తిరుమల వెంకన్న మాతృమూర్తి వకుళ దేవి మాత ఆలయ పునరుద్దరణ మళ్ళీ తెరపైకి వచ్చింది. పేరూరు కొండపై ఉన్న అతిపురాతన వకుళామాత ఆలయం కూలిపోయే అవకాశం ఉందని, ఆలయాన్ని పునరుద్ధరించాలని ఎందరు మొత్తుకుంటున్నా జిల్లా అధికారులు
పెడచెవిన పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం పేరూరు కొండపై వెలసిన వకుళ దేవి మాత ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పేరూరు బండపై ఉన్న వకుళా దేవి ఆలయం 17వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు గ్రామపంచాయితీ పరిధిలో ఈ ఆలయం ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మాతృమూర్తిగా కొనియాడబడుతున్నవకుళ దేవి మాత ఆలయం పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది.
దశాబ్దాల కాలంగా టిటిడి ఈ ఆలయాన్ని పట్టించుకోక పోవడంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆక్రమణకు గురికాగా, కొండ మొత్తం క్వారీగా మారిపోయింది. సమీప గ్రామాల ప్రజలేకాక భారతీయ జనతాపార్టీ పలు దఫాలుగా ఆందోళనలు నిర్వహించడంతో గతంలో స్పందించిన టిటిడి నాలుగేళ్ళ క్రితం ఆలయ పునర్నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటిచింది. అయితే అదే ప్రాంతంలో నిర్మాణం సాధ్యం కాదని, అలిపిరి వద్ద ఆలయ నిర్మాణాన్ని చేపడతామని అప్పటి ఇఓ రమణాచారి ప్రకటించారు. కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. దానిపై విమర్శలూ వెల్లువెత్తాయి.
తల్లి ఆలయాన్ని శ్రీవారి పాదాల చెంత కట్టడం భావ్యం కాదంటూ మత గురువులూ అడ్డుచెప్పారు. దాంతో ఊపు తగ్గించిన టిటిడి మళ్ళీ ఆ వ్యవహారాన్ని పూర్తిగా మరుగున పడేసింది. ఇంకేముందీ పేరూరు బండ రోజురోజుకూ కరిగిపోయింది. అదే సమయంలో క్వారీ దారులు కూడా వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కొండల్లోని బండను నమ్ముకున్న మా బతులు కొట్టొద్దంటూ క్వారీల్లో పని చేసే కూలీలు ఆందోళన మెదలుపెట్టారు. వాస్తవానికి క్వారీ యజమానులు ఆడించిన నాటకమే అయినా అదే ప్రధానంగా మారిపోయింది.
అక్కడ పని చేస్తున్న కూలీలందరికీ టిటిడిలో ఉద్యోగాలిస్తే ఆలయ నిర్మాణానికి తాము అడ్డుతగలమని క్వారీదారుల తెగేసి చెప్పారు. దీంతో టిటిడికి మరో సవాల్ ఎదురైనట్లయ్యింది. దీంతో ఈ విషయంపై సుమారు యేడాదిపాటు అటు జిల్లా యంత్రాంగం, టిటిడి యంత్రాంగం సుదీర్ఘ చర్చలు జరిపాయి. తరువాత పేరూరు కొండను క్వారీ నుంచి మినహాయిస్తున్నట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. అయితే వకుళ దేవి మాత ఆలయనిర్మాణంపై టిటిడి ఎటువంటి చర్యలు తీసుకోపోవడంతో ప్రస్తుతం శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. టిటిడి సాక్షాత్తూ శ్రీనివాసుని తల్లినే విస్మరిస్తోందంటూ దుయ్యబడుతున్నారు. వెంటనే ఆలయ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా వకుళామాత ఆలయ పునరుద్ధరణకు ప్రభత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more