జగన్‌ను మహాత్ముడితో పోల్చుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అందరికీ అవమానం కలిగినట్లు గా ఉందని గుంటూరు ప్రజలు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శ్రీనివాస రావు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జగన్‌ను, మహాత్ముడిని పక్క పక్కన ఉంచి వారిద్దరినీ జైలులో ఉన్నట్లు ఆ ఫ్లెక్సీలో చిత్రీకరించటం అనేక మంది మండిపడుతున్నారు. తెల్లదొరల కాలంలో మహాత్ముడు జైలుకు వెళ్లారని, నల్ల దొరల కాలంలో జగనన్న జైలుకు వెళ్లారని ఆ ఫ్లెక్సీలో రాసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . అంతేకాదు ఓ మహాత్మా ఇది న్యాయమా అంటూ చివరలో రెండు వ్యాఖ్యలు కూడా రాయటం జరిగిందని గుంటూరుప్రజలు అంటున్నారు. . దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రెగినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . గాంధేయవాదులు, స్వాతంత్ర్యాభిమానులు, సామాన్యులు, రాజకీయ నేతలు అందరూ దీనిని ముక్తకంఠంతో ఖండించారు, ఖండిస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుపై జగన్ పార్టీ నేతలు కూడా మౌనం వహించినట్లు తెలుస్తోంది.. ఫ్లెక్సీ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులు అక్కడకు వచ్చి దానిని చించి వేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
ఇలాంటి ఫ్లెక్సీలు భవిష్యత్తులో ఏర్పాటు చేయకుండా తాజా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన శ్రీనివాస రావుపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ను గాంధీజీతో పోల్చడం సిగ్గు చేటు గా ఉందని స్థానికులు చెబుతున్నారు ఇలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి గూండాలను వెంటేసుకొని తిరిగే జగన్‌ను మహాత్ముడితో పోల్చడం విడ్డూరమని కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంత రావు అంటున్నారు. గాంధీజీ ప్రపంచంలోనే మహోన్నతుడు. అలాంటి మహోన్నతుడికి జగన్‌కు పోలికా అని ఆయన మండిపడినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . తన భర్తను సోనియా చంపించిందని, హెలికాప్టర్ ప్రమాదం కాదని, తన కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి ప్రజల్లో సానుభూతి పొంది మాత్రమే ఇటీవల ఉప ఎన్నికలలో ఆ పార్టీ గెలిచిందని, భవిష్యత్తులో ప్రజలు రియలైజ్ అవుతారన్నారు. ఇలాంటి రౌడీ మూకను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని విహెచ్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. జగన్ పార్టీ నేతలకు పిచ్చి ముదిరిందని, అది పరాకాష్టకు చేరుకుందన్నారు. గాంధీజీతో జగన్‌ను పోల్చిన వారిని అమాయకులుగా, శాడిస్టులుగా చెప్పవచ్చునని టిడిపి నేతలు అంటున్నారు. ఆయనను జాతిపితగా ప్రపంచం గుర్తించిందని, జగన్ మాత్రం అవినీతి పితామహుడు అని టీడిపి ఎద్దేవా చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి అయితే ఇలాంటి పోలిక సిగ్గుచేటుగా ఉందని వారు అంటున్నారు. అభిమానం హద్దులు దాటి వెర్రిగా మారిందని టీడీపీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more