రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు భార్యభర్తలను కూడా వేరు చేస్తూ ఒక్కొక్కరిని తన వైపుకు లాక్కొంటోంది. ఇది చిత్తూరు జిల్లాలో సంభవించింది. అదీ అల్లాటప్పా…దంపతులను విడదీయలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సీకే బాబు అలియాస్ సీకే జయచంద్రరెడ్డి భార్య వైఎస్ఆర్ సీపీలో జాయిన్ అవ్వనుందని సమాచారం. ఈ మేరకు ఆమె వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. దీంతో ఆమె త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు.
మొదట్లో జగన్ వెంటనడిచిన సీకే బాబు అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవించడానికి చివరకు అధికార పార్టీలోనే ఉండిపోయాడు. కానీ లోలోపల జగన్ తో సంబంధాలు నెరిపిన సీకే ఇప్పుడు వ్యూహాత్మకంగా భార్యను రంగంలోకి దించుతున్నాడు. ముందుగా భార్యను ఆ పార్టీలోకి పంపి ఒక టికెట్ కన్ఫర్మ్ చేసుకొని అదును చూసి తాను కూడా వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేసేలా సీకే బాబు వ్యూహం పన్నుతున్నాడు. ఒకవైపు కొంత మంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుమారులను జగన్ పార్టీలోకి పంపుతూ సీట్లు రిజర్వ్ చేయించుకొంటుంటే…సీకే బాబుకు అంత పెద్ద కొడుకు లేకపోవడంతో ఏకంగా భార్యనే రంగంలోకి దించి ఔరా అనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ధర్మాన కృష్ణదాస్- ధర్మాన ప్రసాదరావు ద్వారా అన్నాదమ్ములను, కొంతమంది మంత్రులను కొడుకులను ఆకర్షించి తండ్రీ కొడుకులను, నన్నపనేని రాజకుమారి కూతురిని పార్టీలో చేర్చుకొని తల్లీకూతుళ్లను, పీజేఆర్ కూతురు విజయను చేర్చుకొని అన్నా చెళ్లెళ్లను(ఆమె సోదరుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నాడు) రాజకీయంగా వేరు చేసిన వైఎస్ఆర్ సీపీ ఇప్పుడు భార్యభర్తలను కూడా రాజకీయ విరోధులుగా చేసి కొత్త రికార్డు స్థాపించింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more