మనిషికి ఆశ అనేది ఎలాంటి పనికైన ప్రోత్సహిస్తుంది. ఆశకు చావులేదు. కొంతమంది దీనిని ఆయుధంగా ఉపయోగించుకుంటారు. ఆశ ను ఆయుదంగా చూపించి ..తమ పనులు చేయించుకుంటారు. ఆశపడిన మనిషి ..వారిచ్చే ..తాయిలాలకు ఆశపడి అక్రమ మార్గంలో పనులు చేసి పెడతారు. అలాంటి సమయంలో ధర్మం గురించి , న్యాయం గురించి , మంచి చెడుల గురించి, గానీ అసలు ఆలోచించారు. ఎవరు ఏమైతే నాకేమిటి? అనే ఒక్క ప్రశ్న వారిని ఇలాంటి ఊబిలోకి దిగేటట్టు చేస్తుంది. ఇలాంటి పనుల వలన ఫలితం మెరుపుల కనిపించి మాయమైపోతుంది. చివరకు ఆ పాపం వీరికి ఉరితాడు అవుతుంది. ఇప్పుడు అలాంటి ఒక విషయం జరిగింది. అయితే ఇక్కడ ధర్మం కోసం ఆయన నిజాయితీగా నిలబడి..మచ్చలేని చంద్రుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. అతను ఘనుల కుంభకోణ .. కుంభకర్ణుడు గాలి జనార్థన్ రెడ్డి. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. గాలి బయటకు రావటానికి బెయిల్ కోసం అక్రమ దారులు వెతికి ..చివరకు జడ్జీలకు డబ్బు ఆశ చూపించి బెయిల్ పై బయటకు వచ్చాడు గాలి. ఇప్పుడు ఆ బెయిల్ కోసం గాలి జడ్జీల చుట్టు తిరిగి బెరాలు పెట్టిన విషయం బయటపడిన విషయం తెలిసిందే. ఈ బెయిల్ రేసులో జడ్జీ లకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. న్యాయాన్ని అంగడి సరకుగా మార్చి బెయిల్‌ను బేరానికి పెట్టిన కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఓఎంసీ అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇస్తే రూ.40 కోట్లు ఇప్పిస్తానంటూ ఓ జడ్జిని మరో జడ్జి ప్రలోభపెట్టారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ కారు బాంబు కేసు ప్రత్యేక కోర్టు జడ్జిగా ఉన్న నాగమారుతీ శర్మకు ఆయన సీబీఐ కోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఈ బంపర్ ఆఫర్ వచ్చిందట.
ఈ బెయిల్ స్కాంలో అరెస్టయిన నిందితుల విచారణలో నాగమారుతీ శర్మ పేరు కూడా వినిపించింది. ఆయనకు కూడా ముడుపులు ఇవ్వజూపినట్లు నిందితులు తెలపడంతో దర్యాప్తు అధికారులు నాగమారుతీ శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దీని ప్రకారం 2011 ఏప్రిల్‌లో సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జిగా వచ్చిన తన వద్దకు ఆర్‌సీ నెంబర్-7(ఏ)/2009 పెండింగ్ కేసు వచ్చిందని వివరించారు. "ఈ కేసులో నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి. ఏప్రిల్ మూడో వారంలో అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ కె. లక్ష్మీనరసింహారావు ఫోను చేసి తనను కలుస్తానన్నారు. నాకంటే సీనియర్ జడ్జి, రిజిస్ట్రార్ కూడా అయినందున నేనే వచ్చి కలుస్తానని చెప్పాను. ఆయన తన ఇంటి అడ్రస్ చెప్పారు. సరిగా గుర్తుకు లేదు కానీ ఏప్రిల్ 18, 2012న అనుకుంటా.. ఆ రోజు ఉదయం లక్ష్మీనరసింహారావు ఇంటికి వెళ్లాను. మాటల మధ్యలో గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని లక్ష్మీనరసింహారావు ప్రతిపాదన తెచ్చారు. నేను దాన్ని తోసిపుచ్చాను. న్యాయ మార్గాన్ని వదలడం నాకు మరణంతో సమానమని చెప్పాను. రూ.40కోట్లు ఇచ్చేందుకు గాలి వర్గం సిద్ధంగా ఉన్నట్లు లక్ష్మీనరసింహారావు చెప్పారు. అయినప్పటికీ నేను గుడ్డిగా ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఆయన ఇంటి నుంచి బయటకొచ్చేశాను. కేవలం సీనియర్ జడ్జి అన్న గౌరవంతోనే లక్ష్మీనరసింహారావు ఇంటికెళ్లాను. హైకోర్టు రిజిస్ట్రార్ కూడా అయినందున ఏదైనా కేసు గురించి సమాచారం అవసరముంటే పిలిచారని భావించాను''అని నాగమారుతీ శర్మ వాంగ్మూలం ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more