెప్పించారు...
ఒక వైపు కథానాయకుడిగా నటిస్తూనే, మరో వైపు క్యారెక్టర్ నటుడిగా ఎన్నో చిత్రాలలో నటించి తన నట జీవితాన్ని సమన్వయపరుచుకున్నారు, హరినాథ్... ఈ తరుణం లో, అరవయ్యో శతకం లో, 'లేత మనసులు' చిత్రం విడుదల అయ్యి, ఘన విజయం సాదించింది... హరినాథ్ గారిని రొమాంటిక్ హీరో గా నిలబెట్టింది... ఇక అప్పటినుండి, పదమూడు సంవత్సరాల పాటు, తిరుగులేని అందమైన, విజయవంతమైన కథానాయకుడిగా, అమ్మాయిల కళల రాకుమారుడిగా, హరినాథ్ గారి సిని ప్రస్తానం కొనసాగింది...
కాని, అనవసర ప్రలోభాలకు లొంగి, తన అందమైన రూపాన్ని పాడు చేసుకుని, పరిశ్రమకు దూరమయ్యారు, హరినాథ్...
సహజమైన, పాత్రకు ఉచితమైన నటనను ప్రదర్శించడం, సున్నితమైన ప్రేమ భావాన్ని, తెరపై నాయికలతో అంటే సహజంగా పలికించడం, హరినాథ్ గారి సొంతం... జమున గారు, వాణిశ్రీ గారితో హరినాథ్ గారు ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు... ఒకానొక దశలో, నాయికలందరూ హరినాథ్ గారితో నటించాలని పోటీ పడేవారట...
అలా, తన రూపం, నటన, విజయవంతమైన సినిమాలతో, తెలుగు సిని పరిశ్రమ ఉన్నంత కాలం, రొమాంటిక్ హీరో గా గుర్తుందిపూతారు, హరినాథ్ గారు...
ఈ మహా నటుడి జయంతి సందర్భంగా ఆయనను మరొక్కసారి తలుచుకున్నాం, మన లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా ద్వారా...
సునయన వినయ్ కుమార్
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more