నల్లగొండ జిల్లాను భూతంలా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ నిర్మూలనకు అసెంబ్లీ హౌస్ కమిటీ నడుం బిగించింది. సమస్య నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించిన కమిటీ సభ్యులు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు ఉండాలని తీర్మానించింది. రూ.200కోట్లతో 18సంక్షేమ విభాగాల ద్వారా స్వల్పకాలిక ప్రణాళిక తయారు చేశారు. వైద్య శిబిరాల ద్వారా ఫ్లోరోసిస్ పీడితులను గుర్తించి వారికి వైద్య సాయంతో పాటు 40శాతం వైకల్యం ఉన్న వారికి అంగవైకల్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. మరోవైపు సమావేశానికి హాజరైన నల్లగొండ జిల్లా కలెక్టర్ ఫ్లోరోసిస్ నివారణకు 6వేల కోట్లతో ప్రణాళిక సిద్ధంచేసి కమిటీకి నివేదిక ఇచ్చామన్నారు. జిల్లాలో ప్లోరైడ్ అత్యధిక శాతంగా ఉన్న 17మండలాలను 'ఎ' కేటరిగా, 1.5పిపిఎమ్ నుంచి 2.5పిపిఎమ్ ప్లోరైడ్ శాతం ఉన్న 32 మండలాలను 'బి' కేటగిరి గా గుర్తించినట్లు నివేదికలో తెలిపామన్నారు. ప్లోరోసిస్ బాధితులకు 1000రూపాయలు పించన్, అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు పంపిణీ చేయాలని సూచించామన్నారు.
ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా రెండు లక్షలకుటుంబాల ఇళ్లలో మునగ, జామ, కరివేపాకు, బోప్పాయి, నిమ్మ చెట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. 801పాఠశాలలకు, 255ప్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు కృష్ణానీరు సరఫరా అయ్యేట్లు చూస్తామన్నారు. పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ప్రతివిద్యార్ధికి రోజు పావులీటర్ పాలతో పాటు గుడ్డు ఇస్తామన్నారు. పీడిత గ్రామాల్లో వంటకు అల్యుమినయం పాత్రలకు బదులు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు పంపిణీ చేస్తామన్నారు. ఆగస్టు 15నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగించే అవకాశముందని తెలిపారు. అయితే వీటికి 68కోట్లు ఇప్పటికిపుడు వచ్చే అవకాశముందన్నారు. ఇకమీదట ప్లోరైడ్ బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నేషనల్ ప్లోరోసిస్ రిసెర్చ్ ఇన్ స్టుట్యూట్ కూడా త్వరలో నల్లగొండలో ఏర్పాటుకానుందని కలెక్టర్ తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని 135ప్లోరైడ్ పీడిత గ్రామాలకు త్రాగునీటిని ఇవ్వాల్సిందిగా మెట్రో వాటర్ అధికారులకు సూచిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నక్కలగండిఎత్తిపోతల పథకం గురించి స్పీకర్ కు నివేదికలు ఇచ్చామన్నారు.
ఫ్లోరైడ్ నివారణ చర్యలపై సుదీర్ఘంగా చర్చించటం, పర్యటించటం, సమీక్షించటంతో జిల్లా అధికారులు సుమారు రూ.6వేల కోట్లతో ఒక ప్రణాళికను సిద్ధం చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. అయితే నల్లగొండ జిల్లా అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికను స్పీకర్ అంగీకరిస్తారా..? ఆ మేరకు నిధులు మంజూరు చేస్తారా..? చేయించేలా మన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏ మేరకు ఒత్తిడి చేయగలరో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more