ప్రేక్షకుడ్ని జ్ఞానిగా, ప్రజ్ఞావంతునిగా, మేధాసంపత్తిగలవానిగా భావించే దర్శకుల సృజన నుంచి మహోన్నతమైన మాణిక్యాలు ఉద్భవిస్తాయి. శంకరాభరణం, అంతులేని కథ, సాగరసంగమం, ఇది కథకాదు, ముత్యాలముగ్గు, స్వాతిముత్యం, ఆకలిరాజ్యం, స్వయంకృషి... ఇవన్నీ ఆ కోవకు చెందిన సినిమాలే. ప్రేక్షకులపై దర్శకులకున్న ఉన్నతభావానికి ఆ సినిమాలన్నీ నిలువెత్తు నిదర్శనాలు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాలు మాత్రం ప్రేక్షకులపై దర్శకులకున్న చిన్నచూపుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ‘ట్రెండ్’ అనే రెండక్షరాలను అడ్డం పెట్టుకొని ‘మూస’లో కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో గత స్మృతులను నెమరువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కె.విశ్వనాథ్ ‘స్వయంకృషి’ సినిమాను కాసేపు గుర్తుచేసుకుందాం. ఎందుకంటే.. నేటికి ఆ సినిమా వచ్చి పాతికేళ్లయ్యింది.ఈ చిత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున చిరంజీవి నటనకుగాను నంది అవార్డు లభించింది .‘శుభలేఖ’ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ’స్వయం కృషి’. చిరంజీవికి ఉత్తమ నటుడుగా స్వర్ణనందిని తెచ్చిన కళాత్మక చిత్రం ఇది.’స్వయంకృషి’లో అయితే కోర్టు సీన్‌లో బ్రహ్మాండమైన నటనను ప్రదర్శించి ముందు తరాలవారికి మార్గదర్శి అయ్యాడు.అది 1986వ సంవత్సరం. ఇప్పటిలాగే మసాలా సినిమాలు తెలుగుతెరపై రాజ్యమేలుతున్న రోజులవి. పైగా చిరంజీవి ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి తరుణంలో వచ్చిందో న్యూస్. ‘చిరంజీవి హీరోగా పూర్ణోదయా వారి సినిమా’ అని. దాంతో పరిశ్రమలో గుసగుసలు మొదలయ్యాయి. ‘కొంపదీసి చిరంజీవితో ‘శంకరాభరణం’ తీస్తాడా ఏంటి... ఏడిద నాగేశ్వరరావు’ అంటూ గుసగుసలాడిన వాళ్లూ లేకపోలేదు. ఆ వ్యాఖ్యలు విని తనలో తానే నవ్వుకున్నారు నాగేశ్వరరావు. ఓ వైపు తమ ఆస్థాన దర్శకుడైన కె.విశ్వనాథ్ కథ కూడా సిద్ధం చేసేశారు.
హీరో చర్మకారుడు, రావిచెట్టుకింద చెప్పులు కుట్టడం అతని వృత్తి. హీరోయినేమో గుడి ముందు చెప్పుల స్టాండ్ నడుపుతుంటుంది. ఇలాంటి పాత్రలను ప్రధానంగా తీసుకొని కథ చెబితే ఏ నిర్మాతకైనా గుండెల్లో దడం ఖాయం. కానీ ఏడిద నాగేశ్వరరావు మాత్రం కథ ఆసాంతం విని తన్మయానికి లోనయ్యారు.‘విజయం ఖాయం’ అన్న నిర్ణయానికొచ్చేశారు. ఇక చిరంజీవి విషయానికొస్తే... ఆయన దాదాపుగా అగ్రస్థానానికి చేరువలో ఉన్నారు. అలాంటి తరుణంలో ఏ హీరో అయినా ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తారు. అలాగే చిరంజీవి కూడా అభిమానుల గురించే ఆలోచించారు. తన అభిమానులకు డాన్సులు, ఫైట్లతో పాటు ఆశయసాధన, క్రమశిక్షణ, కార్యదీక్షలు కూడా కావాలనుకున్నారాయన. వారిలో స్ఫూర్తిని నింపడానికి ‘స్వయంకృషి’ చేయాలని నిశ్చయించుకున్నారు.కథానాయికగా విజయశాంతిని, మిగిలిన పాత్రలకు చరణ్‌రాజ్, సుమలత, సర్వదమన్ బెనర్జీ తీసుకున్నారు. రమేష్‌నాయుడు సంగీత దర్శకునిగా ఓకే అయ్యారు. అలా 1986 నవంబర్ 12న మైసూర్‌లో ‘స్వయంకృషి’ షూటింగ్ మొదలైంది. మైసూర్, శ్రీరంగపట్నం, ఊటి, కాంచీపురం, మద్రాసు తదితర ప్రాంతాల్లో 60 రోజులు షూటింగ్ చేశారు. 1987 సెప్టెంబర్ 3న ఈ సినిమా విడుద లైంది. కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు, చర్మకారుడు సాంబయ్యగా చిరంజీవి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. 25 కేంద్రాల్లో వందరోజులాడిందీ సినిమా. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమనటునిగా ‘బంగారు నంది’ని కూడా అందుకున్నారు చిరంజీవి. మాస్కో చలనచిత్రోత్సవంలో కూడా ‘స్వయంకృషి’ ప్రదర్శితమైంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more