మన రాష్ట్రంతో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోనూ వరుసగా కురుస్తోన్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని రిజర్వాయర్ లో భారీగా వరద నీరు చేరింది. అశ్వరావుపేట మండలంలో పెదవాగు పూర్తిగా నిండిపోయింది. ముఖ్యంగా భద్రాచలం ఏజన్సీలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా ఈ ప్రాంతంలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం కేంద్రంగా 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు చర్ల వద్ద తాలిపేరు జలాశయంలోకి వరద నీరు ఉధృతంగా వచ్చి చేరుతోంది. దీంతో 13 గేట్లు ఎత్తివేశారు. 24వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. ఇదిలా ఉండగా, సీలేరులో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ కారణంగా ఖమ్మం జిల్లా చింతూరు పల్లపు ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులను అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, వరుణుడి ప్రకోపానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది.రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న భారీవర్షాల మూలంగా ఆకస్మికవరదలు సంభవించి కొండచరియలు విరిగిపడుతున్నాయి.10మంది మృతిచెందగా, 38మంది ఆచూకీ లభ్యం కాలేదు.ఇళ్ళను వరదలు ముంచెత్తుతు న్నాయి.దాదాపు 30ఇళ్ళు కొట్టుకుపోయాయి. వరదల్లో గంగోరి బ్రిడ్జి కూడా కూలి పోయింది.ఛార్దం యాత్రకు వస్తున్న యాత్రికులు విడిదిచేసిన ఇళ్ళు జలమయమై వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు.గర్‌వాల్ ప్రాంతం ప్రకృతి వైపరీత్యపు బీభత్సానికి గురైంది.దీంతో, రాష్ట్ర ప్రభుత్వం హైలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా, ఎంఇటి విభాగాన్ని అప్రమత్తం చేసింది.ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైన్యం సహాయాన్ని కూడా కోరింది. ఉత్తరకాశీ జిల్లా అప్పర్ హిల్స్‌లో19మంది కార్మికులతో నడుస్తున్న ప్రభుత్వ ఆధీనంలోని యుజెవిఎన్ లిమిటెడ్ అస్సీ గంగ హైడెల్ ప్రాజెక్ట్ కూడా వరద బీభత్సానికి కొట్టుకుపోయింది. జిల్లాలోని గంగోరి, డుండ, ఉత్తరకాశీ పట్టణం, బర్‌కోట్ ప్రాంతాల నుంచి 19మంది కొట్టుకుపోగా, వారి ఆచూకీ ఇంకా దొరుకలేదు.'మేం తప్పిపోయిన వారి జాడకోసం గాలిస్తున్నాం' అని ఉత్తరకాశీ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్.రాజేష్‌కుమార్ తెలిపారు.గడచిన 24గంటల్లో కురిసిన భారీవర్షాలవల్ల వేర్వేరు సంఘటనల్లో 10మంది మరణించారని ప్రకృతి విపత్తుల నివారణ, ఉపశమన కేంద్రానికి (డిఎంఎంసి) చెందిన అధికారవర్గాలు వెల్లడించాయి. విపత్తుల పీడిత ఉత్తరకాశీ జిల్లాలోని ఆకస్మికవరదలు పల్లపు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. గంగోరి ప్రాంతం వద్ద అగ్నిమాపక దళానికి చెందిన ముగ్గురు జవాన్లు, ఇద్దరు
ఇతరులు మరణించారు. కాగా, గంగోత్రి, భగీరథి వద్దకు నిర్వహిస్తోన్న ఛార్దం యాత్రను రెండోరోజు కూడా రద్దుచేశారు.ఉత్తరకాశీలోని గంగోరి ప్రాంతంలో భగీరథినది ప్రమాద సంకేతస్థాయినిదాటి ప్రవహిస్తున్న కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.'గంగోరిలో అగ్నిమాపకదళానికి చెందిన ముగ్గురు జవాన్లు, ఇతరులు ఇద్దరు మరణించారు' అని రాష్ట్ర విపత్తుల నివారణ మంత్రి యశ్‌పాల్ ఆర్య చెప్పారు.ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్ జిల్లాలోని డుండా ప్రాంతంలో మరో ఇద్దరు మృతిచెందారు.శనివారం తెల్లవారుజామున చమోలి జిల్లాలోని కరర్ణ్‌ప్రయాగ్ ప్రాంతం వద్ద ఒక ఇల్లుకూలి ఇద్దరు పిల్లలు మరణించారు. చమోలి జిల్లాలోని పోఖ్రీ ప్రాంతంలో ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడి బద్రీనాథ్ మార్గంలో జాతీయరహదారి పూర్తిగా స్థంభించి పోయింది.కొండచరియలు జారిపడి భద్రీనాథ్‌ను సందర్శించే వందలాది యాత్రికులు పాతాళగంగ, లాంబగర్, బైరహి ప్రాంతాల్లో చిక్కుకు పోయారు.కాగా, కేదారీనాథ్ పుణ్యక్షేత్రం యాత్రను కూడా రద్దుచేసినట్లు అధికారులు వెల్లడించారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more