మంత్రుల కమిటీ నివేదిక కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. కమిటీ నివేదికపై విమర్శలు వెల్లువ మొదలైంది. సీనియర్లను సంప్రదించకుండా తూ.. తూ.. మంత్రంగా నివేదిక రూపొందించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ పటిష్టం కావాలంటే మేథోమధనం జరగాలన్న డిమాండ్ ఊపందుకుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడిపై పరోక్ష విమర్శలు వస్తున్నాయి. ఉపఎన్నికల పరాజయంతో అయోమయంలో పడ్డ కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు చేస్తోన్న ప్రయత్నాలు వారినే ఇరుకున పెట్టేలా తయారయ్యాయి. నిజానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినప్పుడే అనేక విమర్శలు వచ్చాయి. కమిటీలో కేవలం మంత్రులను మాత్రం నియమించడం ఏమిటని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోజే అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోని సిఎం, పిసిసి అధ్యక్షుడు త్వరగా నివేదిక ఇవ్వాలని కోరడంతో ధర్మాన నేతృత్వంలోని కమిటీ నెలరోజుల పాటు కసరత్తులు చేసి నివేదికను అందచేసింది. దీనిపై వెనువెంటనే విమర్శలు వెల్లువ మొదలైంది.
తెలంగాణ ఎంపీలు కూడా కమిటీ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటే కమిటీపై దామోదర్ రెడ్డి చేసిన విమర్శలను వీహెచ్ సమర్ధిస్తోనే మరింతగా ఘాటుగా విమర్శలు గుప్పించారు. పార్టీలో సీనియర్లకు విలువ లేకుండా పోయిందని, తమ అభిప్రాయాలు తీసుకోకుండా నివేదిక ఎలా తయారు చేస్తారని మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రిపై నేరుగా ఒత్తిడి చేసేందుకు సిద్దమైన వీహెచ్ గాంధీభవన్ ముందు మౌన దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రుల కమిటీపై సీనియర్లు చేస్తోన్న విమర్శలను సీఎం వర్గీయులు తేలిగ్గా తీసుకున్నారు. తమ సొంత పనుల కోసం సీనియర్లు అప్పుడప్పుడు ఇలా ఉగ్రరూపం దాల్చుతారని వ్యాఖ్యానిస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more