లక్ష్మణ్ లేకపోవడం టీమ్ ఇండియాకు పెద్ద లోటు... లక్ష్మణ్ ఆడకపోవడం భారత జట్టుకు నష్టమే... లక్ష్మణ్ జట్టులో ఉంటే ప్రత్యర్థులకు వణేకే.. ఈ మాటలన్నది టీవీ వ్యాఖ్యాతలు కాదు. భారత మాజీ ఆటగాళ్ళు అసలే కాదు.. అసలు వాళ్లది మనదేశమే కాదు. అయినా వారి మాటల్లో వీవీఎస్ లక్ష్మణ్ పై గౌరవం ధ్వనించింది. అతనంటే భయం కనిపించింది. వాళ్లంతా న్యూజిలాండ్ క్రికెటర్లు.అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వీవీఎస్ లక్ష్మణ్ లేని లోటు జట్టులో కనిపిసుందని భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని అంటున్నాడు. లక్ష్మణ్ తన రిటైర్ మెంట్ ప్రకటించడానికి ముందు తనతో మాట్లాడేందుకు విఫల యత్నం చేసిన నేపథ్యంలో ధోని ట్విట్టర్‌లో అతనిపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ లేని లోటు జట్టులో అందరికీ కనిపిస్తుందని ధోని చెప్పటం ఆశ్చర్యంగా ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ‘వివిఎస్ మొత్తం జట్టుకు నువ్వు లేని లోటు కనిపిస్తుందని ధోని చెబుతున్నాడట. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యుత్తములలో నువ్వు ఒకడివి. బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నీతో ఎంతో సమయం గడిపాం. జట్టు గురించే సరదా మాటలు సాగాయి. జట్టు కేక్ కట్ చేస్తున్నప్పుడల్లా నువ్వు లేని వెలితి స్పష్టంగా కనిపిస్తుందని ధోని చెప్పినట్లు తెలుస్తోంది.
వ్యక్తిగతంగా నిజంగా నేను నిన్ను కోల్పోతున్నాను లచ్చూ భాయ్’ అని ధోని ట్విట్టర్‌లో రాసినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్ట్‌ల సీరీస్‌కు తాను ఎంపికైనప్పటికీ తక్షణం రిటైరవుతున్నట్లు శనివారం లక్ష్మణ్ ప్రకటిస్తూ, తాను ఎంతగా ప్రయత్నించినా ధోనితో ఫోన్‌లో మాట్లాడలేకపోయానని చెప్పి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. ‘నేను ధోనితో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కాని అతనిని పట్టుకోవడం ఎంతో కష్టమని మీకందరికీ తెలిసిందే కదా’ అని లక్ష్మణ్ హైదరాబాద్‌లో విలేకరు గోష్ఠిలో మందస్మిత వదనంతో అన్నాడు. ఇది ఇలా ఉండగా, ఆ స్టైలిష్ రైట్ హ్యాండర్‌కు కేవలం క్రికెటర్ల నుంచే కాకుండా ఇతర క్రీడాకారుల నుంచి కూడా అభినందనలు లభించాయి. ‘వివిఎస్ జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. క్రికెట్ ప్రపంచం బాధ పడుతుంది. ఆస్సీ క్రికెట్ వేడుక చేసుకుంటుంది’ అని టెన్నిస్ మేటి మహేష్ భూపతి ట్వీట్ చేశాడు. ‘మొక్కవోని బ్యాట్స్‌మన్, క్రికెట్‌కు రాయబారి, వివిఎస్ లక్ష్మణ్ లేని వెలితి ఇండియాకు కనిపిస్తుంది. అన్నింటికీ మించి నేను కలుసుకున్న అత్యుత్తములలో ఒకడివి’ అని ఒలింపిక్ రజత పతక విజేత రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నాడు. యువ భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కూడా ఆ వెటరన్‌ను ట్విట్టర్‌లో కొనియాడాడు. ‘వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్. అంతకు మించి ప్రత్యేక వ్యక్తి. నిజంగా స్ఫూర్తి ప్రదాత. ప్రతిభకు ప్రతీక. లక్ష్మణ్ భాయ్! నువ్వు లేని లోటు కనిపిస్తుంది’ అని కోహ్లి పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more